గనుల్లో పనికి వెళ్లి ల్యాండ్ స్లైడింగ్ వల్ల 11 మంది మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం ఉత్తర మయన్మార్ లో చోటు చేసుకుంది.
యాంగన్: గనుల్లో పనికి వెళ్లి ల్యాండ్ స్లైడింగ్ వల్ల 11 మంది మృతి చెందిన ఘటన ఉత్తర మయన్మార్ లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఇప్పటివరకు 11 మృతదేహలను బయటకు తీసిన అధికారులు శిథిలాల కింద ఎక్కువ మంది ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలానే జేడ్ మైనింగ్ రీజియన్లో తవ్వకాలు ప్రారంభించేందుకు కూలీలందరూ చేరుకున్నారు. పని ప్రారంభించిన కొద్ది సేపటికి మైనింగ్ చేస్తున్న కొండ చరియలు విరిగిపడటంతో వారంతా ఆచూకీ లేకుండా పోయారు.
వెంటనే స్పందించిన అధికారులు హూటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ల సాయంతో చరియలను పక్కకు తీస్తున్న అధికారులు ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 50 మందికిపైగా మృతులు ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించారు.