కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి జనజీవనాన్ని స్ధంభింప చేశాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడటంతో దాదాపు 22మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వరదలు ముంచెత్తడంతో అనేక నదులు, ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 26 సంవత్సరాల తరువాత మొదటి సారి ఇడుక్కి డ్యామ్ గేట్లను తెరిచినట్టు అధికారులు ప్రకటించారు.