అరుణాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. రాజధాని ఈటానగర్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ,పరిపాలన అధికారులు తెలిపారు.
అరుణాచల్‌లోని హైవే-415పై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. ఇటానగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని అనేక చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు. ఏడు చోట్ల సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రజలు నదీ తీరాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కాగా ఈశాన్య రాష్ట్రాల్లో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులను సమాయత్తం చేస్తూ హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వరదల కారణంగా 37 మంది మృతిచెందగా, 10 జిల్లాల్లో 1.17 లక్షల మందికి పైగా జనం వరదల బారిన పడ్డారు. అధికారులు 134 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 17,661 మంది ఆశ్రయం పొందుతున్నారు. బరాక్‌లోని కరీంగంజ్‌లోని కుషియారా నది ప్రస్తుతం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment