![54 Died In Philippines Land Slide - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/12/landslide.jpg.webp?itok=CIxxSDMY)
మనీలా: పిలిప్పీన్స్‌లోని డావో ప్రావిన్సు మాకో టౌన్‌లో బంగారు గని సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండ చరియల కింద ఇళ్లు, వాహనాలు కూరుకుపోయాయి. గత వారం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయని డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మూడు వందల మందితో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, బురద వల్ల రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోంది.
మళ్లీ కొండ చరియలు విరిగియ పడే అవకాశాలుండటంతో సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. కొండ చరియలు విరిగిపడ్డప్పటి నుంచి మొత్తం 63 మంది ఆజూకీ తెలియడం లేదు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment