wonder kid
-
మిజోరాం ‘వండర్ కిడ్’కు గిటార్
ఐజ్వాల్: ‘మా తుఝే సలాం’ పాటతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మిజోరాం ‘వండర్ కిడ్’ ఎస్తేర్ లాల్దుహామి హ్నామ్టేకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గిటార్ బహుమతిగా ఇచ్చారు. 2021లో ఆమె పాడిన ‘మా తుఝే సలాం’ పాట వైరలై దేశమంతటి దృష్టినీ ఆకర్షించింది. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న అమిత్ షా ఆదివారం ఐజ్వాల్‌లో ఆమెను రాజ్‌భవన్‌కు ఆహ్వనించారు. తనకు గిటార్ అందజేసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదొక మైమరపించే అనుభవంగా ఆయన అభివర్ణించారు. ‘భారత్ పట్ల ప్రేమే మనందరినీ ఏకం చేస్తుంది.ఎస్తేర్ వందేమాతరం పాట విని చలించిపోయాను. దేశంపై ఆమెకున్న ప్రేమ పాటలో ప్రతిఫలించింది’ అంటూ ప్రశంసించారు. దీనిపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ మిజోరంలోని లుంగ్లీ పట్టణానికి చెందిన హ్నామ్టే 2016 జూన్ 9న జన్మించింది. మూడేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించింది. ఆమె ‘మా తుఝే సలాం’ మ్యూజిక్ వీడియోను యూట్యూబ్‌లో వారం రోజుల్లోనే 30 లక్షల మంది చూశారు. ఈ సంఖ్య ప్రస్తుతం 4.7 కోట్లకు చేరింది. ఆమె జీవితంపై తీసిన ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’కు 2023లో ఈశాన్య చలన చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు వచి్చంది. -
మిజోరం వండర్ కిడ్కి అమిత్ షా స్పెషల్ గిఫ్ట్
మిజోరాం: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఓ చిన్నారికి గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు. శనివారం మిజోరాంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఏడేళ్ల చిన్నారి ఎస్తేర్ లాల్దుహవ్మి హనామ్టే వందేమాతరాన్ని పాడింది. ఆ చిన్నారిని అభినందిస్తూ గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ చిన్నారిని "వండర్ కిడ్"గా అభివర్ణించిన అమిత్ షా.. భారత్‌పై ప్రేమ మనల్ని ఏకం చేసిందన్నారు. ‘‘చిన్నారి ఎస్తేర్ వందేమాతరాన్ని పాడి నా హృదయాన్ని కదిలించింది.. ఏడేళ్ల చిన్నారికి దేశంపై ఉన్న ప్రేమ తన పాటలో కనిపించింది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి పాట వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. కాగా, 2020లో ‘మా తుజే సలామ్’ పాట వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎస్తేర్.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె అనేక అవార్డులను కూడా అందుకుంది.Love for Bharat unites us all.Deeply moved to listen to Mizoram's wonder kid Esther Lalduhawmi Hnamte, singing Vande Mataram in Aizawl today. The seven-year-old's love for Bharat Mata poured out into her song, making listening to her a mesmerizing experience.Gifted her a… pic.twitter.com/7CLOKjkQ9y— Amit Shah (@AmitShah) March 15, 2025 -
నేను బాషా.. ఒక్కసారి రాస్తే 400 భాషల్లో రాసినట్టు!
మీకు ఎన్ని భాషలొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీషు.. ఇంకా? ఈ మూడేనా? నాలుగైదు భాషలు మాట్లాడేవారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? మాట్లాడటం సరే, వాళ్లు ఆ భాషలు రాయగలరా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చెన్నైకి చెందిన మహమూద్ అక్రమ్. అతను ఎన్ని భాషల్లో రాయగలడో తెలుసా? అక్షరాలా 400 భాషలు. అంతేకాకుండా, సుమారు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ ఘనతలతో అతను ఇప్పటికి మూడు ప్రపంచ రికార్డులు సాధించాడు.అక్రమ్ తండ్రి షిల్బీ మొళిప్పిరిన్. ఉద్యోగరీత్యా రకరకాల దేశాలు ప్రయాణించేవారు. ఆ సమయంలో అక్కడి స్థానిక భాష అర్థంకాక, వారితో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు. దీంతో మెల్లగా ఆ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టి 16 భాషల్లో మాట్లాడే స్థాయికి వచ్చారు. తండ్రిని చూస్తూ పెరిగిన అక్రమ్ కూడా అలా రకరకాల భాషల మీద ఆసక్తి పెంచుకున్నాడు.. దాంతో తండ్రి అక్రమ్‌కు నాలుగేళ్ల వయసు నుంచే రకరకాల భాషల్లోకి పదాలు, వాటికి అర్థాలు నేర్పించేవారు. ఆరు రోజుల్లో మొత్తం ఇంగ్లీషు అక్షరాలు (English Letters) నేర్చుకున్న అక్రమ్, మూడు వారాల్లో తమిళంలోని 299 అక్షరాలను నేర్చేసుకుని ఆ చిన్నవయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఆరేళ్ల వయసొచ్చేసరికి తండ్రితో రకరకాల భాషల్లో మాట్లాడటమే కాకుండా తమిళ వాక్యాలను స్పష్టంగా చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో 50 భాషలు సాధన చేసి, వాటి మీద అవగాహన తెచ్చుకున్నాడు. కొడుకు ఆసక్తిని గమనించి, వివిధ భాషల పుస్తకాలు తెప్పించి, అతనికి ఇచ్చేవారు మొళిప్పిరిన్. కేవలం చదవడమే కాకుండా, ఆ భాషల్లో టైప్ చేయడం కూడా మొదలుపెట్టిన అక్రమ్, అతి చిన్నవయసులో వివిధ భాషలు టైప్ చేసి మొదటి ప్రపంచ రికార్డు సాధించాడు.10 ఏళ్ల వయసులో మన జాతీయ గీతం ‘జనగణమన’ను ఒక్క గంటలో 20 భాషల్లో రాసి రెండో ప్రపంచ రికార్డు సాధించాడు. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి 400 భాషలు చదివి, రాసి, టైప్ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో మూడోసారి అతనికి ప్రపంచ రికార్డు సొంతమైంది. ఒక వాక్యాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియలో ఆరితేరిన అక్రమ్, అందుకుగానూ జర్మనీ దేశంలో ప్రతిష్టాత్మకమైన ‘జర్మనీ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకున్నాడు. అనువాదంలో అతని వేగం చూసి సీనియర్ అనువాదకులు సైతం ఆశ్చర్యపోయారు.చదవండి: డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్అయితే భాషల మీద ఇంత పట్టున్న అతనికి స్కూళ్ల నుంచి ప్రోత్సాహం రాలేదు. భాషల మీద కాకుండా కేవలం సబ్జెక్టుల మీదే దృష్టి పెట్టాలని అతణ్ని ఒత్తిడి చేశారు. దీంతో స్కూల్ మానేసి, ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత అతని ప్రతిభ గుర్తించి, ఆస్ట్రియాలోని డనుబే ఇంటర్నేషనల్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ ఇచ్చి మరీ తమ స్కూల్లో చేర్చుకుంది. ప్రస్తుతం అక్రమ్ యూకేలోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి భాషావిభాగంలో ఒకేసారి రకరకాల డిగ్రీలు చేస్తున్నాడు. తన భాషా పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాడు. -
ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్
అతనో అద్భుతం.. అసాధ్యాలను సుసాధ్యం చేయగల బాలనగధీరుడు. అంతర్జాతీయ స్థాయిలో అసమాన ప్రతిభాపాటవాలను చాటి అబ్బురపరిచిన జ్ఞానయోధుడు.. 15 ఏళ్లకే ఆసియాలోనే అతిపిన్న వయసున్న డేటా సైంటిస్టుగా గుర్తింపు పొందిన శక్తిమాన్.. తెలంగాణ ప్రభుత్వమూ అతని మహత్తర ప్రజ్ఞకు ముగ్ధురాలైంది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే ప్రాజెక్టు రూపకల్పన బాధ్యతను అప్పగించింది. ఈ బృహత్తర ఆవిష్కరణను భుజానికెత్తుకున్న బాలమేధావి ఎవరో కాదు.. పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. స్వస్థలం తెనాలి. తెనాలి: ప్రియ మానస, రాజ్‌కుమార్ దంపతుల ముద్దుల కొడుకు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. సిద్ధార్థకు చిన్ననాటి నుంచి కంప్యూటర్ అంటే మక్కువ ఎక్కువ. అతడి ఆసక్తిని గుర్తించిన తండ్రి నాలుగో తరగతినుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్‌ను నేర్పిస్తూ వచ్చారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్‌పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేశాడు. ఉద్యోగం చేస్తానని తండ్రిని కోరాడు. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కంప్యూటర్ సంస్థలో అతడిని చేర్చాలని తీసుకువెళ్లగా బాలుడన్న కారణంతో తిరస్కరించారు. చేసేదిలేక రాజ్‌కుమార్ ఆన్లైన్ కోర్సులను కొనిచ్చారు. ఆ వీడియోలు చూస్తూ స్వయం అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై కమాండ్ సాధించాడు. సడలని సంకల్పం ఉద్యోగం చేయడం భారత్‌లో సాధ్యం కాదని తండ్రి నిరాశపరిచినా సిద్ధార్థ పట్టు సడలలేదు. స్వయంగా రెజ్యూమ్ తయారుచేసుకుని ప్రముఖ కంపెనీలకు పంపాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడినా వయసు తెలిసి మిన్నకున్నాయి. ఈ విషయం మోంటెగ్న్ కంపెనీ సీఈఓ వరకు వెళ్లడంతో ఆయన సిద్ధార్థను స్వయంగా పిలిపించుకుని సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశారు. ‘నీతో వండర్స్ చేయిస్తా’నంటూ ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగరాదన్న తండ్రి షరతుతో వారంలో మూడురోజుల ఉద్యోగానికి సిద్ధార్థ ఓకే చేశాడు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు. ప్రస్తుతం ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్‌లో కృషి చేస్తున్నాడు. చదువుకు ఆటంకం కలగకుండానే.. స్వస్థలం తెనాలి అయినా సిద్ధార్థ కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోంది. సిద్ధార్థ హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో పదోతరగతి చదువుతున్నాడు. వారంలో మూడురోజులు స్కూలుకు వెళ్లే అతను మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో ఉద్యోగానికి వెళ్తాడు. అంతేకాకుండా అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’తరపున అక్కడి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులనూ నిర్వహిస్తున్నాడు. అందుకే సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. బృహత్తర బాధ్యత ఈ నేపథ్యంలో సిద్ధార్థకు తెలంగాణ ప్రభుత్వం బృహత్తర బాధ్యతను అప్పగించింది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే కేంద్రప్రభుత్వ రీసెర్చ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని కోరింది. తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ స్వయంగా సిద్ధార్థను ఆహ్వానించి ఈ ప్రాజెక్టును అప్పగించారు. సిద్ధార్థ పరిశోధనలు ఫలిస్తే ఆ పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారని అతడి తండ్రి రాజ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో ఈ ప్రాజెక్టు రీసెర్చ్ కొనసాగిస్తున్న సిద్ధార్థ.. మరోవైపు కోడింగ్ క్లాసులు చెబుతూ ఉద్యోగం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పైనా ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నాడు. (క్లిక్: పుష్పపై ‘ఫైర్’.. స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి..) లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్‌ల జీవితచరిత్రలు, బిల్‌గేట్స్ మాటలు, స్టీవ్‌జాబ్స్ పనితీరు నాకు ఆదర్శం. వారి ప్రేరణతోనే నా కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నా. ప్రపంచ టాప్ ఫైవ్‌లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిని కావాలని ఉంది. మంచి గేమ్ డిజైన్ చేయాలనేది నా లక్ష్యం. ప్రజోపయోగ ప్రాజెక్టులు చేయాలనేది ధ్యేయం. వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్ రూపొందించాలని ఉంది. నా లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా. – పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్, డేటా సైంటిస్టు -
న్యూస్‌మేకర్..: ఎవరెస్ట్‌కు హలో చెప్పింది
పదేళ్ల అమ్మాయి ఇంటి బయట ఆడుకుంటూ ఉంటే కన్నేసి పెడతాం. స్కూల్ నుంచి వచ్చే వరకూ ఎదురు చూస్తాం. పార్క్‌కు వెళ్తానంటే తోడు వెళ్తాం. కాని ఎవరెస్ట్ వరకూ వెళ్తానంటే? ముంబై చిన్నారి పదేళ్ల రిథమ్ మమానియా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరిన చిచ్చర పిడుగుగా రికార్డు సృష్టించింది. నేపాల్‌లోని లుక్లా ఎయిర్పోర్ట్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు కాలి నడకన ఎక్కి దిగిన రిథమ్మొత్తం 128 కిలోమీటర్లను చిట్టి పాదాలతో గెలిచేసింది. ఊరు దాటడానికి కూడా బద్దకించే వారిని చూసి పకపకా నవ్వింది. సాహసం ఎవరి సొత్తూ కాదు... భయాన్ని దాటి విజయాన్ని సాధించడం మాకూ చేతనవును అని ఇటీవల ఎందరో భారతీయ స్త్రీలు ఎవరెస్ట్‌ను అధిరోహించి, బేస్ క్యాంప్ వరకూ చేరుకుని నిరూపిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన మార్గంలో, అనూహ్యమైన వాతావరణంలో, బృందాలుగా లేదా ఒకరిద్దరి సహాయంతో వారు ఈ సాహసాలు చేస్తున్నారు. కేరళ నుంచి నుంచి కశ్మీర్ వరకూ ఈ దారిలో ఉన్న వనితలు ఎందరో ఉన్నారు. 1983లో బచేంద్రి పాల్ ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారతీయ వనితగా ఖ్యాతి గడించినప్పటి నుంచి ఆ స్ఫూర్తిని ఎందరో కొనసాగిస్తున్నారు. మన ఖమ్మంకు చెందిన పూర్ణ అతి తక్కువ వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన అమ్మాయిగా రికార్డు సాధిస్తే ఇటీవల భువనగిరికి చెందిన అన్విత రెడ్డి ఎవరెస్ట్‌ను అధిరోహించి తెలుగువారి ఘనతను మరోసారి చాటింది. 53 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ ఎక్కిన సంగీత భెల్ స్ఫూర్తినిస్తే 10 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ వెళ్లి తనదైన రికార్డు సాధించింది రిథమ్ మమానియా. స్కేటింగ్ నుంచి రిథమ్ మమానియాకు ముంబై వండర్‌కిడ్‌గా పేరు. చిన్నప్పటి నుంచి ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో జాతీయ స్థాయిలో రాణిస్తున్న రిథమ్‌కు ఎవరెస్ట్ గురించి తల్లిదండ్రులు చెప్పినప్పుడల్లా అక్కడకు వెళ్లాలన్న కుతూహలం కలిగేది. ఆటపాటల్లో, స్కేటింగ్‌లో ఎంతో ప్రతిభ చూపే రిథమ్‌ను తల్లిదండ్రులు ఉర్మి, హర్షల్ ఆమెను నిరుత్సాహ పరచలేదు. ఎనిమిదేళ్లు వచ్చాక ఆమెను తరచూ సహ్యాద్రి పర్వతాలలోకి ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లేవారు. ‘దూద్‌సాగర్’కు అలసట లేకుండా రిథమ్ నడిచినప్పుడు ఎవరెస్ట్ కలను నిజం చేయడానికి సహకరిద్దాం అని నిశ్చయించుకున్నారు. మొన్నటి ఏప్రిల్ చివరి వారంలో అందుకు శ్రీకారం చుట్టారు. నేపాల్ లుక్లా నుంచి నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకునేవారు, ఎవరెస్ట్‌ను అధిరోహించేవారు ఉంటారు. రిథమ్ కూడా ఆ మార్గాన్నే ఎంచుకుంది. లుక్లా సముద్ర మట్టానికి 9,318 అడుగులు ఉంటే అక్కడి నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 8,280 అడుగులు ఉంటుంది (బేస్ క్యాంప్ సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తు). కురిసే మంచు, మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆక్సిజన్ కొరత ఇలాంటి రిస్క్‌లు ఎన్ని ఉన్నా లుక్లా నుంచి కాలిమార్గాన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు తల్లిదండ్రుల తోడుతో ఏప్రిల్ 25న బయలుదేరింది రిథమ్. ఇందుకు నేపాల్‌లోని ఒక అడ్వంచర్స్ సంస్థ గైడ్‌గా వ్యవహరించింది. పోను 64 కి.మీ రాను 64 కి.మీ. దూరాన్ని మే 6న 11 రోజుల్లో పూర్తి చేసింది రిథమ్. ఆమెతో కలిసి వెళ్లిన బృందం తిరుగు ప్రయాణానికి హెలికాప్టర్‌ను ఎంచుకున్నా రిథమ్ నడక ద్వారానే తిరిగి లుక్లా చేరుకుంది. అంటే సంపూర్ణంగా తను ఆ దారిలోని కష్టనష్టాలను భరించింది. ఇంత చిన్న వయసులో ఇదంతా సాధించడం సామాన్యం కాదు. అనుకున్నది సాధించండి అనుకున్నది సాధించాలని గట్టిగా అనుకోండి. మీ కలలను ఆపవద్దు. వాటిని నెరవేర్చుకోండి అంది రిథమ్. మన వల్ల అవుతుందా మనం చేయగలమా అనే సందేహాలు ఉన్న ఎందరో ఈ మాట నుంచి స్ఫూర్తి పొందాలి. అనుకున్నది సాధించాలి. -
ముద్దులొలికే చిన్నారులు.. మూడు రికార్డులు!
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని మారుతీ నగర్‌కు చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ రాడ సురేష్, ప్రమీల దంపతుల కవలలు ప్రార్ధన, సాధన నాలుగు రోజుల వ్యవధిలో మూడు బుక్ ఆఫ్ రికార్డులు సాధించి ఔరా అనిపించారు. నాలుగేళ్ల నాలుగు నెలల వయసు కలిగిన వీరి జ్ఞాపక శక్తిని 22 నెలల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు గుర్తించారు. వర్చువల్ పద్ధతిలో వీరి జ్ఞాపక శక్తిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు చెందిన ప్రతినిధులు పరిశీలించారు. ఈ బాలికలు 118 రసాయనిక శాస్త్ర మూలకాల పేర్లు, 195 దేశాలు, వాటి రాజధానుల పేర్లు నిమిషాల వ్యవధిలో చెప్పడంతో ఈ మూడు రికార్డులను సాధించారని తండ్రి సురేష్ తెలిపారు. ఈ నెల 21న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, 22న కలాం వరల్డ్ రికార్డ్స్, 24న ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించినట్లు ఆయా సంస్థలు సమాచారం ఇచ్చాయని సురేష్ తెలిపారు. వేమన పద్యాలు, గణిత గుర్తులు, ఆకృతులు, చరిత్రకు సంబంధించిన కట్టడాలు, వ్యక్తుల పేర్లు కూడా వారు చెప్తారని తెలిపారు. కన్నడ, గుజరాతీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో అంకెలు చెబుతారన్నారు. -
అందరినీ ఆశ్చర్యపరుస్తున్న దేవాన్ష్
సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్ల వయసు అంటే అమ్మా, నాన్న అంటూ వచ్చి రానీ మాటలతో మురిపిస్తుంటారు చిన్నారులు.. ఆ బుజ్జిబుజ్జి మాటలు వింటుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కానీ అదే వయసున్న ఈ చిన్నారి మాత్రం తన మెమరీతో రెండు రికార్డులు సొంత చేసికున్నాడు. శ్లోకాలు, యోగా, పలు దేశాల జెండాలను గుర్తుపట్టడం ఇలా ఒకటేమిటి ఏ విషయమైనా రెండు మూడుసార్లు చెబితే ఆడుతూ పాడుతూ వాటిని గుర్తుంచుకుంటాడు. అంతేకాదు వాటి గురించి ఎప్పుడు అడిగినా టక్కున సమాధానం చెబుతాడు. ఒకటేమిటీ ఎన్నెన్నో.. సికింద్రాబాద్ సమీపంలోని కార్ఖానా ప్రాంతంలో నివసించే ఏరోనాటికల్ ఇంజినీర్ సుర్పూర్ సుధీంద్ర, ఇన్‌స్ట్రక్చనల్ డిజైనర్ స్వాతిల కుమారుడు దేవాన్ష్. ఏడాదిన్నర వయసులోనే ఉదయం తండ్రి యోగా చేయడం చూసి ఆసనాలు వేయడం మొదలు పెట్టాడు. తండ్రిని చూసి ఓం నమఃశివాయ అంటూ పూజలు చేసేవాడు. దేవాన్ష్ మెమరీ పవర్ గుర్తించిన తల్లిదండ్రులు రెండేళ్ల వయసు నుంచే శ్లోకాలు అభ్యాసం చేయించడం మొదలు పెట్టారు. ఆడుతూ పాడుతూ గురుబ్రహ్మ, గురువిష్ణు, గాయిత్రీ మంత్రం నేర్చుకున్నాడు. అంతేకాదు ఏ కారు లోగో చూపిస్తే ఆ కారు ఏ కంపెనీదో చెప్పేస్తాడు. ఆయా దేశాల జెండాలను చూపిస్తే అది ఏ దేశానిదో, కలర్స్‌ను గుర్తించడం, జంతువుల పేర్లను గుర్తు పెట్టుకుని మరీ చెబుతాడు. ఎలక్ట్రానిక్ వస్తువుల పేర్లు, వివిధ వృత్తుల్లో ఉండే వారిని చూపిస్తే వారు చేసే వృత్తి గురించి చెప్పేస్తాడు. వెంకటేశ్వర స్వామి ఫొటో చూపిస్తే గోవిందా, గోవిందా అంటాడు. ఏ దేవుడి ఫొటో చూపిస్తే ఆ దేవుడి పేరు గుర్తిస్తాడు. రెండున్నరేళ్లకే.. రెండు రికార్డులు.. దేవాన్ష్ అద్భుతమైన మెమరీని గుర్తించిన తల్లిదండ్రులు బ్రావో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దృష్టికి తీసుకువెళ్లారు. రెండేళ్ల 11 నెలల వయసులో ఈ రికార్డు సొంతం చేసికున్నాడు దేవాన్ష్ అంతకుముందు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులోనూ పేరు దక్కించుకున్నాడు. గ్లోబల్ కిడ్స్ అచీవ్మెంట్స్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. పలు యూట్యూబ్ చానెల్స్‌కు తనదైన శైలిలో ఇంటర్వ్యూలు ఇచ్చి సెలబ్రిటీగా మారుతున్నాడు. అతడి ప్రతిభను అందరికీ తెలియజేసేందుకు తల్లి స్వాతి ఓ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తోంది. చదవండి: హైదరాబాద్‌కు అంకాపూర్ చికెన్ -
ఐదేళ్ల బుల్లి మేధావి ‘శౌనక్’
పంజగుట్ట : ఐదేళ్ల బుడతడు తన అద్భుత జ్ఞాపకశక్తితో ఆశ్చర్యపరుస్తున్నాడు. కొండాపూర్‌కు చెందిన మాస్టర్ శౌనక్ శశాంఖ్ ఓఖ్‌డే(5) పిన్నవయసులోనే విశేష ప్రతిభ పాఠవాలతో ‘ఇండియన్ ఎచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటుదక్కించుకున్నాడు. ఇటీవల జాతీయ స్థాయిలో ‘ఇండియస్ యంగెస్ట్ చైల్డ్ విత్ ఇన్‌క్రిడిబుల్ మెమోరీ పవర్’తో పాటు ‘ఇండియాస్ ఎంగెస్ట్ మల్టీ టాలెంటడ్ చైల్డ్’ అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బాలుడి ప్రతిభ గురించి అతని తల్లి శ్రీయ ఓఖ్‌డే, తండ్రి శశాంఖ్ ఓఖ్‌డే ఆసక్తికరమైన అంశాలను వివరించారు. నానక్‌రాంగూడలోని ది శ్రీరామ యూనివర్సల్ స్కూల్లో పీపీ–2 చదువుతున్న శౌనక్ చిన్నతనం నుండే అటు చదువులతో పాటు క్రీడలు, ఒక్కసారి విన్న పాటను తిరిగి పాడడం, డైలాగ్‌లు విన్నవెంటనే తిరిగి చెప్పడం చేస్తుండేవాడన్నారు. అలాగే 196 దేశాల జెండాలు చూపిస్తే వెంటనే ఆ దేశం పేరు చెపుతాడని, ఆరు ఖండాల పేర్లు చెపుతారన్నారు. సైక్లింగ్, స్విమ్మింగ్ స్వయంగా నేర్చుకున్నాడని, కీబోర్డ్ వాయించడంతో పాటు, ఆరో తరగతి పుస్తకాలు కూడా సులువుగా చదువుతాడన్నారు. ఎంతటి లెక్కలైనా సులువుగా చేయడం, ఆంగ్లంలో వెయ్యి వర్డ్స్ స్పెల్లింగ్ చెపుతాడన్నారు. బాలుడి తల్లి శ్రీయ మాట్లాడుతూ.. తాను గర్భవతిగా ఉన్నప్పుడే పిల్లల మెదడు ఎలా అభివృద్ధి చెందుతుందో టిప్స్ పాటించానన్నారు. బాబుకు ట్యాబ్ గాని, ఫోన్ గాని ఎప్పుడూ ఇవ్వమని, దాని ప్రభావం బ్రెయిన్‌పై పడుతుందన్నారు. అవార్డులు అందుకున్న తర్వాత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బాలుడి ప్రతిభను అభినందించారన్నారు. -
బుల్లి బ్రూస్లీ.. బొక్కలు ఇరుగుతయ్...
టోక్యో : సాధారణంగా ఓ వయసొచ్చాక ప్రతీ ఒక్కరిలో శారీరక దారుఢ్యం గురించి ఒకరకమైన ఆలోచన కలగటం సహజం. చిన్న వయసు నుంచే సరిగ్గా శ్రద్ధా ఉంటే తీసుకుని ఉంటే బావుండు అని తెగ బాధపడిపోతుంటాం. అయితే తమ పిల్లాడి విషయంలో మాత్రం అది జరగకూడదని యుసేయి ఇమై పేరెంట్స్ భావించారు. అందుకే అతన్ని తిరుగులేని యోధుడిగా తీర్చిదిద్దాలని చిన్నప్పటి నుంచే ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టించారు. ఇప్పుడు ఆ ఏడేళ్ల చిచ్చర పిడుగు.. మినీ బ్రూస్లీగా అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. జపాన్‌కు చెందిన యుసేయి ఏడాదిన్నర వయసులో ఉండగానే అతని తల్లిదండ్రులు ఎక్సర్ సైజులపై పిల్లాడు దృష్టిసారించేలా చేశారు. అలా కొన్నాళ్లపాటు వాళ్ల పర్యవేక్షణలోనే రాటుదేలిన యుసేయి... నాలుగేళ్లు వచ్చాక సొంతంగా ఫిట్ నెస్ కేర్ తీసుకోవటం ప్రారంభించాడు. ఏడాది నుంచే బ్రూస్లీ సినిమాలు చూడటం మొదలుపెట్టిన రైసుయి ఆ ప్రేరణతో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుని.. ఐదేళ్లకే మార్షల్ కింగ్‌గా మారిపోయాడు. ఈ సిక్స్ ప్యాక్ బుడ్డొడిపై అంతర్జాతీయ మీడియాలు సైతం ప్రత్యేక కథనాలు వెలువరించటం విశేషం. అతని పంచ్ పవర్ చూసిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు సైతం నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఓ 20 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఉండేంత బలం అతని పిడికిలికి ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం సూపర్ కిడ్స్ అనే ఓ ప్రోగ్రాంలో తన గురువు బ్రూస్ లీ నటించిన గేమ్ ఆఫ్ ది డెత్ చిత్రంలోని ఫైట్ సీక్వెన్స్ ను తీసుకుని.. వెనకాల స్క్రీన్ పై అది ప్రదర్శితమౌతుంటే.. యాజ్ ఇట్ ఈజ్‌గా హవ భావాలతోసహా దానిని ప్రదర్శించి అందరిచేత విజిల్స్ వేయించుకున్నాడు. ఈ వీడియో చూస్తే చాలూ ఇతని టాలెంట్ ఏంటో అర్థమైపోతుంది. ఫైట్లలోనే కాదు.. చదువుల్లో కూడా ఈ పిల్లాడు చాలా చురుకుగా ఉంటాడని టీచర్లు చెబుతున్నారు. అయితే ఫైట్ సమయంలో దూకుడు చూపించే రైసుయి.. తోటి విద్యార్థుల వద్ద మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడని అంటున్నారు. -
చైనా రియాలిటీ షోలో బుడ్డోడి సాహసం
-
11 ఏళ్ల ప్రపంచ మేధావి వైశాలిని
సాక్షి : మనతోటి వయసు ఉన్న వారు వయసుకు మించి ఏ రంగంలో అయినా అద్భుతాలు సృష్టిస్తే తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే దాని నుంచి మనం కూడా ప్రేరణ పొందేందుకు అది ఉపయోగపడుతుంది. దీనితో పాటు వారు ఆ స్థాయికి చేరడానికి చేసిన కృషి తెలుసుకుంటే, మనం ఇంకా ఎంత కష్టపడాలో మనకీ ఒక అవగాహన ఏర్పడుతుంది. అందుకే ఇక నుంచి ‘వార్తల్లో వండర్ కిడ్’లో భాగంగా వివిధ రంగాల్లో వయసుకు మించి రాణిస్తున్న చిన్నారుల గురించి తెలుసుకుందాం.. అది 2011. ఆ అమ్మాయి పేరు కె.వైశాలిని. వయసు 11 ఏళ్లు. అందరి లాంటి అమ్మాయి అయితే ఆరో తరగతి చదువుతూ..తనతోటి పిల్లలతో ఆడుతూ, పాడుతూ ఆనందంగా గడుపుతూ ఉండేది. తను కూడా ఇవన్నీ చేసింది. కానీ అందిరి కంటే భిన్నంగా తన వయసుకి మించి వైశాలిని ప్రదర్శించిన తెలివితేటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేశాయి. ప్రపంచంలోనే అత్యంత ఐక్యూ (తెలివితేటలను కొలవడానికి ప్రమాణాలు) ఉన్న చిన్నారిగా తమిళనాడులోని తిరుణవేలికి చెందిన వైశాలిని రికార్డు సృష్టించింది. ఆమె ఐక్యూ (ఇంటిలిజెన్స్ కోయిషెంట్) 225. వైశాలిని రోజుకి మూడు గంటల పాటు కంప్యూటర్ ముందే కాలక్షేపం చేస్తుందట. ఈ సమయాన్ని అతిక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు వినియోగించుకుంటుంది. తనకున్న అద్భుతమైన తెలివితేటలతో ఎనలేని విజ్ఞానాన్ని ఆర్జించింది. బీఈ, బీటెక్ విద్యార్థులకు కూడా క్లాసులు చెప్పడం వెశాలిని మేధాశక్తికి నిదర్శనం. అదే ఏడాది కర్ణాటక (మంగుళూరు)లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక’ నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌కు ఈ చిన్నారి ముఖ్య అతిథిగా హాజరయ్యింది. -
సిరియాలో వండర్ కిడ్