
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజులు కేంద్రం వర్సెస్ స్టాలిన్ అనే విధంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూపాయి సింబల్‌ను తొలగించడం మరింత చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్ కౌంటరిచ్చారు.
తాజాగా ఓ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ..‘గతంలో ఓ సందర్భంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఆంగ్ల ‘రూ’కి బదులుగా తమిళంలోని ‘రూ’ అనే అర్థం సూచించే అక్షరాన్ని వినియోగించారు. మరి ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ‘రూ’ అనే అక్షరాన్ని వినియోగించడం కూడా సరైనదే కదా. ప్రస్తుతం భాషపై జరుగుతున్న వివాదంలో మా వైఖరిని మేము తెలియజేస్తున్నాం. మా మాతృ భాషను రక్షించుకుంటున్నాం. భాషపై గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించాలనుకునే వారు కేంద్రమంత్రి చర్యపైనా ఇప్పుడు మాట్లాడండి’ అని ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఇదే సమయంలో మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని ఆయన మండిపడ్డారు. దీంతో, ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉండగా.. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్రం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక, రూపాయి విషయంలో స్టాలిన్ నిర్ణయాలన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి.
Comments
Please login to add a commentAdd a comment