ఈటానగర్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ కొండచరియాలు విరిగిపడ్డాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలతో దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని జాతీయ రహదారి-33పై మున్లీ, అనిని ప్రాంతాల మధ్య భారీగా కొండచరియాలు విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడటంతో నేషనల్ హైవేపై కొంత భాగం కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడింది. దీంతో చైనా బోర్డర్‌లోని దిబాంగ్ వ్యాలీ జిల్లాకు భారత్‌లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇక.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దిబాంగ్ వ్యాలీ వెళ్లేందుకు ఇదొక్కటే మార్గం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
🚨🚨🚨Arunachal Pradesh hit by massive landslides. Highway linking China border washed away#ArunachalPradesh pic.twitter.com/96eiVRcPkI
— Rosy (@rose_k01) April 25, 2024
దీంతో వేంటనే రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ సిబ్బంది హైవే మరమత్తులకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అత్యవసర సేవలు, వస్తువులకు ప్రస్తుతం ఎటువంటి అంతరాయం లేదని అధికారులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. హైవే పునరుద్ధరణ పనుల కోసం మూడు రోజుల సమయం పడుతుందని పేర్కొంది. ఇక.. నేషనల్ హైవే-33 దిబాంగ్ వ్యాలీ జిల్లా ప్రజలకు, ఆర్మీకి చాలా కీలకం.
Comments
Please login to add a commentAdd a comment