
తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష గొప్పదని.. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన భాష అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గురువారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
అలాగే తెలుగు ప్రజలందరికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు అనేది కేవలం భావవ్యక్తీకరణ కోసం ఉపయోగించే ఒక భాష మాత్రమే కాదని.. యుగయుగాలుగా కవుల ఊహలకు రెక్కలు కట్టి, మన పండితుల జ్ఞానానికి పదును పెట్టిన మన జాతి ప్రాచీన వారసత్వానికి ప్రాణం అని పేర్కొన్నారు.
తెలుగు ప్రాముఖ్యతను, విశిష్టతను మరింతగా ఇనుమడింపజేయడానికి తమ ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నానని అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే తెలుగు వారందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment