ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భారీ వర్షాల కారణంగా తవాంగ్ జిల్లా ఫామ్లా గ్రామంలో గురువారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.
ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి తవాంగ్ జిల్లా డిప్యూటీ కలెక్టర్కు ఫోన్ చేసి... వివరాలు కనుకున్నారు. అయితే మృతులంతా భవన నిర్మాణ కార్మికులను తెలిసింది. వీరంతా ఫామ్లాలో హోటల్ నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులను ప్రభుత్వాధికారులు వెల్లడించారు.