1306 Legs Millipede: ఇంతవరకు భూమి మీద ఉండే జల చర జంతువుల్లో మనకు తెలిసినవి చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే చాలావరకు మనకు తెలయని ఎన్నో అద్భుతమైన జీవరాశులు ఈ భూమ్మీద ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అంతేకాదు అత్యంత విషపూరిత జంతువుల ఉపయోగాలను గురించి తెలుసుకున్నాం. అయితే మనం ఇంతవరకు ఎప్పుడూ చూడని జీవి, పైగా దాదాపు వెయ్యి కాళ్ల ఉన్న జీవి గురించి సాధారణం విని గానీ చూసి గానీ ఉండేందుకు అవకాశం లేదు.
(చదవండి: విలేకరుల సమావేశం జరపవద్దు!... అంటూ సాలీడు ఎలా అడ్డుపడుతుందో చూడండి!!)
అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ఫీల్డ్స్ ఎస్పెరెన్స్ ప్రాంతంలో బంగారం, లిధియం కోసం జరిపిన గనుల తవ్వకాలు 1,306 కాళ్ళతో మిల్లిపెడ్ అనే ఒక వింత జంతువుని కనుగొన్నారు. పైగా దాదాపు 200 అడుగుల భూగర్భ తవ్వకాల్లో బయటపడింది. అంతేకాదు ఈ జీవి సుమారు మీటరు పొడవు మిల్లిమీటర్ కంటే తక్కువ వెడల్పు ఉంటుంది. అయితే ఈ జీవికి కళ్లు లేవు, లేత రంగులో ఉంటుంది. అయితే ఇది పరిసరాలను స్పర్శ, వాసన సాయంతో పసిగడుతుంది.
ఇది ఎక్కువగా అగ్నిపర్వత శిలల భూగర్భ ఆవాసాలో పూర్తి చీకటిలో నివశిస్తుంది. ఈ క్రమంలో జీవశాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు చేయడం ప్రారంభించారు. అయితే వీటిని మిల్లిపైడ్ (కాళ్ల జెర్రీ లేదా బహుపాది) మాదిరి జీవులుగా పేర్కొన్నారు. ఈ ప్రాణుల్లో మగవాటిక కంటే ఆడజీవికే ఎక్కువ కాళ్లు ఉంటాయని అన్నారు. పైగా రెండు ఆడ మిల్లిపైడ్‌లను అధ్యయనం చేసినప్పుడు ఒక దానికి ఏకంగా 1,306, మరొకదానికి 998 కాళ్లు ఉన్నాయని అన్నారు. అయితే మగవాటికి సుమారు 778 నుంచి 818 కాళ్లు ఉంటాయని చెప్పారు. అంతేకాదు సాధారణ మిల్లిపెడెస్ (కాళ్ల జెర్రీ లేదా బహుపాది) కంటే అపారమైన పెరుగదల వీటిలో ఉందని అన్నారు.
(చదవండి: పాండా జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి.. పాపం ఎలా టెంప్ట్ అయ్యిందో చూడండి!!)
Comments
Please login to add a commentAdd a comment