జకార్తా: ఇండోనేషియాలోని ఓ బంగారు గనిలో ఆదివారం(జులై 7) ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా గనిపై కొండచరియలు విరిగిపడి 11 మంది కార్మికులు మృతి చెందారు. గోరంటా ప్రావిన్స్‌లోని రిమోట్‌బోన్ బొలాంగో జిల్లాలో ఉన్న బంగారు గనిలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో 33 మంది స్థానిక కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి కార్మికులపై పడ్డాయని రెస్క్యూ బృందం ప్రతినిధులు తెలిపారు. 33 మంది కార్మికుల్లో కేవలం ఒక్కరినే రక్షించారు.
ఇప్పటివరకు గనిలో నుంచి 11 మంది మృతదేహాలను బయటికి తీశారు. మిగిలిన 21 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇండోనేషియాలో బంగారం కోసం అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment