
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో ఆదివారం(జూన్23) కుండపోత వర్షం కురిసింది. దీంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి.
గత వారం రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు పడుతున్నప్పటికీ ఆదివారం తక్కువ సమయంలో కురిసిన ఎక్కువ వర్షం(క్లౌడ్ బర్స్ట్) ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారి 415పై కూడా వరద ప్రభావం పడింది.
దీంతో ఇటానగర్‌లోకి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. చాలా వాహనాలు రోడ్డుపై ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. కొండ చరియలు విరిగిపడే ఛాన్సున్న ప్రాంతాలకు, నదుల వద్దకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.