ముగ్గులతో నిరసన
ముగ్గులతో నిరసన
Published Sun, Jan 15 2017 9:25 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM
గోస్పాడు(నంద్యాల): రాయలసీమ సాగునీటి సమితి పిలుపు మేరకు..సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ముగ్గులతో నిరసన తెలిపారు. గోస్పాడు మండలంలోని జిల్లెల్ల, పసురపాడు గ్రామంలో మహిళలు ముగ్గులు వేసి..జీవో 69ని రద్దు చేయాలని, శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండేలా చట్టబద్ధత చేయాలనే డిమాండ్‌ను రాశారు. సిద్ధేశ్వరం అలుగు చేపట్టాలని, రాయలసీమకు నరు.. భిక్ష కాదని, ప్రజల హక్కు అని పాలకులు గుర్తించాలనే వాక్యాలు ముగ్గుల్లో కనిపించాయి. జై రాయలసీమ అంటూ మహిళలు తమ ఆకాంక్షను తెలుపుతూ ముగ్గులు వేశారు.
Advertisement
Advertisement