న్యూఢిల్లీ: మయన్మార్ ప్రభుత్వ ఆర్మీ(జుంటా) సైనికులు భారత్‌లోకి చొచ్చుకురావటంపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయటంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో పటిష్టమైన కంచెను ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలాంటి కంచె ఉందో.. ఇక్కడ (భారత్-మయన్మార్) సరిహద్దు వద్ద కూడా చాలా పటిష్టమైన కంచె ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో మనదేశంలోకి సరిహద్దులు దాటుకొని మయన్మార్ సైనికులు రావటం సాధ్యం కాదని పేర్కొన్నారు.
సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు.
ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మయన్మార్ ఆర్మీ సైనికుల విషయాన్ని.. మిజోరం సీఎం లాల్దుహోమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. భారత సరిహద్దుల్లోని మిజోరం ప్రాంతం నుంచి మయన్మార్ ఆర్మీ సైనికులను వెనక్కి పంపించాలని కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన విషయం తెలిసిందే.
చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన
Comments
Please login to add a commentAdd a comment