కొండ చరియలు విరిగిపడి నలుగురు చిన్నారులు మృతి  | Massive Landslide In Mizoram | Sakshi
Sakshi News home page

కొండ చరియలు విరిగిపడి నలుగురు చిన్నారులు మృతి 

Published Sun, Jun 13 2021 11:38 AM | Last Updated on Sun, Jun 13 2021 11:38 AM

Massive Landslide In Mizoram - Sakshi

ఐజ్వాల్‌: మిజోరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మృతి చెందినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ఈ ఘటన బాంగ్‌కాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ పక్కనే ఉన్న ఇంటిపై అవి పడటంతో ఇల్లు కూలిపోయింది.

ఏడుగురు సభ్యులు ఉన్న ఆ ఇంట్లో ఘటన సమయంలో ఆరుగురు ఉన్నారు. అందులో ఇంటి యజమాని లాల్‌ బయాక్‌జౌలా (75) ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అనంతరం మరొకరిని కూడా బలగాలు రక్షించగలిగాయి. 3 నుంచి 16 ఏళ్ల వయసున్న నలుగురు శిథిలాల కింద నలిగిపోయి మరణించారు. ముగ్గురు సభ్యులున్న మరో కుటుంబం కొండ పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉన్నారు. అయితే కొండచరియలు విరిగిన శబ్దం రావడంతో వారు బయటకొచ్చి ప్రాణాలు రక్షించుకోగలిగారు.
చదవండి: వేప చెట్టు కింద కరోనా మాత.. కూల్చివేతతో ఉద్రిక్తత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement