‘అలా అయితే.. కంగనా నటన వదిలేస్తుంది’ | Kangana Ranaut Sister Rangoli Chandel Challenges To Industry | Sakshi
Sakshi News home page

పరిశ్రమకు సవాలు విసిరిన కంగనా సోదరి!

Published Fri, Mar 13 2020 12:02 PM | Last Updated on Fri, Mar 13 2020 2:29 PM

Kangana Ranaut Sister Rangoli Chandel Challenges To Industry - Sakshi

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి చందేల్‌ తరచూ సోషల్‌ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. కాగా రంగోలి తాజాగా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు సోషల్‌ మీడియా వేదికగా బుధవారం సవాలు విసిరారు. ప్రస్తుత హీరోయిన్‌లలో ఎవరైనా రూ. 60 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జేట్‌తో లేడి ఓరియంటెడ్‌ సినిమాలు తీస్తే..  కంగనా తన నటనను పూర్తిగా వదులుకుంటుందని ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం రంగోలి ట్వీట్‌ బీ-టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ‘నేను పరిశ్రమకు బహిరంగంగా సవాలు చేస్తున్నాను. కంగనా కాకుండా ప్రస్తుత హీరోయిన్లలో ఎవరైనా లేడి ఓరియంటేడ్‌ సినిమాలను రూ. 60 నుంచి రూ. 100 కోట్ల బడ్జేట్‌తో తీస్తే... ఇక కంగనా తన ఆక్టింగ్‌ కెరీర్‌ను పూర్తిగా వదిలేస్తుంది. లేదంటే నా పేరు మార్చుకుంటాను’ అంటూ ట్వీట్‌ చేశారు. 
ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా కంగనా.. ఫస్ట్‌ లుక్‌

ఇక కంగనా ట్వీట్‌ చూసిన కొంతమంది... ప్రస్తుత హీరోయిన్లలో కూడా కంగనాకు ఏమాత్రం తీసిపోని వారు ఇండస్ట్రీలో ఉన్నారంటూ కామెంట్‌ చేస్తున్నారు.  ఇందుకు రంగోలీ.. ‘మీరు ఓకవేళ అలానే భావిస్తే.. ఓ విషయం గుర్తు పెట్టుకోండి. ప్రస్తుతం మంచి నటులు ఇండస్ట్రీలో ఉన్నారన్నది నిజమే. అది నేను కూడా అంగీకరిస్తాను. అయితే వారు కూడా లీడ్‌ రోల్‌ పాత్రలు చేశారు కానీ.. వారి సరసన కచ్చితంగా హీరో పాత్రలు ఉన్నాయి. ఇక కంగనా లీడ్‌ రోల్‌లో నటించిన మణికర్ణిక, క్వీన్‌, తను వెడ్స్‌ మను రిటర్న్స్‌(టీడబ్ల్యూఎమ్‌ఆర్‌) సినిమాలు తనని ప్రముఖ హీరోలా సరసన నిలబెట్టాయని విశ్లేషకులే వెల్లడించిన విషయం అందరికీ తెలుసు. మీరు, నేను మాత్రమే అనుకున్నది కాదు’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అంతేగాక కంగనా టీడబ్ల్యూఎమ్‌ఆర్‌, మణికర్ణిక సినిమాలు లేకపోతే తనకు ‘తలైవి’, ‘ధాకడ్‌’ సినిమాల ఆఫర్‌లు వచ్చేవి కాదని పేర్కొన్నారు. కాగా చాలా మంది ప్రతిభావంతులు ఇండస్ట్రీలో ఉన్నప్పటికి పెట్టుబడులు పెట్టాలంటే నిర్మాతలకు నమ్మకం కలిగించాలని అన్నారు.

‘కంగనా ముందు పెద్ద సవాల్‌’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement