మిజోరాం ‘వండర్‌ కిడ్‌’కు గిటార్‌ | Amit Shah Praises Gifts Guitar To Mizoram Wonder Kid | Sakshi
Sakshi News home page

మిజోరాం ‘వండర్‌ కిడ్‌’కు గిటార్‌

Published Mon, Mar 17 2025 5:55 AM | Last Updated on Mon, Mar 17 2025 5:56 AM

Amit Shah Praises Gifts Guitar To Mizoram Wonder Kid

ఐజ్వాల్‌: ‘మా తుఝే సలాం’ పాటతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మిజోరాం ‘వండర్‌ కిడ్‌’ ఎస్తేర్‌ లాల్దుహామి హ్నామ్టేకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గిటార్‌ బహుమతిగా ఇచ్చారు. 2021లో ఆమె పాడిన ‘మా తుఝే సలాం’ పాట వైరలై దేశమంతటి దృష్టినీ ఆకర్షించింది. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న అమిత్‌ షా ఆదివారం ఐజ్వాల్‌లో ఆమెను రాజ్‌భవన్‌కు ఆహ్వనించారు. తనకు గిటార్‌ అందజేసిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇదొక మైమరపించే అనుభవంగా ఆయన అభివర్ణించారు. ‘భారత్‌ పట్ల ప్రేమే మనందరినీ ఏకం చేస్తుంది.

ఎస్తేర్‌ వందేమాతరం పాట విని చలించిపోయాను. దేశంపై ఆమెకున్న ప్రేమ పాటలో ప్రతిఫలించింది’ అంటూ ప్రశంసించారు. దీనిపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ మిజోరంలోని లుంగ్లీ పట్టణానికి చెందిన హ్నామ్టే 2016 జూన్‌ 9న జన్మించింది. మూడేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించింది. ఆమె ‘మా తుఝే సలాం’ మ్యూజిక్‌ వీడియోను యూట్యూబ్‌లో వారం రోజుల్లోనే 30 లక్షల మంది చూశారు. ఈ సంఖ్య ప్రస్తుతం 4.7 కోట్లకు చేరింది. ఆమె జీవితంపై తీసిన ‘ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’కు 2023లో ఈశాన్య చలన చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు వచి్చంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement