బీజేపీ బిగ్ విక్టరీపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి తిరిగి వచ్చిన బాలీవుడ్ క్వీన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారట. బీజేపీ సాధించిన అద్భుతమైన విజయంపై ఫుల్ హ్యాపీగా ఉన్న కంగనా చెఫ్ అవతార మెత్తారట. ఈ విషాయాన్ని కంగనా సోదరి రంగోలి చందేల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కంగనా వంటలు చాలా అరుదుగా చేస్తుంది..ఎంతో సంతోషంగా ఉంటే తప్ప..కానీ రుచిరకరమైన పకోడీలు, కాఫీ వడ్డించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ చారిత్రాత్మక విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసిందని రంగోలి పేర్కొన్నారు. జై హింద్.. జైభారత్ అంటూ ట్విటర్‌లో కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేశారు. అలాగే తమ జనరేషన్‌లో నరేంద్రమోదీలాంటి నాయకుడిని పొందడం అదృష్టమంటూ రంగోలి చందేల్ కూడా మోదీకి అభినందలు తెలిపారు.
Kangana cooks rarely, when she is absolutely exhilarated, today she treated us with chai pakodas for @narendramodi Ji’s win #JaiHind #JaiBharat 😁🥳 🙏 pic.twitter.com/6hJIuxby9W
— Rangoli Chandel (@Rangoli_A) May 23, 2019
Comments
Please login to add a commentAdd a comment