
బటంగ్ కలి: మలేసియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గల్లంతయ్యారు. సెలంగోర్ రాష్ట్రం బటంగ్ కలి పట్టణ సమీపంలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఫార్మ్‌హౌస్‌లోని మూడెకరాల్లో 90 మంది పర్యాటకులున్న క్యాంప్ సైట్‌ను 100 అడుగుల ఎత్తైన రోడ్డు నుంచి బురద, రాళ్లతో కూడిన మట్టి ఒక్కసారిగా ముంచెత్తింది. గాఢ నిద్రలో ఉన్న 21 మంది బురద మట్టి కింద సజీవ సమాధి కాగా, 12 మంది జాడ తెలియకుండా పోయారు.
రోడ్డు పక్కన ఉన్న ఓ ఫార్మ్‌హౌస్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.
ఇదీ చదవండి: కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు
Comments
Please login to add a commentAdd a comment