Land Slide
-
తమిళనాడులో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి!
చెన్నై: ఫెంగల్ తుపాన్ కారణంగా తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. ఫెంగల్ తుపాన్ ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కాగా, సోమవారం మధ్యాహ్నం తిరువణ్ణామలైలో దేవాలయం వద్ద ఉన్న నివాసంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.TODAY, LANDSLIDE HITS #Tiruvannamalai, Tamil Nadu, India 🇮🇳 (Dec 02, 2024)Rescue operations are ongoing to locate 7 missing people trapped in a landslide, with thick rocks and debris hindering efforts.#TNRains | #cyclon pic.twitter.com/XehTWMa5df— Weather monitor (@Weathermonitors) December 2, 2024ఇదిలా ఉండగా.. వర్షాల కారణంగా ఇప్పటికే తమిళనాడులో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో అందులో కొందరు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. తుపాన్ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పలు చోట్ల వరదల ధాటికి బస్సులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 🌊🇮🇳MASSIVE FlOODS HITS KASARAGOD.(DECEMBER 02, 2024)Siriyā Highway inundated in Kasargod, as Cyclone Fengal brings heavy rains to Northern Kerala, India.#Keralarains | #CycloneFengal pic.twitter.com/FneXAdKvGq— Weather monitor (@Weathermonitors) December 2, 2024Current situation: Arasur Main Road, Chennai-Trichy National Highway, flooded. Traffic halted due to severe waterlogging.India 🇮🇳 #CycloneFengal #ChennaiRains pic.twitter.com/ReArSN5ZYh— Weather monitor (@Weathermonitors) December 2, 2024 -
శ్రుతి జీవితంలో మరో పెను విషాదం
వయనాడ్ విలయంతో కుటుంబాన్ని కోల్పోయిన ఆమెకు.. కాబోయేవాడు అండగా నిలిచాడు. కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు శ్మశానవాటికకు చేరుకొని.. ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఇద్దరూ వివాహంతో ఒక్కటి కావాల్సి ఉంది.ఈ లోపు విధి ఆమెపై మరోసారి కన్నెర్ర చేసింది.కేరళ వయనాడ్ విలయం తర్వాత.. ప్రధాని మోదీ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ టైంలో ఓ యువతి, యువకుడు కలిసి మోదీతో మాట్లాడడం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే.. ఆమెకు అంతటి కష్టం వచ్చింది కాబట్టి. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యుల్ని పొగొట్టుకుందామె.చూరాల్మల గ్రామానికి చెందిన శ్రుతి (24)కి తన చిరకాల మిత్రుడైన జెన్సన్ (27) ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరైనా.. తల్లిదండ్రులు వివాహానికి పచ్చ జెండా ఊపారు. జూన్ 2న ఎంగేజ్మెంట్ జరిగింది.జూన్ 30న వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో తన తల్లిదండ్రులు, సోదరితో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఈ విషాద సమయంలో తన ఉద్యోగాన్ని వదులుకుని మరీ జెన్సన్ ఆమెకు అండగా నిలిచాడు. మోదీ పర్యటన టైంలో జాతీయ మీడియా సైతం ఈ జంట గురించి కథనాలు ఇచ్చింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ నెలలోనే రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.అయితే..వివాహ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 10న శ్రుతి, జెన్సన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్నీ వ్యానులో బయలుదేరారు. కోజికోడ్ కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వాహనం, ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. జెన్సన్ తీవ్రంగా గాయపడగా, శ్రుతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ జేన్సన్ బుధవారం రాత్రి మరణించాడు. అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన శ్రుతి బాధ వర్ణణాతీతంగా మారింది. -
Kerala Wayanad: కొండచరియల బీభత్సం.. కేరళ వయనాడ్‌లో తీవ్ర విషాదం (ఫోటోలు)
-
పెరూలో భారీ భూకంపం
పెరూ: దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో శుక్రవారం(జూన్28) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డవారికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది అనే దానిని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని ప్రధాని గుస్తావో అడ్రియన్జెన్ తెలిపారు. -
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో కొండచరియలు భారీ బీభత్సాన్ని సృష్టించాయి. శుక్రవారం(మే24) సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో తొలుత 100 మందికిపైగా మృతి చెంది ఉండొచ్చని భావించారు. అయితే మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి(యూఎన్) తాజాగా అంచనా వేసింది. ఈ విపత్తులో సుమారు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎమ్)’తెలిపింది. గ్రామాలకు గ్రామాలే కొండచరియల కింద కూరుకుపోయినట్లు సమాచారం. మొత్తం 150 ఇళ్లు కొండ చరియల కింద శిథిలమయ్యాయని తేలింది. దీంతో 670 మంది సమాధి అయ్యారని అంచనా వేస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. -
Philippines: విరిగిపడ్డ కొండ చరియలు.. 54 మంది మృతి
మనీలా: పిలిప్పీన్స్‌లోని డావో ప్రావిన్సు మాకో టౌన్లో బంగారు గని సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండ చరియల కింద ఇళ్లు, వాహనాలు కూరుకుపోయాయి. గత వారం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయని డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మూడు వందల మందితో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, బురద వల్ల రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ కొండ చరియలు విరిగియ పడే అవకాశాలుండటంతో సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. కొండ చరియలు విరిగిపడ్డప్పటి నుంచి మొత్తం 63 మంది ఆజూకీ తెలియడం లేదు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు -
కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి
బటంగ్ కలి: మలేసియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గల్లంతయ్యారు. సెలంగోర్ రాష్ట్రం బటంగ్ కలి పట్టణ సమీపంలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఫార్మ్‌హౌస్‌లోని మూడెకరాల్లో 90 మంది పర్యాటకులున్న క్యాంప్ సైట్‌ను 100 అడుగుల ఎత్తైన రోడ్డు నుంచి బురద, రాళ్లతో కూడిన మట్టి ఒక్కసారిగా ముంచెత్తింది. గాఢ నిద్రలో ఉన్న 21 మంది బురద మట్టి కింద సజీవ సమాధి కాగా, 12 మంది జాడ తెలియకుండా పోయారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఫార్మ్‌హౌస్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి: కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు -
విషాదం: మూడు తరాలను మింగేసిన వరద
తిరువనంతపురం: కేరళలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కొట్టాయం, ఇడుక్కి వంటి జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరద కారణంగా కేరళ వ్యాప్తంగా 23 మంది మరణించినట్లు ప్రభుత్వ ప్రకటించింది. భారీ వర్షం కొట్టాయం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల మనుషుల్ని మింగేసింది. వరదలో ఆరుగురు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కొట్టాయం జిల్లాకు చెందిన కావాలి ప్రాంతంలో మార్టిన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తుండేవాడు. మార్టిన్‌కు భార్య, ముగ్గరు పిల్లలు. మార్టిన్ అమ్మ కూడా వారితో పాటే ఉండేది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొట్టాయం ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. పైగా భారీ వరద పొటేత్తింది. (చదవండి: వరద బీభత్సం.. నెమ్మదిగా మింగేసింది) ఈ క్రమంలో మార్టిన్ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. ఈ సంఘటనలో మార్టిన్ కుటుంబ సభ్యులంతా మృతి చెందారు. విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది వారి మృతదేహాలను గుర్తించి బయటకు తీసుకువచ్చారు. వీరికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మూడు తరాల మనుషులను వరద మింగేసింది అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు మార్టిన్ బంధువులు, ఇరుగుపొరుగువారు. చదవండి: క‘న్నీటి’ రాత్రి: ఏడాది గడిచినా మానని గాయాలు -
వర్షాలు, వరదలతో అతలాకుతలం
సాక్షి, ముంబై: రాజధాని ముంబై నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, కొంకణ్, విదర్భ తదితర ప్రాంతాల్లో వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఔరంగాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కన్నడ తాలూకాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కన్నడ ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాలు, బురద కారణంగా ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వందలాది వాహనాలు ఘాట్ రోడ్డుపై ఇరుక్కుపోయాయి. శిథిలాలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు. మరోవైపు నాందేడ్, పర్బణీ జిల్లాల్లో కూడా వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. అదేవిధంగా కొంకణ్‌లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు పంటలు నష్టపోయాయని వాపోతుండగా, మరికొన్ని ప్రాంతాల్లోని రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : MHADA: శుభవార్త, ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు! చాలీస్‌గావ్‌లో వరద బీభత్సం జల్గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్ తాలూకాలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండిపోయాయి. వరదల్లో పశువులతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయినట్టు తెలిసింది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మంగేష్ చవాన్ మీడియాకు అందించిన వివరాల మేరకు.. చాలీస్‌గావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల్లో సుమారు 500 నుంచి 600 పశువులు కొట్టుకుపోయినట్టు అనుమానిస్తున్నట్టు చెప్పారు. వరద నీటిలో ఇప్పటి వరకు ముగ్గురి శవాలు లభించగా, మొత్తం సుమారు 10 మంది వరకు కొట్టుకుపోయినట్టు స్థానికుల నుంచి సమాచారం అందిందని తెలిపారు. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉందన్నారు. తాలూకాలోని అనేక వంతెనలు ముంపునకు గురికావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. చదవండి : కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష! #WATCH | Maharashtra: Rain lashes various parts of Mumbai. Visuals from Bhandup. pic.twitter.com/uMInI9x3nQ — ANI (@ANI) August 31, 2021 -
సిమ్లా హైవే పై విరిగిపడ్డ కొండచరియలు
-
యాదాద్రి: రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు
-
కొండ చరియలు విరిగిపడి నలుగురు చిన్నారులు మృతి
ఐజ్వాల్: మిజోరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మృతి చెందినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ఈ ఘటన బాంగ్కాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ పక్కనే ఉన్న ఇంటిపై అవి పడటంతో ఇల్లు కూలిపోయింది. ఏడుగురు సభ్యులు ఉన్న ఆ ఇంట్లో ఘటన సమయంలో ఆరుగురు ఉన్నారు. అందులో ఇంటి యజమాని లాల్ బయాక్జౌలా (75) ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అనంతరం మరొకరిని కూడా బలగాలు రక్షించగలిగాయి. 3 నుంచి 16 ఏళ్ల వయసున్న నలుగురు శిథిలాల కింద నలిగిపోయి మరణించారు. ముగ్గురు సభ్యులున్న మరో కుటుంబం కొండ పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉన్నారు. అయితే కొండచరియలు విరిగిన శబ్దం రావడంతో వారు బయటకొచ్చి ప్రాణాలు రక్షించుకోగలిగారు. చదవండి: వేప చెట్టు కింద కరోనా మాత.. కూల్చివేతతో ఉద్రిక్తత -
మోదీ మాసివ్ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..
బీజేపీ బిగ్ విక్టరీపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి తిరిగి వచ్చిన బాలీవుడ్ క్వీన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారట. బీజేపీ సాధించిన అద్భుతమైన విజయంపై ఫుల్ హ్యాపీగా ఉన్న కంగనా చెఫ్ అవతార మెత్తారట. ఈ విషాయాన్ని కంగనా సోదరి రంగోలి చందేల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కంగనా వంటలు చాలా అరుదుగా చేస్తుంది..ఎంతో సంతోషంగా ఉంటే తప్ప..కానీ రుచిరకరమైన పకోడీలు, కాఫీ వడ్డించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ చారిత్రాత్మక విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసిందని రంగోలి పేర్కొన్నారు. జై హింద్.. జైభారత్ అంటూ ట్విటర్లో కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేశారు. అలాగే తమ జనరేషన్లో నరేంద్రమోదీలాంటి నాయకుడిని పొందడం అదృష్టమంటూ రంగోలి చందేల్ కూడా మోదీకి అభినందలు తెలిపారు. Kangana cooks rarely, when she is absolutely exhilarated, today she treated us with chai pakodas for @narendramodi Ji’s win #JaiHind #JaiBharat 😁🥳 🙏 pic.twitter.com/6hJIuxby9W — Rangoli Chandel (@Rangoli_A) May 23, 2019 -
26 సంవత్సరాల తరువాత మొదటి సారి
-
కేరళను వణికిస్తున్న వరదలు: 22మంది మృతి
సాక్షి, తిరువనంతపురం: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి జనజీవనాన్ని స్ధంభింప చేశాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడటంతో దాదాపు 22మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వరదలు ముంచెత్తడంతో అనేక నదులు, ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 26 సంవత్సరాల తరువాత మొదటి సారి ఇడుక్కి డ్యామ్ గేట్లను తెరిచినట్టు అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న జిల్లాలోని తూర్పు కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కారణంగా అనేక కుటుంబాలు దగ్గరలో ఉన్న సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అలప్పు, ఇడుక్కి, వాయినాద్, కొల్లాం, మల్లాపురం జిల్లాలు వరదలు, గాలులతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరో రెండు రోజులు పాటు భారీనుంచి, అతి భారీ వర్షాలు కురవన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. కేరళలోని అనేక జిల్లాలలో భారీ వర్షాలు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయని కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయ్ ప్రకటించారు. వరద పరిస్థతిని అంచనా వేసేందుకు గురువారం తిరువనంతపురంలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 22డ్యామ్‌లను గేట్లను ఇప్పటికే ఎత్తివేశామనీ, ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలోఎప్పుడూ సంభవించ లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, పరిస్థితిని అదుపుచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మీడియాకు చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అత్యవసర నంబర్లను ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఎమర్జన్సీ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అత్యవసర సమాచారం కోసం 0484 3053500 నెంబరు సంప్రదించాల్సిందిగా అధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ వరద పరిస్థితి రవాణా వ్యవస్థను ప్రభావితం చేసింది. రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. కొచ్చి విమానాశ్రయంలో కార్యకలాపాలు స్థంభించాయి. విమాన రాకపోకలను రెండు గంటలపాటు నిలిపివేశారు. -
మైనింగ్ గనిలో చరియలు విరిగిపడి..
యాంగన్: గనుల్లో పనికి వెళ్లి ల్యాండ్ స్లైడింగ్ వల్ల 11 మంది మృతి చెందిన ఘటన ఉత్తర మయన్మార్ లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఇప్పటివరకు 11 మృతదేహలను బయటకు తీసిన అధికారులు శిథిలాల కింద ఎక్కువ మంది ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలానే జేడ్ మైనింగ్ రీజియన్‌లో తవ్వకాలు ప్రారంభించేందుకు కూలీలందరూ చేరుకున్నారు. పని ప్రారంభించిన కొద్ది సేపటికి మైనింగ్ చేస్తున్న కొండ చరియలు విరిగిపడటంతో వారంతా ఆచూకీ లేకుండా పోయారు. వెంటనే స్పందించిన అధికారులు హూటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ల సాయంతో చరియలను పక్కకు తీస్తున్న అధికారులు ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 50 మందికిపైగా మృతులు ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించారు.