gold mine
-
బంగారం గనిలో ప్రమాదం.. 11 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలోని ఓ బంగారు గనిలో ఆదివారం(జులై 7) ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా గనిపై కొండచరియలు విరిగిపడి 11 మంది కార్మికులు మృతి చెందారు. గోరంటా ప్రావిన్స్‌లోని రిమోట్‌బోన్ బొలాంగో జిల్లాలో ఉన్న బంగారు గనిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 33 మంది స్థానిక కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి కార్మికులపై పడ్డాయని రెస్క్యూ బృందం ప్రతినిధులు తెలిపారు. 33 మంది కార్మికుల్లో కేవలం ఒక్కరినే రక్షించారు. ఇప్పటివరకు గనిలో నుంచి 11 మంది మృతదేహాలను బయటికి తీశారు. మిగిలిన 21 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇండోనేషియాలో బంగారం కోసం అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతుండడం గమనార్హం. -
Philippines: విరిగిపడ్డ కొండ చరియలు.. 54 మంది మృతి
మనీలా: పిలిప్పీన్స్‌లోని డావో ప్రావిన్సు మాకో టౌన్లో బంగారు గని సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండ చరియల కింద ఇళ్లు, వాహనాలు కూరుకుపోయాయి. గత వారం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయని డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మూడు వందల మందితో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, బురద వల్ల రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ కొండ చరియలు విరిగియ పడే అవకాశాలుండటంతో సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. కొండ చరియలు విరిగిపడ్డప్పటి నుంచి మొత్తం 63 మంది ఆజూకీ తెలియడం లేదు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు -
బంగారు గనిలో ప్రమాదం.. 27 మంది మృతి
లిమా: దక్షిణ అమెరికా దేశం పెరూలోని ఓ బంగారు గనిలో సంభవించిన అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. ఇద్దరిని మాత్రమే రక్షించగలిగామని అధికారులు తెలిపారు. అరెక్విపా ప్రాంతంలోని ఎస్పెరాంజా గనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ఘటన చోటుచేసుకుంది. గనిలో సుమారు 100 మీటర్ల లోతులో సిబ్బంది పనిచేస్తున్న చోట మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు పెరూలో ఉన్నాయి. ఏటా వీటి నుంచి 100 టన్నుల బంగారాన్ని వెలికితీస్తుంటుంది. ప్రపంచంలోని బంగారం ఉత్పత్తిలో ఇది 4%. -
కేజీఎఫ్ లాంటి సూపర్ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!
న్యూఢిల్లీ: గుండె నిండా ధైర్యం, తెగింపు ఉండాలేగానీ ఎంతటి కష్టమైనా దూదిపింజలా తేలిపోవాల్సిందే. అలాగే భూమ్మీద నూకలుంటే.. ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడవచ్చు. కుప్పకూలిపోతున్న బంగారు గని నుంచి అన్యూహంగా బతికి బయటపడ్డ వీడియో చూస్తే ఇదే అభిప్రాయం కలుగక మానదు. ముఖ్యంగా తన ప్రాణాలను ఫణంగాపెట్టి మరీ గనిలో చిక్కుకున్న 9మంది కార్మికులను రక్షించడం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షంతో అక్కడున్న బంగారు గని కూలిపోయింది. దీంతో అక్కడి పనిచేస్తున్న కార్మికులు (మైనర్లు) చిక్కుకుపోయారు. కానీ ఒకవ్యక్తి సకాలంలో స్పందించాడు. తన చేతులతో మట్టిని తొలగించుకుంటూ లోపల ఇరుక్కుపోయిన తొమ్మిది మంది మైనర్లను నిమిషాల్లో రక్షించడంతో అక్కడున్నవారంతా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు పలుగుతో తవ్వుతుండగా మరోవైపు నుంచి కూలీలు ఒక్కొక్కరుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావడం వీడియోలో చూడవచ్చు. ఒక్కొక్కరూ అలా శిథిలాల్లోంచి బయటకు వస్తున్న క్షణాలు తీవ్ర ఉద్విగ్నతను , ఉత్కంఠను కలిగించాయి. సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో మైనింగ్ ప్రమాదాలు, విపత్తులు, కొండ చరియలు విరిగి పడటం లాంటి సంఘటనలు సర్వసాధారణం. సరియైన భద్రతా విధానాలు, సరైన పరికరాలు లేక పోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. Nine Congolese miners were rescued from the rubble of a collapsed gold mine as onlookers cried out in joy in a victorious escape pic.twitter.com/BmPJNe0iQY — TRT World (@trtworld) March 28, 2023 -
'బంగారు' బాటలో.. కర్నూలు జిల్లా చిప్పగిరిలో మొదలైన పుత్తడి వెలికితీత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బంగారు గనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధ్యమైనంత త్వరగా గనుల్లో తవ్వకాలు ప్రారంభించి ఆదాయాన్ని సమకూర్చుకునేలా అడుగులు వేస్తోంది. కొత్త బంగారు గనులకు టెండర్లు పిలిచి ఖరారు చేయడంతోపాటు గతంలో తవ్వకాలు నిలిచిపోయిన గనులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. బంగారు గనుల ద్వారా రూ.10 వేల కోట్ల రాబడి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించింది. చిప్పగిరిలో మైనింగ్ ప్రారంభం చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాత కర్నూలు జిల్లా చిప్పగిరి బంగారు గనిలో ఇటీవలే తవ్వకాలు మొదలై ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. 2002లో ఇక్కడ తవ్వకాలకు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి లీజు మంజూరు కాగా పలు కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. 20 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న ఈ గనుల్లో తవ్వకాలను సీఎం జగన్ ప్రభుత్వం పట్టుదలతో ఓ కొలిక్కి తెచ్చింది. ఆ కంపెనీతో పలుదఫాలు సంప్రదింపులు జరిపి మైనింగ్ ఆపరేషన్స్ మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంది. చేసింది. కంపెనీ ఇటీవల ప్రభుత్వానికి రూ.2 కోట్ల రాయల్టీ చెల్లించింది. బంగారాన్ని ప్రాసెస్ చేసే మినీ స్మెల్టర్ని గనిలో సొంతంగా ఏర్పాటు చేసుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో బంగారం వెలికితీత ప్రారంభం కానుంది. చిగురుకుంట, బిసనాతంలో లైన్ క్లియర్.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 118 హెక్టార్లలో ఉన్న చిగురుగుంట, బిసనాతం బ్లాకుల్లో మైనింగ్ ఆపరేషన్స్ త్వరలో మొదలు కానున్నాయి. ఈ గనిని గతంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కి చెందిన భారత్ గోల్డ్ మైన్స్ లీజుకు తీసుకుంది. అయితే వివిధ కారణాల వల్ల లీజు రద్దయింది. 2018లో మళ్లీ నిర్వహించిన వేలంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) దీన్ని దక్కించుకుంది. ఇటీవలే స్టే ఆర్డర్‌ను కోర్టు ఎత్తివేయడంతో ఎన్ఎండీసీకి లైన్ క్లియర్ అయింది. వచ్చే ఏడాది ఈ గనిలో కూడా బంగారం ఉత్పత్తి మొదలుకానుంది. 10 గనులపై ఫోకస్ కొత్త గనులపైనా దృష్టి సారించిన ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10 బంగారు గనులకు (ఏరియాలు) కాంపోజిట్ లైసెన్సులు ఇచ్చేందుకు సిద్ధమైంది. భారత నూతన గనుల చట్టం ప్రకారం (ఎంఎండీఆర్ చట్టం) వేలం ద్వారా కాంపోజిట్ మైనింగ్ లైసెన్సులు (అన్వేషణ, ఆ తర్వాత మైనింగ్ లీజు) ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు. రామగిరి నార్త్, రామగిరి సౌత్, బొక్కసంపల్లి నార్త్, బొక్కసంపల్లి సౌత్ ఏరియాలకుగాను మూడు లీజులు ముంబై కేంద్రంగా ఉన్న ఆంధ్రా మైనింగ్ కంపెనీకి దక్కాయి. దేశంలోనే అత్యధికంగా మినరల్ వాల్యూలో 20 శాతం షేర్ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఈ బిడ్లు ఖరారయ్యాయి. మరో లీజు మంజూరు ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా జవుకులలో 57 చదరపు కిలోమీటర్లను ఆరు బ్లాకులుగా విభజించి టెండర్లు పిలిచారు. మొదటిసారి సరైన స్పందన రాకపోవడంతో ఇటీవల మళ్లీ టెండర్లు ఆహ్వానించారు. ఫిబ్రవరిలో వాటికి వేలం జరగనుంది. మారిన పరిస్థితుల్లో ఆ బిడ్లు ఖరారయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుచూపుతో ప్రణాళిక.. మైనింగ్ రంగంలో ఉన్న విస్తారమైన అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేలా సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన కార్యాచరణ ఇచ్చారు. అందులో భాగంగానే బంగారు గనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. రానున్న రోజుల్లో వీటి ద్వారా రాష్ట్రానికి ఊహించనంత ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో రూపొందించిన ప్రణాళిక విజయవంతమైంది. – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ చదవండి: అభివృద్ధి వ్యయం పరుగులు.. ఆర్బీఐ అధ్యయన నివేదికలో వెల్లడి -
బంగారు గనుల్లో అరుదైన 'మమ్మీ' అవశేషాలు
Miners in the Klondike gold fields of Canada's: కొంతమంది యువకులు ఉత్తర కెనడాలోని బంగారు గనుల్లో అరుదైన మమ్మీ అవశేషాలను కనుగొన్నారు. ఇది ఒక ఆడ జంతువిగా గుర్తించారు. ఇది యుఎస్ రాష్ట్రానికి అలాస్కా సరిహద్దులో ఉన్న కెనడాలోని యుకాన్ మంచు ప్రదేశంలోని బంగారు గనుల్లో జరిపిన తవ్వకాల్లో ఈ అవశేషాలను కనుగొన్నారు. ఈ మమ్మీ ప్రపంచంలో ఇప్పటివరకు కనుగొనబడని అత్యద్భుతమైన మంచు యుగం నాటి జంతువులకు సంబంధించిన మమ్మీలలో ఇది ఒకటి. సుమారు 30 వేల ఏళ్ల క్రితం అడవి గుర్రాలు సింహాలు తదితర జంతువులు ఈ ప్రాంతంలో సంచరించేవని, అవి మంచు తుఫాను కారణంగా చనిపోయి ఉండవచ్చని పాలియోంటాలజిస్ట్ గ్రాంట్ జాజులా చెప్పారు. ఐతే ఈ యువ బృందం ఈ మమ్మీకి 'నన్ చో'(పెద్ద పిల్ల) అనే పేరు పెట్టారు. ఇదిలా ఉండగా 2007లో సైబీరియాలో 'లియుబా' అనే 42 వేల ఏళ్ల నాటి ఒక మమ్మీని గుర్తించారు. ప్రస్తుతం బయటపడ్డ ఈ నన్ చో, ఈ లియుబా మమ్మీ రెండు దాదాపు ఒకే పరిమాణంలో ఉండటం గమనార్హం. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ని హత్య చేసేందుకు స్కెచ్...పట్టుబడ్డ ఉద్యోగి) -
బంగారు గనిలో పేలుడు.. 59 మంది దుర్మరణం
Mining operations in Burkina Faso: పశ్చిమ ఆఫ్రికాలో వరుస పేలుళ్లు చోటచేసుకున్నాయి. బుర్కినా ఫాసోలోని బంగారు గనిలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రల్లలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోమవారం జరిగిన ఈ పేలుడు.. బంగారు గనిలో బంగారం తవ్వడానికి ఉపయోగించే రసాయనాల వల్ల సంభవించినట్లు తెలుస్తోంది. -
బంగారు ‘సీమ’.. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి సమీపంలో బంగారం వెలికితీత పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ మంచి ఫలితాలు ఇవ్వడంతో గోల్డ్ మైన్ ప్లాంట్ ఏర్పాటుకు జియో మైసూర్ సంస్థ ముందుకొచ్చింది. ప్లాంట్‌ను నెలకొల్పి ఏడాదిలోపు బంగారం నిక్షేపాల వెలికితీత పనులు చేపట్టనుంది. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వే ద్వారా నిర్ధారించింది. భారత ప్రభుత్వం మైనింగ్ సెక్టార్లో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించిన తర్వాత 2005లో జియో మైసూర్ అనే సంస్థ జొన్నగిరి సమీపంలో గోల్డ్ మైన్ నిర్వహణకు దరఖాస్తు చేసింది. దరఖాస్తును అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పరిశీలించింది. అనుమతులు ఇచ్చేలోపే ప్రమాదవశాత్తు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందారు. ఆపై రాష్ట్ర విభజన సమస్య, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను నేపథ్యంలో మైనింగ్ అనుమతులకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు 2013లో అనుమతులు లభించగా.. 2014లో జియో మైసూర్ సంస్థ బంగారం నిక్షేపాలపై అన్వేషణ మొదలు పెట్టింది. 350 ఎకరాలు కొనుగోలు తుగ్గలి, మద్దికెర మండలాల్లో 350 ఎకరాలను జియో మైసూర్ సంస్థ కొనుగోలు చేసింది. మరో 1,500 ఎకరాలను లీజుకు తీసుకుంది. రైతులకు ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున కౌలు చెల్లిస్తోంది. కొనుగోలు చేసిన 350 ఎకరాల్లో మైనింగ్, ప్రాసెసింగ్ యూనిట్, డంప్ యార్డ్, వాటర్ రిజర్వాయర్ నిర్మించారు. దీనికి రూ.95 కోట్ల వరకూ సంస్థ ఖర్చు చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 1,500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్ చొప్పున మొత్తం 30 వేల మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయించింది. బంగారం లభ్యత, నాణ్యత, మైనింగ్ చేస్తే వచ్చే లాభనష్టాలు తదితర అంశాలను అంచనా వేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇది ఫలించడంతో పూర్తిస్థాయిలో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన యంత్ర సామగ్రి కొనుగోలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించి 12 నెలల్లో పూర్తి చేయనుంది. ఇందుకోసం రూ.300 కోట్లు వెచ్చిస్తోంది. ప్లాంట్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రతినిధులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలి గోల్డ్ మైన్ మన దేశంలో 1880లో కోలార్ గోల్డ్ మైన్ ప్రారంభమైంది. ఆ తర్వాత బ్రిటిష్ హయాంలోనే 1945లో రాయచూర్‌లో హట్టిమైన్స్‌ను మొదలు పెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకు దేశంలో ఎక్కడా గోల్డ్ మైనింగ్ చేపట్టలేదు. ఇప్పుడు జియో మైసూర్ సంస్థ ఏర్పాటు చేస్తున్నదే తొలి గోల్డ్ మైనింగ్ ప్లాంట్ కానుంది. దీని నిర్మాణంతో ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 1000 మంది వరకు ఉపాధి లభిస్తుంది. అనంతపురం జిల్లాలోనూ బంగారు నిక్షేపాలు తుగ్గలి, మద్దికెరతో పాటు అనంతపురం జిల్లాలోని రామగిరిలోనూ బంగారు నిక్షేపాలు ఉన్నాయి. 25 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ వీటిని లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందుకు రాలేదు. అప్పట్లో టీడీపీ నేత పరిటాల రవీంద్ర కారణంగానే ఆ కంపెనీ ధైర్యం చేయలేకపోయిందని చెబుతారు. అక్కడి బంగారు నిక్షేపాలను కూడా వెలికితీస్తే విలువైన సంపద ప్రభుత్వ సొంతం అవుతుంది. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు జియో మైసూర్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్ చేస్తోంది. భారతదేశంలోని కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్ పనులు చేపట్టాం. పైలట్ ప్రాజెక్ట్ పూర్తయింది. ఇందులో మంచి ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ నుంచి ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం. 12 నెలల్లో పూర్తి చేస్తాం. కరెంటు, నీరు తదితర వనరులు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రతినిధులు ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. – హనుమ ప్రసాద్, సీఈవో, జియో మైసూర్ -
బంగారు గనుల తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యికాళ్ల ప్రాణి!
1306 Legs Millipede: ఇంతవరకు భూమి మీద ఉండే జల చర జంతువుల్లో మనకు తెలిసినవి చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే చాలావరకు మనకు తెలయని ఎన్నో అద్భుతమైన జీవరాశులు ఈ భూమ్మీద ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అంతేకాదు అత్యంత విషపూరిత జంతువుల ఉపయోగాలను గురించి తెలుసుకున్నాం. అయితే మనం ఇంతవరకు ఎప్పుడూ చూడని జీవి, పైగా దాదాపు వెయ్యి కాళ్ల ఉన్న జీవి గురించి సాధారణం విని గానీ చూసి గానీ ఉండేందుకు అవకాశం లేదు. (చదవండి: విలేకరుల సమావేశం జరపవద్దు!... అంటూ సాలీడు ఎలా అడ్డుపడుతుందో చూడండి!!) అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ఫీల్డ్స్ ఎస్పెరెన్స్ ప్రాంతంలో బంగారం, లిధియం కోసం జరిపిన గనుల తవ్వకాలు 1,306 కాళ్ళతో మిల్లిపెడ్ అనే ఒక వింత జంతువుని కనుగొన్నారు. పైగా దాదాపు 200 అడుగుల భూగర్భ తవ్వకాల్లో బయటపడింది. అంతేకాదు ఈ జీవి సుమారు మీటరు పొడవు మిల్లిమీటర్ కంటే తక్కువ వెడల్పు ఉంటుంది. అయితే ఈ జీవికి కళ్లు లేవు, లేత రంగులో ఉంటుంది. అయితే ఇది పరిసరాలను స్పర్శ, వాసన సాయంతో పసిగడుతుంది. ఇది ఎక్కువగా అగ్నిపర్వత శిలల భూగర్భ ఆవాసాలో పూర్తి చీకటిలో నివశిస్తుంది. ఈ క్రమంలో జీవశాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు చేయడం ప్రారంభించారు. అయితే వీటిని మిల్లిపైడ్ (కాళ్ల జెర్రీ లేదా బహుపాది) మాదిరి జీవులుగా పేర్కొన్నారు. ఈ ప్రాణుల్లో మగవాటిక కంటే ఆడజీవికే ఎక్కువ కాళ్లు ఉంటాయని అన్నారు. పైగా రెండు ఆడ మిల్లిపైడ్లను అధ్యయనం చేసినప్పుడు ఒక దానికి ఏకంగా 1,306, మరొకదానికి 998 కాళ్లు ఉన్నాయని అన్నారు. అయితే మగవాటికి సుమారు 778 నుంచి 818 కాళ్లు ఉంటాయని చెప్పారు. అంతేకాదు సాధారణ మిల్లిపెడెస్ (కాళ్ల జెర్రీ లేదా బహుపాది) కంటే అపారమైన పెరుగదల వీటిలో ఉందని అన్నారు. (చదవండి: పాండా జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి.. పాపం ఎలా టెంప్ట్ అయ్యిందో చూడండి!!) -
గనుల వేలానికి హైపవర్ కమిటీ ఆమోదం
సాక్షి, అమరావతి: బంగారం, వజ్రాలు సహా 22 అత్యంత విలువైన గనుల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో బుధవారం మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో వేలానికి ఆమోదముద్ర వేశారు. సమావేశంలో మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పాల్గొనగా, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైనింగ్ రీజినల్ కంట్రోలర్ శైలేంద్రకుమార్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ డైరెక్టర్ ప్రసూన్ఘోష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జీఎస్ఐ ప్రతిపాదించిన 9, రాష్ట్ర మైనింగ్ శాఖ ధ్రువీకరించిన 13 గనుల వేలానికి సంబంధించిన విధివిధానాలను కమిటీలో ఖరారు చేశారు. ప్రీమియం, రిజర్వు ధరలు, వేలం నిర్వహణపై మార్గదర్శకాలు నిర్దేశించారు. వీటి ప్రకారం 22 గనులకు వేలం నిర్వహించాలని మైనింగ్ శాఖకు స్పష్టం చేసింది. 21 గనులకు కాంపోజిట్ లీజులు, ఒక గనికి సాధారణ లీజు ఇచ్చేందుకు అంగీకరించింది. కమిటీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. -
ఆ కొండంతా బంగారం.. ఎగబడ్డ జనం
కిన్షాసా : డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో తాజాగా ఓ బంగారు కొండ వెలుగుచూసింది. దాన్ని తవ్విన కొద్ది బంగారం బయటపడుతోంది. సౌత్ కివు ప్రావిన్స్, లుహిహిలో ఉన్న ఈ కొండ మీదకు జనం ఎగబడ్డారు. చేతికి దొరికిన వస్తువుతో మట్టి తవ్వి సంచుల్లో, పాత్రల్లో నింపుకుని వెళ్లారు. ఈ మట్టిలో 60-90శాతం బంగారం ఉన్నట్లు సమాచారం. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ అల్గోభరి ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ రిపబ్లికన్ కాంగోలో బంగారు కొండ వెలుగుచూసింది. జనం బంగారం కోసం ఎగబడుతున్నారు. కొండమీద మట్టిని ఇంటికి తీసుకెళ్లి, దాన్ని శుభ్రం చేసి బంగారాన్ని వెలికి తీస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బంగారు కొండపై దేశ మైనింగ్ శాఖ స్పందించింది. ప్రజలెవరూ ఆ కొండపై బంగారు తవ్వుకోవటానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. చదవండి : వైరల్: చేప కడుపులో తాబేలు చక్కర్లు! గడ్డం గీయటానికి రూ. 4 లక్షల గోల్డ్ రేజర్ -
బంగారు గనిలో బ్లాస్ట్: మరో 15 రోజులు పట్టొచ్చు!
బీజింగ్: చైనాలోని బంగారు గనిలో చిక్కుకున్న వర్కర్లను వెలికితీసేందుకు మరో 15 రోజులు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వీరు ఇందులో చిక్కుకుపోయి 11 రోజులవుతోంది. తూర్పు చైనాలోని బంగారు గనిలో జరిగిన పేలుడుతో గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మన్ను పేరుకుపోయింది. దీంతో ఈ మట్టిని తవ్వుకుంటూ పోతే తప్ప గనిలో వారిని బయటకు తీసే అవకాశం లేదు. ఇప్పటికే పేలుడు సమయంలో గాయాలతో ఒక వర్కర్ మరణించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. గనిలో ఇంకా 21 మంది ఉన్నారు. వీరిలో 11 మందితో సంబంధాలు పునరుద్ధరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంకో పదిమంది ఆచూకి తెలియరాలేదు. ఆ 11మందికి ఇతర మార్గాల ద్వారా ఆహారం, మెడిసిన్స్ అందిస్తున్నామని, మరోవైపు తవ్వకం చురుగ్గా సాగుతోందని ప్రభుత్వం తెలిపింది. గనిలో పేలుడుకు కారణాలు బహిర్గతం కాలేదు. చైనాలో మైనింగ్ పరిశ్రమలో ఏటా దాదాపు 5వేల మంది మరణిస్తుంటారు. -
కుప్పకూలిన బంగారు గని; కార్మికుల దుర్మరణం
-
కుప్పకూలిన బంగారు గని; కార్మికుల దుర్మరణం
దార్ ఏ సలామ్: బంగారు గని కుప్పకూలడంతో నలుగురు కార్మికులు దుర్మరణంపాలైన ఘటన తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో చోటుచేసుకుంది. గెటా ప్రాంతంలోని ఓ గనిలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. ఏడుగురు కార్మికుల బృందం.. పది అడుగుల లోతులో పనిచేస్తుండగా వారిపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని, నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయని గెటా రీజనల్ పోలీస్ కమాండర్ మ్వాబులాంబో తెలిపారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఖ్యాతికెక్కిన విక్టోరియా సరస్సు, దాని తీరంలో భారీగా ఉన్న బంగారం నిక్షేపాలు గెటా ప్రాంతానికి ప్రకృతి ప్రసాదించిన వరం. అయితే గనుల తవ్వకాలు ఎక్కువ శాతం చిన్న, మధ్యతరహా సంస్థలే చేపడుతుండటం, సరైన భద్రతాప్రమాణాలు పాటించకపోవడం వల్ల గెటాలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జనవరిలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక చైనీయుడు సహా 14 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
బంగారం కోసం వెళ్లి 11 మంది మృతి
జకార్తా: బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న 11 మంది సజీవ సమాధి అయిన ఘటన ఇండొనేషియాలో చోటుచేసుకుంది. సుమత్రా దీవిలో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 50 మీటర్ల లోతులో బంగారం కోసం తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదం జరిగింది. భారీ వర్షం కురవడంతో గనిలోకి మట్టి కూరుకుపోయింది. 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న 11 మంది సజీవ సమాధి అయ్యారని వీరిలో ఎవరూ బ్రతికే అవకాశం లేదని స్థానిక పోలీసు అధికారి ట్రెస్నాడి వెల్లడించారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బలగాలు ప్రయత్నిస్తున్నాయి. బంగారం ధరకు రెక్కలొచ్చిన నేపథ్యంలో ఇండొనేషియాలో అక్రమ బంగారు గనుల సంఖ్య పెరిగిపోయింది. గత ఏడాది అక్టోబర్‌లో జావా దీవిలో నిరుపయోగంగా ఉన్న బంగారు గనిలోకి బంగారం కోసం వెళ్లిన 12 మంది మృతి చెందారు.