![8 Injured After 7 Magnitude Earth Quake Hit In Peru](/styles/webp/s3/article_images/2024/06/28/peru.jpg.webp?itok=vM50-_OU)
పెరూ: దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో శుక్రవారం(జూన్28) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి.
కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డవారికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి.
భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది అనే దానిని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని ప్రధాని గుస్తావో అడ్రియన్‌జెన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment