breaking news
Cloud burst
-
మెదక్‌లో క్లౌడ్ బరస్ట్.. చెరువుల్లా రోడ్లు, కాలనీలు
సాక్షి, మెదక్: అతిభారీ వర్షం దాటికి మెదక్ మరోసారి అతలాకుతలం అయ్యింది. గురువారం జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ వర్షం (క్లౌడ్ బరస్ట్) కురిసింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్‌ను అధికారులు తొలగించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
Reasi Cloudburst: కొండచరియలు పడి ఇల్లు ధ్వంసం.. ఏడుగురు మృతి
రియాసి: జమ్ముకశ్మీర్‌లోని రియాసి పరిధిలోని మహోర్ ప్రాంతంలోగల బద్దర్ గ్రామంలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. క్లౌడ్ బరస్ట్ అనంతరం వారి మట్టి ఇల్లు కొండ చరియల కింద శిధిలమయ్యింది.ఈ ఘటన గురించి మహోర్ ఎమ్మెల్యే మొహమ్మద్ ఖుర్షీద్ మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడిన సమయంలో ఆ కుటుంబంలోని వారంతా నిద్రలో ఉన్నారని, ఇల్లు కూలడంతో వారు శిథిలాల కింద సమాధి అయ్యారని తెలిపారు. స్థానికులు అప్రమత్తమై, సహాయక చర్యలు చేపట్టి ఏడు మృతదేహాలను వెలికితీశారు. #KNSUPDATE || Anguished by the cloudburst & rain-triggered landslides in Reasi & Ramban. Condolences to the bereaved families. Spoke to Senior Officials and took stock of the situation. Rescue and relief operations are underway. All possible assistance is being provided to the… pic.twitter.com/jZJr9nCTj9— KNS (@KNSKashmir) August 30, 2025మృతులను నజీర్ అహ్మద్, వజీరా బేగం, బిలాల్ అహ్మద్, మహ్మద్ ముస్తఫా, మహ్మద్ ఆదిల్, మహ్మద్ ముబారక్, మహ్మద్ వసీమ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు రంబన్ జిల్లాలోని రాజ్‌గడ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన విపత్తులలో ముగ్గురు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
jammu Kashmir: రంబన్‌లో క్లౌడ్ బరస్ట్.. అంతటా హాహాకారాలు.. ముగ్గురు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఫలితంగా ఆకస్మిక వరదలు తలెత్తాయి. అనేక ఇళ్లు జల సమాధి అయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. నలుగురు గల్లంతయ్యారు. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.రంబన్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగిస్తున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా అకస్మాత్తుగా వచ్చిన వరదలతో పలు ఇళ్లు జలమయమయ్యాయి. కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. వాతావరణ శాఖ భారీ వర్ష సూచనకు సంబంధించిన హెచ్చరిక జారీ చేసింది.ఆగస్టు 14న చిసోటిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన విపత్తులకు 65 మంది మృతిచెందారు. వీరిలో అధిక సంఖ్యలో పర్యాటకులున్నారు. ఈ ఘటనల్లో 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఇదేవిధంగా కథువా జిల్లాలో ఆకస్మిక వరదకు ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు. మంగళవారం రియాసి జిల్లాలోని వైష్ణో దేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి, 34 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఆకస్మిక వరదల తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 24న జమ్మూను సందర్శించారు. J&K| Cloudburst in Rajgarh area of Ramban district. 3 bodies recovered, 2 more reportedly missing⁰Rescue operation underway#Ramban #Cloudburst #JammuAndKashmir pic.twitter.com/oACzmLMy7B— Saahil Suhail (@SaahilSuhail) August 30, 2025 -
మేఘం బద్దలైతే..! క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి..?
-
చైనా-భారత్-పాక్.. కనివినీ ఎరుగని రీతిలో విధ్వంసం!
దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనాలను ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి. మునుపెన్నడూలేని విధంగా క్లౌడ్ బరస్ట్, మెరుపు వరదలు మూడు దేశాల్లోనూ తీవ్ర నష్టం కలిగించాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా.. ఈ ఏడాది మాత్రం అసాధారణంగా నమోదు అవుతోంది. అందుకు కారణాలను పరిశీలిస్తే.. భారీ వర్షాలు భారత్, పాకిస్తాన్, చైనా దేశాలను పెను విపత్తులుగా ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్, మెరుపు/ఆకస్మిక వరద(Flash Floods) ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఇవే ఈ మూడు దేశాల్లో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించాయి. జమ్ము కశ్మీర్ ఈ ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఎంతో మంది మరణించడం చూస్తున్నదే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి.ఇక.. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పంజాబ్ ప్రాంతాలు వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు నెలల కాలంలో వర్షాలు, వరదలతో పాక్‌లో 700 మంది మరణించినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. వీళ్లలో చిన్నారులే అధికంగా ఉన్నారు. చైనాలో రెండు నెలల వర్షాల వల్ల ₹1.84 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలిపోతోంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం.. దానికి వ్యతిరేకంగా ఇంకొన్ని చోట్ల తగ్గుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. మాన్సూన్ ట్రఫ్ అంటే..మాన్సూన్ ట్రఫ్ అనేది దక్షిణాసియా దేశాల్లో వర్షాకాలంలో వర్షాల పంపిణీకి దిశానిర్దేశం చేసే వాతావరణ రేఖ. ఇది సాధారణంగా పాకిస్తాన్ నుంచి బెంగాల్ ఖాతీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ట్రఫ్ చుట్టూ తక్కువ ఒత్తిడి ఏర్పడిన ప్రాంతాల(Low Pressure Formation) వల్ల వర్షాలు కురుస్తుంటాయి. చైనా, పాక్, భారత్‌లో ఈ సీజన్లో వర్షాలకు కారణం ఇదే. (తక్కువ ఒత్తడి ప్రాంతాల్లోకి చుట్టుపక్కల నుంచి గాలి ప్రవహిస్తుంది. ఆ గాలి ఆవిరితో నిండిన మేఘాలను తీసుకువస్తుంది. ఇది వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే మాన్సూన్ కాలంలో తక్కువ ఒత్తడి ప్రాంతాలు భారీ వర్షాలకు కారణమవుతాయి). అయితే..వాతావరణ మార్పు, నగరీకరణ, అటవీ నాశనం వంటి మానవ చర్యలు ఈ ట్రఫ్ మార్గాన్ని అస్థిరంగా మార్చి వర్షాల తీవ్రతను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొండ ప్రాంతాలు, నదుల నుంచి నీటి ఆవిరి ఎక్కువగా ఉంటోంది. ఈ ఆవిరి మేఘాల్లో చేరి, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తక్కువ సమయంలో భారీ వర్షంగా కురుస్తుంది. ఇది వర్షపాతం తీవ్రతను పెంచుతూ, ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. పైపెచ్చు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆవిరి పెరిగి, తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ✅ పరిష్కార మార్గాలు• ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: ప్రజలకు సమయానికి సమాచారం అందించాలి. అయితే అది కష్టతరంగా మారుతోంది• వరద మైదానాల పునరుద్ధరణ: సహజ జల ప్రవాహ మార్గాలను తిరిగి స్థాపించాలి.• స్థిరమైన నగరీకరణ ప్రణాళికలు: పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి.• అటవీ విస్తరణ: వర్షపు నీటిని శోషించే వనరుల పెంపు.• ప్రజల అవగాహన: వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తులపై ప్రజలలో చైతన్యం కలిగించాలి.దక్షిణాసియాలో వర్ష విపత్తులు మామూలు ప్రకృతి ధోరణుల కంటే ఎక్కువగా మానవ చర్యల ప్రభావంతో ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పును అర్థం చేసుకుని, దీన్ని ఎదుర్కొనే విధానాలను అభివృద్ధి చేయడం అత్యవసరమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. -
ప్రాకృతిక ఉత్పాతాలా... మన పాపాలా?
ప్రకృతి ఏదీ అట్టిపెట్టుకోదు. మనం ఏదిస్తే దాన్నే అంతకుమించి తిరిగిచ్చేస్తుంది. పర్వతాలకు ఇది మరింతగా వర్తిస్తుంది. అభివృద్ధి పేరుతో చేస్తున్న విధ్వంసానికి ప్రకృతి ప్రతిస్పందనగా తాజాగా దేశవ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తులే ఇందుకు నిదర్శనం. వాతావరణ మార్పులకు మానవవ తప్పిదాలు తోడై హిమాలయాలను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆగస్టు 5న ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ ధరాలీ గ్రామాన్ని నామరూపాల్లేకుండా చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఇటీవల భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ బీభత్సానికి ఏకంగా 65 మందికి పైగా బలయ్యారు. తాజాగా కశ్మీర్‌లోని కథువాలోనూ అదే పరిస్థితి! భారీ పరిమాణం, నిటారుగా ఉండే స్వరూపం హిమాలయాల్లో ఆకస్మిక, తీవ్ర వరదలకు దారి తీస్తుంటుంది. వీటికి గ్లోబల్ వార్మింగ్ తోడైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తరచూ వరదలొస్తున్నాయి. అటవీ నిర్మూలన, భూ వినియోగంలో మార్పులు సమస్య తీవ్రతను పెంచుతున్నట్టు సైంటిఫిక్ రిపోర్ట్స్ అధ్య యనం తేల్చింది. ధరాలి వరదలకు హిమనీ సరస్సు విరుచుకుపడటమే కారణమని నిపుణులు అంటున్నారు. 2013లో కేదార్‌నాథ్‌లో వేలాది మంది బలైన వరదలకు హిమనీ సరస్సు ఉప్పొంగడమే కారణం. 2023లో న్యూకాజిల్ వర్సిటీ అధ్యయనం ప్రకారం 2006 నుంచి 2016 మధ్య ప్రపంచంలో ఏటా ఏకంగా 332 గిగాటన్నుల మంచు కరిగిపోయింది. దీనివల్ల 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా హిమానీ సరస్సుల సంఖ్య 50 శాతం పెరిగింది. ఇది దిగువ ఉండేవారికి పెను ముప్పేనని అధ్యయనం వెల్లడించింది. డేటాకే దిక్కు లేదు: భారత్‌లో వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ తదితరాలపై డేటా సేకరణ ఉంది. కానీ హిమాలయాలపై లేదు. ప్రత్యేకించి హిమనీనదాల ఔట్ బరస్ట్‌కు సంబంధించి అసలే లేదు. అక్కడ 28,000 సరస్సులున్నాయని హిమనీనద సరస్సులపై ఇస్రో జాబితా చెబుతోంది. 25 హెక్టార్లకంటే ఎక్కువ విస్తీర్ణమున్న సరస్సులనే ఇస్రో పర్యవేక్షిస్తోంది. ముప్పుకు కారణంగా మారుతున్న చిన్న సరస్సులెన్నో ఉన్నాయి. అభివృద్ధి పనులు, రోడ్లు, వంతెనల నిర్మాణం, ఆవాసాల విస్తరణ. ఇళ్ళు, హోటళ్ళు, లాడ్జీల వంటివి ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇటీవల ప్రమాదం జరిగిన ధరాలిలో 1996లో నాలుగు భవనాలే ఉన్నాయి. ఇప్పుడక్కడ ఎటు చూసినా ఇళ్లు, లాడ్జీలు, దుకాణాలు, హోటళ్లు, రిసార్టులే! పైగా వాటన్నింటినీ వాలు ప్రాంతాల్లో నిర్మించారు! ఇది అత్యంత ప్రమాదకరమని హిమాలయాల్లో ప్రాకృతిక విపత్తులను అధ్యయనం చేస్తున్న జర్మనీ శాస్త్రవేత్త వోల్ఫ్‌గ్యాంగ్ ష్వాంగ్హార్ట్ తెలిపారు. అటవీ నిర్మూలన 2013లో కేదార్నాథ్ వరదల తర్వాత ఉత్తరాఖండ్‌ల నదీతీరాల వెంబడి నిర్మాణాలను నిషేధించారు. తర్వాత దాన్ని బేఖాతరు చేస్తూ భవనాలు, హోటళ్లను పునరి్నర్మించారు. పైగా జలవిద్యుత్ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఝాలా–జంగ్లా మార్గంలో ‘చార్ ధామ్ పరియోజన’లో భాగంగా ఏకంగా 6 వేల హిమాలయ దేవదారు వృక్షాలను నరికేశారు. ఇందులో 10 కి.మీ. పరిధిలో నిషేధాలు నిషిద్ధం! దేవదారు వృక్షాల నరికివేత వల్ల వాలు ప్రాంతాలు అస్థిరమవుతాయని నిపుణులు హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్లౌడ్ బరస్ట్‌తో మరోసారి ఆకస్మిక వరదలు.. ఏడుగురు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఇటీవల క్లౌడ్ బరస్ట్ విషాద ఘటన మరువక ముందే మరోసారి ప్రకృతి ప్రకోపించింది. తాజాగా కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో వచ్చిన ఆకస్మిక వరదల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతికి ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఘటీ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి, ఆదివారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో, ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదల ధాటికి రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వరదలకు కథువా పోలీసు స్టేషన్ నీట మునిగింది. దీంతో, కేంద్ర బలగాలు, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి.A heart wrenching video from Jod village near Janglot where people were stuck in mudslide after #cloudburst in #Kathua #JammuAndKashmir pic.twitter.com/OaSZt5S5iC— Ajay Jandyal (@ajayjandyal) August 17, 2025 మరోవైపు.. కథువా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగార్డ్, చాంగ్డా గ్రామాలు.. లఖన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిల్వాన్-హుట్లీలలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, పెద్దగా నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఉజ్ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో, స్థానికులను అక్కడి నుంచి తరలిస్తున్నారు.#Breaking Machail Yatra ke Badh ab Kathua main aaya Cloud Brust#CloudBrust in #Kathua District Ghati, Janglote. Railway track effected, NHW also effected Police station Kathua submerged in waterEvacuation is going on. pic.twitter.com/IS3kEB6M2y— Ashish Kohli ॐ🇮🇳 (@dograjournalist) August 17, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వరద ఉద్ధృతికి గ్రామంలోని పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కిష్ట్వార్ పోలీసు కంట్రోల్ రూమ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.Extremely Heavy Rainfall in Kathua District : Railway Track , Highway affected , Police station #Kathua submerged in Water pic.twitter.com/C3t67Wt2V3— Cross Town News (@CrossTownNews) August 17, 20254 dead, many injured after a cloudburst cut off a remote village in Kathua district of Jammu and Kashmir.The cloudburst hit Jod Ghati in Rajbagh area of the district during the intervening night of Saturday and Sunday.#Kathua #JammuKashmir pic.twitter.com/8uod9zI0rN— Vani Mehrotra (@vani_mehrotra) August 17, 2025 -
ఇంకా చిక్కని 82 మంది ఆచూకీ
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల విధ్వంసానికి గురైన చోసితీ గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సంభవించిన ఆకస్మిక వర్షాలు, వరదల ధాటికి ముగ్గురు సీఐఎస్ఎఫ్ జవాన్లు, ఒక స్పెషల్ పోలీసు ఆఫీసర్ సహా 60 మంది దుర్మరణం పాలయ్యారు. 167 మందిని అధికారులు రక్షించారు. మరో 82 మంది జాడ గల్లంతయ్యింది. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన భారీ బండరాళ్లను పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ఉదయం చిసోతీని సందర్శించారు. బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి పరిహారం అందజేస్తామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున ఇస్తామన్నారు. ధ్వంసమైన ఇళ్లకు సైతం పరిహారం ప్రకటించారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన గ్రామస్థులను ఒమర్ అబ్దుల్లా ఓదార్చారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ శుక్రవారం అర్ధరాత్రి చోసితీ గ్రామానికి చేరుకున్నారు. సహాయక చర్యలను సమీక్షించారు. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జితేంద్ర సింగ్ పరామర్శించారు. సహాయ పునరావాస చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు ఇప్పటిదాకా 50 మృతదేహాలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. క్లౌడ్ బరస్ట్‌లో కనీసం 16 నివాస గృహాలతోపాటు పలు ప్రభుత్వ భవనాలు, మూడు ఆలయాలు, 30 మీటర్ల వంతెన ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాలో వరదలో కొట్టుకుపోయాయి. మరోవైపు మచైల్ మాత యాత్రను వరుసగా మూడోరోజు శనివారం సైతం రద్దు చేశారు. -
Cloudburst: వేలాది మందిని మింగేస్తోన్న మేఘం
-
మీకో, మీ మంత్రికో, మీ ఎమ్మెల్యేకో జరిగితే ఇలాగే చేస్తారా?
జమ్ము కశ్మీర్ కిష్తవాడ్ జిల్లా చోసితీ గ్రామంలో ఫ్లాష్‌ఫ్లడ్ సహాయక చర్యలు మూడో రోజుకి చేరాయి. ఇప్పటిదాకా 60 మంది మరణించగా.. గల్లంతైన 80 మంది కోసం(ఆ సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది) గాలింపు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో స్థానికుల ఆగ్రహమూ తారాస్థాయికి చేరింది. అందుకు అక్కడి ప్రజాప్రతినిధులు తీరే కారణంగా తెలుస్తోంది.గురువారం మధ్యాహ్నాం క్లౌడ్‌బరస్ట్ కారణంగా మెరుపు వరదలు చోసితీని ముంచెత్తాయి. బురద నుంచి శకలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూ వస్తున్నాయి. దీంతో గల్లంతైన వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. జమ్ము కశ్మీర్ ఒమర్ అబ్దుల్లా శనివారం ఆ ప్రాంతంలో పర్యటించగా.. స్థానికుడి నుంచి ఆయనకు నిలదీత ఎదురైంది.‘‘పోలీసులు, సైన్యం మా వాళ్ల జాడ కోసం అహర్నిశలు ఇక్కడ కష్టపడుతున్నారు. మేమూ మాకు చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ 20 జేసీబీలు ఉన్నాయి.కానీ, ఇందులో రెండే పని చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ఇక్కడికి వస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత మూడురోజుల్లో ఇక్కడ రెండే రెండు పెద్ద బండరాళ్లను తొలగించారంటే పరిస్థతి అర్థం చేసుకోండి. మాకు కుటుంబాలు లేవా?. కనీసం మా వాళ్ల శవాలనైనా మాకు అప్పగించండి’’ అని ఎన్డీటీవీతో బాధితుడొకరు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సరిగ్గా అదే సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా అటుగా వచ్చారు. ఏం జరిగిందో చెప్పమంటూ ఆ వ్యక్తిని ఆరా తీశారు.జరిగిందంతా చెప్పి.. కనీసం తమవాళ్ల మృతదేహాలనైనా అప్పగించాలని కోరాడా వ్యక్తి. జరుగుతోంది అదేనని.. ఘటన జరిగిన నాటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ వ్యక్తికి సీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో.. అతను మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘‘సర్.. నేను చెప్పేది ఓసారి వినండి. నా కుటుంబం నుంచి 13 మంది జాడ లేకుండా పోయారు(తమ పిల్లల ఆచూకీ లేదంటూ పలువురు ఆ సమయంలో గట్టిగా రోదించారు). ఎమ్మెల్యేలు, మంత్రులు పది పదిసార్లు ఇక్కడికి వస్తున్నారు. జేసీబీలను ఆపేయించి ఫొటోలు దిగుతున్నారు. మేం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం’’ అని వివరించాడు. విషాదంతో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని, అది తాను అర్థం చేసుకోగలనని సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దీంతో ఆ యువకుడు.. మీకో, మీ ఎమ్మెల్యేకో, మీ మంత్రికో జరిగితే ఇలాగే చేస్తారా?.. త్వరగతిన చర్యలు తీసుకుంటారు కదా అని నిలదీశాడా వ్యక్తి. దీంతో అధికారులను పిలిపించిన సీఎం ఫరూక్ అబ్దుల్లా.. సహాయక చర్యలు త్వరగతిన జరిగేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. -
60కి చేరిన మరణాలు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లా చోసీతీ గ్రామంలో ‘క్లౌడ్ బరస్ట్’ ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం 60కి చేరింది. 30 మృతదేహాలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. మరో 69 మంది జాడ ఇంకా లభించలేదు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించడానికి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా గురువారం రాత్రి నిలిపివేసిన గాలింపు చర్యలను శుక్రవారం ఉదయం పునఃప్రారంభించారు. సైన్యం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చోసితీ గ్రామంలో రాళ్లు, బురదను తొలగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. క్లౌడ్ బరస్ట్‌లో 100 మందికిపైగా గాయపడ్డారని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలిపారు. .ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. శిథిలాల కింద నుంచి వెలికి తీసినవారిని తక్షణమే ఆసుపత్రికి తరలించడానికి చోసితీలో 65 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. గ్రామంలో గురువారం మధ్యాహ్నం గంటపాటు క్లౌడ్ బరస్ట్ విరుచుకు పడిన సంగతి తెలిసిందే. ఆకస్మిక వర్షాలు, వరదల ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. గ్రామాన్ని బురద ముంచెత్తింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మచైల్ మాత యాత్రను రెండో రోజు శుక్రవారం కూడా రద్దుచేశారు. -
కన్నీటి వరద
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా గురువారం చోసితీ గ్రామాన్ని భారీ వరద ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు సహా ఏకంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 220 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న 167 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 38 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మచైల్ మాత ఆలయానికి వెళ్లే దారిలో వాహనాలపై ప్రయాణించగలిగే చిట్టచివరి గ్రామం చోసితీ. జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో కొండల మధ్య ఉన్న ఈ గ్రామంపై గురువారం మధ్యాహ్నం 12 గంటలకు క్లౌడ్‌బరస్ట్ విరుచుకుపడింది. సరిగ్గా గంటపాటు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వరద ముంచెత్తింది. వరద దూసుకొచ్చిన సమయంలో గ్రామంలో 1,200 మంది ఉన్నట్లు తెలిసింది. మచైల్ మాత యాత్ర కోసం అప్పటికే చోసితీ గ్రామానికి చేరుకున్న భక్తులు భయకంపితులయ్యారు. సామూహిక వంటశాల(లంగర్)లో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. వంటశాలలోకి వరద నీరు చేరింది. పలు ఇళ్లు, దుకాణాలు, సెక్యూరిటీ ఔట్‌పోస్టు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వీధులన్నీ బురద, బండరాళ్లతో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షం, వరద ధాటికి ఇప్పటిదాకా 46 మంది మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలు ఛిద్రం చోసితీలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. బురద, రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలు ముక్కలయ్యాయి. శరీరం లోపలి అవయవాలు బయటకు వచ్చాయి. ఎటుచూసినా రక్తపు మరకలే. మృతదేహాల ఊపిరితిత్తుల్లోకి కూడా బురద చేరింది. పక్కటెముకలు విరిగిపోయాయి. రాళ్ల తాకిడికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. బురదను తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇక క్షతగాత్రులు షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని అంటున్నారు. అసలేం జరిగిందో చెప్పలేకపోయారు. గల్లంతైన తమవారి కోసం గ్రామస్తులు, భక్తులు వెతుకున్నారు. వారి రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో కిష్తవాడ్తోపాటు రాజౌరీ, ఉదంపూర్, పూంచ్, కథువా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తావి, చినాబ్, ఉజ్, సురాన్ తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సహాయక చర్యలు వేగవంతం చేయాలి: మోదీ కిష్తవాడ్ జిల్లాలో ఆకస్మిక వర్షాల్లో 40 మందికిపైగా భక్తులు, ప్రజలు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికిప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. సహాయక, పునరావాస చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. క్షతగాత్రులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ఫోన్లో మాట్లాడారు. చోసితీ గ్రామంలో సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులను ఆదుకోవాలని సూచించారు. క్లౌడ్ బరస్ట్ గురించి తెలిసిన వెంటనే కిష్తవాడ్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ వర్మతోపాటు సీనియర్ అధికారులు చోసితీకి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు స్థానిక పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, వరదల నేపథ్యంలో మచైల్ యాత్రను అధికారులు రద్దు చేశారు. ప్రజలు, యాత్రికుల సహాయార్థం కంట్రోల్ రూమ్, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో తొమ్మిది రోజుల క్రితమే క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మరణించగా, గల్లంతైన 68 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. విశిష్టమైన యాత్ర మచైల్ మాత యాత్ర జూలై 25న ప్రారంభమైంది. సెపె్టంబర్ 5న ముగియనుంది. చోసితీ నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో మచైల్ మాత ఆలయం ఉంది. ఈ గ్రామం నుంచే యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రికులు తొలుత ఇక్కడికి వాహనాల్లో చేరుకుంటారు. తర్వాత కాలినడకన దుర్గా మాత ఆలయానికి వెళ్తారు. ప్రతిఏటా జరిగే ఈ యాత్రలో వేలాది మంది పాల్గొంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఇది చాలా విశిష్టమైన యాత్రగా పేరుగాంచింది. యాత్ర కోసం చోసితీని బేస్‌క్యాంప్‌గా ఉపయోగిస్తుంటారు. -
జమ్మూకశ్మీర్ కిష్త్వార్ లో క్లౌడ్ బరస్ట్
-
కిష్ట్వార్లో క్లౌడ్ బరస్ట్.. 33 మంది మృతి.. 220మంది గల్లంతు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో స్వల్ప వ్యవధిలో కిష్ట్వార్, పహల్గాంలో రెండో చోట్ల జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకస్మికంగా ముంచెత్తిన వరదల కారణంగా గురువారం సాయంత్రం (ఐదుగంటల) సమయానికి 33 మంది మరణించారు. 220మంది గల్లంతయ్యారు. ఓవైపు క్లౌడ్ బరస్ట్ మరోవైపు కుండపోత వర్షంతో భారీ ఎత్తున ఆస్తినష్టం,ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.గురువారం మధ్యాహ్నం కిష్ట్వార్ జిల్లాలోని చషోటీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. స్థానికులు ఏర్పాటు చేసుకున్న గుడారాలు ఎగిరిపోయాయి. కిష్ట్వార్లో క్లౌడ్ బరస్ట్ అయిన కాసేపటికే పహల్గాంలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. పహల్గాంకు సమీపంలో మెరుపు వరదలు ముంచెత్తాయి. జల ప్రవాహం ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. కిష్ట్వార్లో మెరుపు వరదలతో 220మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు.క్లౌడ్ బరస్ట్‌తో అప్రమత్తమైన రెస్క్యూబృందాలు వరదల్లో చిక్కుకున్న వందల మంది బాధితుల్ని రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. చషోటీ ప్రాంతంలో ప్రతీ ఏడాది జూలై 25 నుండి సెప్టెంబర్ 5 వరకు మచైల్ మాతా యాత్ర (Machail Mata Yatra) ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఏడాది చండీ మాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా మచైల్ మాతా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు, స్థానికుల మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.వరద సంభవించిన చషోటీ ప్రాంతం మచైల్ మాతా యాత్రకు ప్రారంభ ప్రాంతంతో పాటు కిష్ట్వార్లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో వాహన సదుపాయం ఉన్న చివరి గ్రామం కూడా. దీంతో క్లౌడ్ బరస్ట్ కారణంగా చషోటీ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీ విచారంజమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్ క్లౌడ్ బరస్ట్‌పై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.వరదల కారణంగా గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన వారికి సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. My thoughts and prayers are with all those affected by the cloudburst and flooding in Kishtwar, Jammu and Kashmir. The situation is being monitored closely. Rescue and relief operations are underway. Every possible assistance will be provided to those in need.— Narendra Modi (@narendramodi) August 14, 2025ఇప్పటికే ముంచెత్తిన వరద నుంచి గ్రామస్తులతో పాటు భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కిష్ట్వార్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పంకజ్ శర్మ తెలిపారు. వరదలపై జమ్మూకశ్మీర్ ఉదంపూర్ ఎంపీ, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అప్రమత్తమయ్యారు. క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతంలోని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సహాయకచర్యల్ని వేగవంతం చేయాలని అదేశాలు జారీ చేశారు. Massive cloudburst struck Chishoti area in the Jammu and Kashmir’s Kishtwar district, along the route to the Machail Matta Yatra.Casualties are feared, though further details and official confirmation are awaited. https://t.co/d5AQMPAbfU pic.twitter.com/xJgI5WrpwP— Rakesh Kumar (@RiCkY_847) August 14, 2025 సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కార్యాలయం జిల్లా యంత్రాంగంతో సంప్రదిస్తున్నట్లు, అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. కిష్ట్వార్లో జరిగిన విషాదంపై సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పోలీసు,సైన్యం,రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ‘కిష్ట్వార్లో జరిగిన క్లౌడ్ బరస్ట్ బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలనేది నా ఆకాంక్ష. పౌరులు, పోలీసు,సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు రక్షణ, సహాయ కార్యకలాపాలను బలోపేతం చేయాలని, బాధితులకు కావాల్సిన సహాయం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. -
మృత్యు మేఘం..‘విస్ఫోట’ విలయం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరలీ గ్రామం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. పర్వతం నుంచి కిందికి వచ్చిన వినాశకర వరద నీరు, బురద, రాళ్లు.. ఆ గ్రామం నామరూపాలు లేకుండా చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 50 మందికిపైగా జాడ కానరావడం లేదు. దీనంతటికీ కారణం.. మేఘ విస్ఫోటం. ఆకాశంలో అపార జలరాశిని నింపుకొన్న మేఘాలు.. కేవలం స్వల్ప వ్యవధిలో కుంభవృష్టిగా విజృంభించడం. ఆ విస్ఫోటంతో విలయం సంభవించింది. దీన్నే క్లౌడ్ బరస్ట్.. మేఘ విస్ఫోటం అంటారు. ఉత్తరాఖండ్ వీటికి ప్రసిద్ధి. – సాక్షి, స్పెషల్ డెస్క్మేఘ విస్ఫోటం.. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెబుతోంది. గాలి పయనించే తీరు, ఎతై ్తన పర్వతాలు, గాలిలోని తేమ ఇందుకు ప్రధాన కారణాలు. వేడిగాలి పర్వత ప్రాంతాలపైకి వెళ్లి అక్కడ అల్పపీడనం వల్ల చల్లబడి తేమను విడుదల చేస్తుంది. వేడిగాలి ఎంత ఎక్కువగా పైకి వెళితే తేమ అంత అధికమై.. అదే ఒక్కసారిగా క్లౌడ్‌బరస్ట్ రూపంలో వర్షిస్తుంది. చాలా తక్కువ వ్యవధిలో భారీ వర్షం నమోదు కావడంతో ఆకస్మిక వరదలకు దారితీస్తుంది. క్లౌడ్ బరస్ట్ కాకున్నా దాదాపు అలాంటి పరిస్థితిని ఇటీవల హైదరాబాద్‌లోనూ చూశాం.ముందే చెప్పలేరా?వాతావరణ శాఖ.. వర్షం పడుతుందని చెప్పగలదు. సాధారణ, భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పగలదు. కానీ ఎంత మొత్తంలో వర్షపాతం నమోదవుతుందనేది మాత్రం చెప్పలేదు. 10 సెం.మీ. వర్షపాతంఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక గంట సమయంలో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్‌గా పరిగణిస్తామని ఐఎండీ చెబుతోంది. దీన్ని ముందే పసిగట్టాలంటే ఆ నిర్దిష్ట ప్రాంతంలో పటిష్ట రాడార్ నెట్వర్క్ లేదా వాతావరణాన్ని అంచనావేసే అధునాతన సాంకేతిక వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది. కేదార్నాథ్ విలయంక్లౌడ్బరస్ట్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే సంఘటన 2013లో ఉత్తరాఖండ్ విలయం. ఈ ఘటనలో 6,074 మంది చనిపోగా 70 వేలకుపైగా చార్ధామ్ యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. 2004 సునామీ తర్వాత ఇదే అతిపెద్ద ప్రకృతి విపత్తు. అక్రమ, అశాస్త్రీయ నిర్మాణాలు..: హిమాలయాలలో అక్రమంగా, అశాస్త్రీయంగా చేపట్టిన నిర్మాణాల వల్ల ఇలాంటి విపత్తుల సమయంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయ భూభాగంలో లోయ వైపున ఉన్న చాలా కాలువలు బలహీన ప్రాంతం, విరిగిన రాతిపై ఏర్పాటై ఉన్నాయి. అందుకే ఏదైనా షెల్టర్, హోటళ్ళు, భవనాలు, తాత్కాలిక దుకాణాల నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. హిమాలయాల పెరుగుదల స్వభావానికి తోడు, అధికం అవుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు రుతుపవనాల నమూనాలను మార్చాయి. దీని వలన వాటి ఆగమనాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది. అటవీ నిర్మూలన, భూ వినియోగ విధానాలలో మార్పు నేల స్థిరత్వాన్ని క్షీణింపజేసి, వర్షపు నీటిని పీల్చుకునే ప్రకృతి సహజ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘చార్ధామ్’లోనూ..: హోటళ్ళు, హోమ్‌స్టేస్, ఇతర పౌర నిర్మాణాలు.. నదులు, వాగుల మార్గాన్ని ఆక్రమించకుండా చూసుకోవడానికి ఎటువంటి వ్యవస్థ లేదన్నది నిపుణుల మాట. 2023లో 56 లక్షలకు పైగా ప్రజలు చార్ ధామ్‌ను సందర్శించారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న యాత్రికులు, పర్యాటకులకు వసతి కల్పించడానికి హోటళ్ళు, లాడ్జీలు, రోడ్లు, దుకాణాలను అస్థిరమైన వాలులు, వరదలకు గురయ్యే నదీ తీరాలలో నిర్మిస్తున్నారు. చార్ ధామ్ హైవే ప్రాజెక్ట్ కింద రోడ్ల విస్తరణ సున్నితమైన భూభాగాన్ని మరింత అస్థిరపరిచిందని, ఈ మార్గాల్లో తరచుగా కొండచరియలు విరిగిపడటానికి దారితీస్తోందని నిపుణులు భావిస్తున్నారు.ఎన్నో ‘మేఘ విస్ఫోటనాలు’» 2025 జూలై 26న రుద్రప్రయాగ్ జిల్లాలో పర్వత ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది. వరదల్లో చిక్కుకున్న 1,600 మంది చార్దామ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.» 2025 జూన్ 29న ఉత్తరాఖండ్‌లోని బార్కోట్–యమునోత్రి మార్గంలో నిర్మాణంలో ఉన్న భవనం దెబ్బతిని 9 మంది కార్మికులు గల్లంతయ్యారు. » పర్వత ప్రాంతాల్లో ఏర్పడిన ఓ సరస్సు.. 2023 అక్టోబర్‌లో కుండపోత వర్షం కారణంగా సిక్కింలో వినాశకర వరదలకు దారితీసింది. ఫలితంగా కనీసం 179 మంది మరణించారు.» 2021 అక్టోబర్‌లో అకాల భారీ వర్షం కారణంగా ఉత్తరాఖండ్‌లో రోడ్లు మునిగిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. కనీసం 46 మంది మరణించారు.» 2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలతో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ధౌలిగంగా నది లోయలో నీరు, రాళ్ళు, శిథిలాలు ఉప్పొంగడంతో 200 మందికి పైగా మరణించారు.» భారత్–పాకిస్తాన్ మధ్య ప్రవహించే జీలం నది 2014 సెప్టెంబర్‌లో అసాధారణంగా కురిసిన భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహించడంతో కాశ్మీర్.. గత 50 సంవత్సరాలలో అత్యంత దారుణమైన వరదలను చవిచూసింది. ఈ ఘటనలో దాదాపు 200 మంది భారతీయులు, 264 మంది పాకిస్తానీయులు మరణించారు.‘నదులకు వాటి సొంతదైన, సహజ మార్గం ఉంది. కానీ మనం దాని మార్గంలో భవనాలను నిర్మించి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాం, మార్చేస్తున్నాం. మేఘ విస్ఫోటం అంచనా వేయలేం. ప్రభుత్వం ప్రమాదకర మండలాలను గుర్తించాలి’ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
కొనసాగుతున్న ముమ్మర గాలింపు
ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్): ఎగువ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్(మేఘ విస్ఫోటనం) కారణంగా ఖీర్గంగా నదీ ప్రవాహం ఉప్పొంగి దిగువన ధరాలీ గ్రామా న్ని బురద ముంచెత్తడంతో అందులో కూరుకు పోయిన వారి జాడ కోసం యుద్ధప్రాతిపదికన గా లింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీలో ఇప్పటికే ఐదుగురు సజీవ సమాధికాగా మరొకరి మృతదేహాన్ని బుధవారం వెలికితీశారు. గ్రామంలో చిక్కుకుపోయిన 190 మందిని కాపాడారు. ఇంకా 100 మందికిపైగా జాడ గల్లతైంది. దీంతో ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసు, సహాయక బృందాలు సహాయక, అన్వేషణ చర్యల్లో పూర్తిగా మునిగిపోయాయి. హార్సిల్లోని ఆర్మీ క్యాంప్‌కు చెందిన 11 మంది జవాన్ల జాడ ఇంకా తెలియరాలేదు. గంగోత్రి ధామాన్ని దర్శించుకునేందుకు కేరళ నుంచి వచ్చిన 28 మంది యాత్రికుల బృందం జాడ గల్లంతైంది. దీంతో ఆ బృందసభ్యుల బంధువుల్లో ఆందోళనలు రెట్టింపయ్యాయి. ‘‘ ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి మంగళవారం ఉదయం 8.30 గంటలకు బయల్దేరినట్లు నాతో ఫోన్లో చెప్పారు. వాళ్లు ప్రయాణిస్తున్న మార్గంలోనే కొండచరియలు పడ్డాయి. తర్వాత వాళ్లకు ఫోన్ చేస్తే అస్సలు కలవడంలేదు’’ అని ఒక బంధువు ఏడుస్తూ చెప్పారు. ‘‘ధరాలీలో మాకు ఇల్లు, హోటల్ ఉన్నాయి. అక్కడే నా సోదరుడు, భార్య, కుమారుడు ఉంటారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంతవరకు నా సోదరుడు, అతని కుటుంబం జాడ తెలీడంలేదు’’ అని మరో వ్యక్తి వాపోయాడు.బురదలో కూరుకుపోయిన ప్రాచీన ఆలయంమంగళవారంనాటి బురదచరియలు దూసుకొచ్చిన ఘటనలో ధరాలీ గ్రామంలోని ప్రాచీన కల్ప్ కేదార్ శివాలయాన్ని బురద పూర్తిగా కప్పేసింది. ఈ ఆలయాన్ని సైతం కేదార్నాథ్ ఆలయం మాదిరే ‘కథూర్’ శైలిలో నిర్మించారు. దశాబ్దాల క్రితం జరిగిన ఇలాంటి ఘటనలోనూ కల్ప్‌కేదార్ ఆలయం చాలాభాగం మట్టిలో కూరుకుపోయింది. ఇన్నాళ్లూ శివాలయం పైభాగం మాత్రమే బయటకు కనిపించేది. దీంతో చిన్నపాటి మార్గం గుండా లోపలికి వెళ్లి భక్తులు దర్శనాలు చేసుకునే వాళ్లు. ఆలయ గర్భగుడిలో శివలింగంపై ఖీర్గంగా నదీజలం అభిషేకంచేస్తున్నట్లు పడేలా గతంలో ఏర్పాట్లుచేశారు. మంగళవారం నాటి ఉత్పాతంతో పూర్తిగా బురదలో కలిసిపోయింది. ఈ ఆలయాన్ని 1945లో తవ్వకాల్లో గుర్తించారు.పలు చోట్ల విరిగిపడిన కొండచరియలు..కొండచరియలు పడడంతో గంగోత్రి జాతీయ రహదారిపై పలు చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. గంగోత్రి జాతీయరహదారి వెంట లిమిఛా నదిపై గంగ్నానీ వద్ద నిర్మించిన వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ వైపు నుంచి వస్తున్న సహాయక బృందాలు ముందుకు కదల్లేక అక్కడే ఆగిపోయాయి. కొండచరియలు పడిన ప్రతిచోటా ఇదే పరిస్థితి. దీనికి తోడు భారీ వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కల్గిస్తున్నాయి. వర్షం తగ్గాక ఆకాశమార్గంలో గాలింపు కోసం ఆర్మీ ఎంఐ–17, ఛినూక్ హెలికాప్టర్లను సిద్ధం చేసింది. ‘‘ ధరాలీ గ్రామంలో సగభాగం సమాధిలా మారింది. ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలు, చెట్లు మొత్తం బురదలో కూరుకుపోయాయి. బాధితులకు ఆహారం, ఔషధాలు అందిస్తున్నాం. పునరావాస కార్యక్రమాలను 160 మంది పోలీసులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు’’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ చెప్పారు. బుధవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించారు. -
దేవభూమిలో విలయం.. గల్లంతైనవాళ్లు ఎందరో?
దేవభూమిని మరోమారు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నాం కుంభవృష్టి ధాటికి వరద పోటెత్తి ఏకంగా రెండు గ్రామాలు సర్వనాశనం అయ్యాయి. నివాసాలు, హోటల్స్ బురద వరదలో కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ విలయం ధాటికి ఇప్పటికే ఐదుగురు మరణించగా.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు, అదే సమయంలో చిక్కుకుపోయిన వాళ్లను రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరాఖండ్‌లో.. మంగళవారం ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ కుంభవృష్టి పెను విషాదాన్ని మిగిల్చింది. హర్సిల్ సమీపంలోని ఖీర్ గధ్ వాగు నీటిమట్టం ఊహించని రీతిలో ప్రమాదస్థాయికి చేరుకుని ఒక్కసారిగా సమీప గ్రామాలపై విరుచుకుపడింది. స్వల్ప వ్యవధిలో ధరాలీ (Dharali), సుకీ(Sukhi) గ్రామాలను కొండకు చెరోవైపు నుంచి ఆకస్మిక వరద(Flash Floods) ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో.. గల్లైంతన వారి కోసం బుధవారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా ఐదు మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. మరో 130 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే భారీ వర్షం సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తోంది. అయినప్పటికీ సైన్యం ముందుకు వెళ్తోంది. శరణార్థులకు భోజనం, దుప్పట్లు ఇతర సదుపాయాలను అందిస్తోంది. పోలీస్, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), భారత సైన్యం.. విపత్తు సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కనీసం 50 మంది గల్లంతై ఉండొచ్చని స్థానికుల సమాచారం ఆధారంగా అధికారులు ప్రకటన చేశారు. అయితే.. కేవలం కేరళ నుంచి 28 మందితో వచ్చిన ఓ బృందం ఆచూకీ లేకుండా పోవడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు వాతావరణ శాఖ మళ్లీ భారీవర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. పర్వత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్ ఎంపీలు ఇవాళ ప్రధాని మోదీని కలిసి సహాయక చర్యలపై విజ్ఞప్తి చేశారు. కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి పుష్పర్ ధామి ఉత్తర కాశీలో ఏరియల్ సర్వే నిర్వహించి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. 🚨 "𝗦𝘄𝗶𝗳𝘁 𝘁𝗼 𝗥𝗲𝘀𝗽𝗼𝗻𝗱, 𝗖𝗼𝗺𝗺𝗶𝘁𝘁𝗲𝗱 𝘁𝗼 𝗣𝗿𝗼𝘁𝗲𝗰𝘁." 🪖📍Kheer Gad, Dharali Village | Uttarkashi | 1345 Hrs, 05 Aug 2025A massive mudslide struck #Dharali village in the #KheerGad area near Harsil, triggering sudden flow of debris and water through the… pic.twitter.com/FwPPMrIpqu— SuryaCommand_IA (@suryacommand) August 5, 2025 -
వరదకు కొట్టుకపోయిన ఊరు
-
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్
-
గ్రామంపై విరిగిపడిన కొండచరియలు.. 60మంది గల్లంతు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వరద బీభత్స సృష్టించింది. గంగోత్రీలోని ధరావలి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాయి. ఇళ్లన్ని ధ్వంసమయ్యాయి. శిధిలాల కింద పలువురు గల్లంతయ్యారు. ఇప్పటి వరకూ 60మంది జాడ తెలియరాలేదు. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా పలువురు గ్రామస్థులు కొండచరియల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగగా.. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, క్లౌడ్ బరస్ట్లపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లోని హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని ధరావలిలో భారీ ఎత్తున క్లౌబ్ బరస్ట్ జరిగిందని తెలిపారు.BREAKING: Dehradun: Massive flood in the Khir Ganga river in Uttarkashi. Water carrying silt cascades into Tharali village. Many feared trapped. Disaster teams rushed. pic.twitter.com/wtXVrqYBzL— Rahul Shivshankar (@RShivshankar) August 5, 2025క్లౌడ్ బరస్ట్ కారణంగా హర్సిల్‌లోని ఖీర్ఘడ్లో నీటి స్థాయిలు భారీగా పెరుగుతున్నట్లు ఉత్తరకాశీ పోలీసులు వెల్లడించారు. క్లౌడ్ బరస్ట్‌తో భారీగా నష్టపోయిన ధరాలీకి పోలీసులు,ఎస్డీఆర్ఎఫ్,విపత్తు బృందాలు మొహరించాయి. నివాస ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. వరదలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. పౌరులకు సహాయం చేయడానికి సహాయక బృందాలు బాధిత గ్రామానికి వెళ్తున్నాయని చెప్పారు. ఉత్తరకాశిలోని ధరావలిలో క్లౌడ్ బరస్ట్ గురించి నాకు సమాచారం అందింది. మేం ప్రజల్ని రక్షించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా అధికారులతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
హిమాచల్‌పై వరుణుడి పంజా.. 63 మరణాలు, 400 కోట్ల నష్టం
సిమ్లా: ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. కుండపోత వర్షంతో హిమాచల్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని బియాస్ నది సహా ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటికి 63 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై ఏడో తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.హిల్‌స్టేట్ హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు మండి జిల్లా తీవ్ర విధ్వంసానికి గురైంది. భారీ వర్షాలు, వరదలకు దాదాపు 400కుపైగా రోడ్లను అధికారులు మూసివేశారు. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 63కి పెరిగింది. మరో 40 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.VIDEO | Himachal Pradesh: Flash flood triggered by cloudburst causes severe damage in Thunag tehsil of Mandi district. Several houses damaged.#HimachalCloudburst #HimachalNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/XjM8R2jJHA— Press Trust of India (@PTI_News) July 4, 2025 शिमला : ढली के लिंडीधार में भारी लैंडस्लाइड - फोरलेन का डंगा गिरा - सैंकड़ों सेब के पेड़ दबे।घर छोड़ भागे लोग, 5 घरों को खतरा।#Shimla #Dhali #Landslide #HimachalNews #DDNewsHimachal pic.twitter.com/dKaekscobU— DD News Himachal (@DDNewsHimachal) July 3, 2025మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. జూలై 5న సిమ్లా, సోలన్, సిర్మౌర్, జూలై 6న ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే వర్షప్రభావం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితం ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.Whoahh, that was close!!A massive landslide hit the Shillai area of Sirmaur district, Himachal Pradesh, India today, along National Highway 707 👀pic.twitter.com/nVvfZWty90— Volcaholic 🌋 (@volcaholic1) May 30, 2025Big houses, rocks all got washed away in the flood but "Pandav Shila" in Himachal Pradesh did not move from the place where it was, this is no less than a miracle. pic.twitter.com/pnhWE9Rp3I— Frontalforce 🇮🇳 (@FrontalForce) July 4, 2025🚨HEAVY RAINS TRIGGER CLOUD BURSTS AND FLOODING IN HIMACHAL PRADESH, INDIA.Cloud bursts in Karsog area, Mandi, cause 1 death and 7 missing.Vehicles swept away and 16 MW power project destroyed.Beas River floods intensifySchools and colleges closed; statewide alert active pic.twitter.com/ucXSbYhviD— Weather Monitor (@WeatherMonitors) July 1, 2025 -
జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. ముగ్గురు మృతి
-
కామన్‌గా మారిపోయిన క్లౌడ్ బరస్ట్!! ఎంత ఘోరంగా అంటే.. (ఫొటోలు)
-
కేదార్నాథ్ విపత్తు: 18 రోజులు దాటినా లభించని 17 మంది ఆచూకీ
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో భారీ వర్షాల కారణంగా ఘోర విపత్తు సంభవించింది. ఈ ఘటన జరిగి 18 రోజులు దాటినా ఈ విపత్తులో చిక్కుకున్న 17 మంది జాడ ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్‌కు ఇప్పటి వరకూ ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఆరు మృతదేహాలను గుర్తించారు. కాగా ఈ విపత్తులో 23 మంది గల్లంతైనట్లు సోన్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.నేటికీ ఆచూకీ తెలియని 17 మందిలో యాత్రికులతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. వీరి ఆచూకీ కోసం గౌరీకుండ్-కేదార్నాథ్ కాలినడక మార్గంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూలై 31న రాత్రి భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో కేదార్నాథ్ నడక మార్గం రాళ్లతో మూసుకుపోయింది. ఈ సమయంలో చాలా మంది ఆ రహదారిలో చిక్కుకుపోయారు. నాటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా లించోలిలో శిథిలాలు, రాళ్ల కింద ముగ్గురు మృతదేహాలను కనుగొన్నారు. వీరిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నివాసితులు సుమిత్ శుక్లా (21), చిరాగ్ గుప్తా (20), న్యూ మాండ్లోయ్ నివాసి నిఖిల్ సింగ్ (20)గా గుర్తించారు. ఈ మృతదేహాలకు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. -
ఇటానగర్‌లో క్లౌడ్‌బర్స్ట్.. విరిగిపడ్డ కొండచరియలు
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో ఆదివారం(జూన్23) కుండపోత వర్షం కురిసింది. దీంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. గత వారం రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు పడుతున్నప్పటికీ ఆదివారం తక్కువ సమయంలో కురిసిన ఎక్కువ వర్షం(క్లౌడ్ బర్స్ట్) ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారి 415పై కూడా వరద ప్రభావం పడింది. దీంతో ఇటానగర్లోకి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. చాలా వాహనాలు రోడ్డుపై ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. కొండ చరియలు విరిగిపడే ఛాన్సున్న ప్రాంతాలకు, నదుల వద్దకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. -
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. ఏమిటీ క్లౌడ్ బరస్ట్?
సిమ్లా, డెహ్రాడూన్: క్లౌడ్ బరస్ట్‌లు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టిస్తున్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో నదులు పొంగిపొరలుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. మండి, కంగ్రా, చంబా జిల్లాల్లోని ముంచెత్తిన వరదల్లో 22 మంది మరణించారు. మరో అయిదుగురు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు శనివారం ఉదయం పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లను కలుపుతూ పఠాన్‌కోటలోని చక్కి నది మీద నిర్మించిన 800 మీటర్ల పొడవైన రైల్వే వంతెన కుప్పకూలిపోయింది. జోగిందర్ నగర్, పఠాన్‌కోట్ మధ్య ఈ వంతెనను బ్రిటిష్ హయాంలో 1928లో నిర్మించారు. incident of flood (Beas River) found at Village Kheri , Sub division Sujanpur, District Hamirpur. 10-12 houses on the verge of drowning 15-20 people are trapped inside them, including some small children. Till now no damage to life. Rescue teams are on the spot @DcHamirpur pic.twitter.com/dq3dpZxM6k — HIMACHAL PRADESH STATE DISASTER RESPONSE FORCE (@HP_SDRF) August 20, 2022 వంతెన బీటలు వారడంతో గత నెల రోజులుగా ఈ వంతెనపై రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. చంబా జిల్లాలో కొండచరియలు ఇళ్ల మీద విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మండిలో వరదలకు ఒకే కుటుంబంలోని అయిదుగురు కొట్టుకుపోయారు. హమీర్పూర్ జిల్లాను కూడా వరదలు ముంచెత్తాయి. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు అందిస్తున్నట్టుగా తెలిపారు. ఉత్తరాఖండ్‌లో వరుస క్లౌడ్ బరస్ట్‌లు ఉత్తరాఖండ్‌లో వరుస క్లౌడ్ బరస్ట్‌లతో నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వంతెనలు వరద ఉధృతికి కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలకు తెహ్రి జిల్లాలో ఇళ్లు కూలిపోయి నలుగురు మరణించగా, మరో 10 మంది గల్లంతయ్యారు. రిషికేష్ గంగా నది ఉప్పొంగుతోంది. టాన్స్ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో తపకేశ్వర్ గుహలను వరద నీరు ముంచెత్తింది. రాయపూర్‌లోని సార్కేత్ గ్రామంలో క్లౌడ్ బరస్ట్‌తో థానో ప్రాంతంలోని సాంగ్ నదిపై వంతెన కూలిపోయింది. ముస్సోరి సమీపంలో పర్యాటకప్రాంతమైన కెంప్టీ జలపాతం ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరద ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. అవసరమైతే ఆర్మీ సాయం కోరతామని వెల్లడించారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చదవండి: లిక్కర్ కుంభకోణంలో సూత్రధారి కేజ్రీవాల్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ జార్ఖండ్, ఒడిశాలో భారీ వానలు అటు జార్ఖండ్, ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జార్ఖండ్‌లో భారీ ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు మహానది ఉప్పొంది ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 2 లక్షల మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మయూర్ భంజ్, కియోంజార్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి గోడలు కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏమిటీ క్లౌడ్‌బరస్ట్ అతి తక్కువ వ్యవధిలో, పరిమిత ప్రాంతంలో కుంభవృష్టి కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అంటారు. భారత వాతారణ శాఖ ప్రకారం 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక గంటలో 10 సెంటీమీటర్లకి మించి వర్షం కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారు. మైదాన ప్రాంతాల కంటే కొండ ప్రాంతాల్లోనే క్లౌడ్ బరస్ట్‌లు ఎక్కువగా సంభవిస్తాయి. పర్వత ప్రాంతాల్లో మేఘాలు అధిక తేమను కలిగి సంతృప్త స్థాయికి చేరుకుంటాయి. కానీ వాతావరణం వేడిగా ఉండడం వల్ల వర్షించడం సాధ్యమవదు. ఫలితంగా కొంత సమయం గడిచాక మేఘాల్లో సాంద్రత ఎక్కువైపోయి ఒక్కసారిగా కుండపోతలా నీటిధార కురుస్తుంది. వాన చినుకుల పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. ఒక్కోసారి ఉరుములు, మెరుపులు, పిడుగులతో కుంభవృష్టి కురుస్తుంది. వీటి గురించి ముందుగా అంచనా వేయడం కష్టం. కేవలం డాప్లర్ రాడార్ల ద్వారా వీటిని గుర్తించే అవకాశం కొంతవరకు ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఈ రాడార్లు 34 ఉన్నాయి. అయినప్పటికీ కచ్చితంగా ఫలానా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరుగుతుందని ముందస్తుగా అంచనా వేయడం దాదాపుగా అసాధ్యమని భారత వాతావరణ శాఖ చెబుతోంది. -
హిమాచల్ ప్రదేశ్‌లో వరదల బీభత్సం.. 22 మంది మృతి
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడటం ప్రమాదాల తీవ్రతను మరింత పెంచుతోంది. గత 24 గంటల్లో ఒకే కుటుంబంలో ఎనిమిది మందితో సహా దాదాపు 22 మంది మరణించారు, 9 మంది గాయపడ్డారు. మరో ఆరుగురు కనిపించకుండా పోయారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ఆ రోడ్డులో కొండ చరియలు విరిగిపడడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిలిచిపోయింది. ప్రస్తుతం రహదారిని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రా, చంబా, బిలాస్పూర్, సిర్మౌర్, మండి జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండి జిల్లాలోని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఆగస్టు 25 వరకు హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ సుధేష్ కుమార్ వెల్లడించారు. WATCH: 2 killed, at least 15 missing after heavy rain #triggers #cloudburst, flash floods, landslides in several parts of Mandi district in #HimachalPradesh#Himachal #mandi #Flood #heavyrain pic.twitter.com/C6JpfVo8mp — BNN India (@BNNIN) August 20, 2022 మండి వద్ద మనాలి-చండీగఢ్ జాతీయ రహదారి, షోఘిలోని సిమ్లా-చండీగత్ హైవే సహా 743 రోడ్లు ట్రాఫిక్ కారణంగా బ్లాక్ చేశారు. ఒక్క మండిలోనే భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించగా, ఐదుగురు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి బ్రిడ్జ్ శనివారం ఉదయం కూలిపోయిన విషయం తెలిసిందే. Dharampur @ Beas River Many peoples missing in Baggi of Mandi District 🙏🏻 Damaging Rains over parts of #Uttarakhand & #HimachalPradesh pic.twitter.com/UaAyr3a0Jx — Weatherman Shubham (@shubhamtorres09) August 20, 2022 -
అమాంతం కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి.. వందల గ్రామాలకు తెగిన సంబంధాలు
సిమ్లా: కుంభవృష్టి ప్రభావంతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వణికిపోతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా.. ఇరు రాష్ట్రాల్లోనూ భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొనవచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికలతో భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. కాంగ్రా జిల్లా చక్కీ బ్రిడ్జి ఆకస్మిక వరదలకు కుప్పకూలింది. పిల్లర్లు డ్యామేజ్ కావడంతో వదర ఉదృతిని తట్టుకోలేక బ్రిడ్జి అంతా చూస్తుండగానే కూలిపోయి.. చక్కీ నదిలో కొట్టుకుపోయింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు జిల్లా అయి కంగ్రాలో చక్కీ నదిపై ఉన్న 800 మీటర్ల రైల్వే వంతెన శనివారం కూలిపోయింది. దీంతో వంతెన కొత్త పిల్లర్‌ను నిర్మించేంత వరకు పఠాన్‌కోట్, జోగిందర్ నగర్ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. Chakki railway bridge near Kandwal in Nurpur has collapsed due to heavy rain.#TTRHimachal #Kangra #railways @rpfnrumb @drm_fzr @drm_umb @HP_SDRF @SpKangra @DdmaKangra pic.twitter.com/y3lPvcAR8J — HP Traffic, Tourist & Railways Police (@TTRHimachal) August 20, 2022 ఈ బ్రిడ్జిని 1928లో బ్రిటిషర్లు కట్టించారు. రోడ్లు, బస్సు మార్గాలు అందుబాటులో లేకపోవడంతో.. పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న వందలాది గ్రామాలకు ఈ రైలు మార్గం ఆధారం. అయితే.. నదీ గర్భంలో అక్రమ మైనింగ్‌తో 90 ఏళ్ల నాటి వంతెన బలహీనపడింది. దీనిపై పలు ఫిర్యాదులు సైతం అధికారులకు అందాయి. గతంలో ఓ పిల్లర్‌కు పగుళ్లు రావడంతో రైలు సేవలను నిలిపివేయగా.. ఇప్పుడు ఏకంగా స్థంభమే కొట్టుకుపోయింది. మరోవైపు ధర్మశాలలోనూ కొండ చరియలు విరిగిపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా.. మండిలో మరో పదమూడు మంది కూడా మరణించి ఉంటారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి జై రామ్ థాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: పార్టీ చేసుకున్న ప్రధాని... స్టెప్పులతో హల్చల్: వైరల్ -
పచ్చని పంటపై కమ్ముకున్న కారుమేఘం
ఒట్టావా: ఆవాల పంటపై కుండపోత కురిపిస్తుందా అన్నంతగా కమ్ముకుంటున్న కారు మబ్బులివి. కెనడాలోని ఆల్బెర్టా రాష్ట్రంలోని క్రిమోనా గ్రామంలో శనివారం తీసిన ఫొటో ఇది. ఇదీ చదవండి: వరదలో మునిగిపోయిన ఇల్లు.. ప్రాణంగా ప్రేమించే శునకం కోసం బాలిక రిస్క్.. గంటలపాటు రూఫ్ పైనే.. -
క్లౌడ్ బరస్ట్, పోలవరం ఎత్తు టీఆర్ఎస్కు కొత్త ఆయుధాలా!
ఎన్నికలు రావడానికి ముందుగా తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒక సెంటిమెంట్ కలిసిరావాలని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్లుగా ఉంది. ఇటీవలి భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాని, మరికొందరు టీఆర్ఎస్ నేతలు కాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయాన్ని అటువైపు మళ్లించే యత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. క్లౌడ్ బరస్ట్, పోలవరం వల్ల భద్రాచలం మునిగింది తదితర వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి.పోలవరం ఇష్యూలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా స్పందించడంతో అది పెద్ద చర్చగా మారింది. మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న టీఆర్ఎస్ నేతలు డిమాండ్ కు కేంద్రం నో చెప్పింది.. వీటి గురించి చర్చించుకుంటే ఆసక్తికర విశ్లేషణలు వస్తాయి. క్లౌడ్ బరస్ట్ అంటే కుంభ వృష్టి.ఈ వృష్ఠి ఆకస్మిక వరదలు రావడానికి ఇతరదేశాలు ఏమైనా కుట్రలు చేస్తున్నాయా అన్న అనుమానాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. అది తన అభిప్రాయంగా నేరుగా చెప్పకపోయినా, కొందరు అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన నమ్మితేనే చెబుతారని అంతా అనుకుంటాం. కేసీఆర్ ఏమీ సాధారణ వ్యక్తికాదు. పైగా ఆయనకు అపారమైన పుస్తకాల నాలెడ్జ్ ఉంది. అయినా ఆయన ఇలా ఎందుకు అన్నారబ్బా అని ఎవరైనా ఆలోచిస్తే, ఇందులో రాజకీయం కూడా మిళితమై ఉందా అన్న సందేహం కలుగుతుంది. కుంభ వృష్టి , ఆకస్మిక వరదల వంటివి మనదేశానికే పరిమితం కాదు. చైనా, అమెరికా , ఇండోనేషియా తదితర దేశాలు కూడా ఇలాంటి వాటిని ఎదుర్కుంటున్నాయి. చైనా, అమెరికాలకు వ్యతిరేకంగా ఎవరు కుట్ర చేయగలిగే పరిస్థితి ఉంటుంది? ఈ మధ్యకాలంలో చైనాలో వచ్చిన వరదలతో జనం తీవ్ర కష్టనష్టాలపాలయ్యారు. అనేక మంది మరణించారు. అనేక ఇళ్లు కూలిపోయాయి. అయినా చైనా ఇలాంటి ఆరోపణ చేసినట్లు లేదు. అమెరికాలో కొన్ని సార్లు వరదలు వచ్చినప్పుడు రోజుల తరబడి ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు. మంచు తుపానుల గురించి చెప్పనవసరం లేదు. కొన్ని సార్లు రోజుల తరబడి ట్రాఫిక్ జామ్ లు అవుతుంటాయి.వేసవికాలంలో వైల్డ్ ఫైర్ అయితే వేలాది ఎకరాలలోని అడవులను దహించి వేస్తుంటుంది. ఆ ప్రాంతాలలో ఉన్న భవంతులు కూడా ఆగ్నికీలలకు ఆహుతి అవుతుంటాయి. తాజాగా బ్రిటన్ , ఇటలీ, స్పెయిన్, జర్మని ప్రాన్స్ వంటి దేశాలు విపరీతమైన ఎండలతో అల్లాడుతున్నాయి. ప్రజలు వాటిని తట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వందలాది మంది వడగాడ్పులకు మరణిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అమెరికాలో టోర్నెడోలు అంటూ ఒక్కసారిగా సుడిగాలి సంభవించి ఒక ప్రాంతంలోని ఇళ్లన్నిటిని పునాదులతో సహా పెకలించి వేస్తుంటుంది. ఇదంతా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు వల్ల సంభవించేవి. క్లైమేట్ చేంజ్ పై ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు.దానివల్ల వచ్చే విపరిణామాలను ఎప్పటికప్పుడు వివరిస్తుంటారు. ఇలా ఎన్నో అనుభవాలు ప్రపంచ వ్యాప్తంగా ఉంటే భారత్ లో ఆకస్మిక వరదలకు , కుట్రలకు ఏమైనా సంబంధం ఉందా అంటే అవునని చెప్పడం కష్టమే. కొందరు నిపుణులు కాని, గవర్నర్ తమిళసై కాని కేసీఆర్ వాదనను తోసిపుచ్చారు.లడక్ ,ఉత్తరాఖండ్ వంటి చోట్ల ఇవి సంభవించిన్పుడు ఎవరూ ఈ సందేహం వ్యక్తం చేయలేదు. కొద్ది మంది టీఆర్ఎస్ నేతలు విదేశీ కుట్ర ధీరిని బలపరిచినా, అది వారి నాయకుడిని సమర్ధించాలి కనుక మాట్లాడారేమో అనిపిస్తుంది. విపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు దీనిపై కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించాయి. వరదల నియంత్రణ, సహాయ చర్యలలో వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి కేసీఆర్ ఈ వ్యూహం అమలు చేశారని వారి ఆరోపణ. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ లు మునిగిపోవడం, ఆ ప్రాజెక్టు బాక్ వాటర్ వల్ల మంచిర్యాలతో సహా పలు పట్టణాలు, గ్రామాలు జలమయం అవడం వంటి వాటి గురించి పెద్దగా చర్చ జరగకుండా చూడడం టీఆర్ఎస్ లక్ష్యమని వారు అంటున్నారు. ఈ ఆరోపణలలో ఎంత నిజం ఉందో కాని, టిఆర్ ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యకు ఎన్నడూ రానంతగా ఊహించని స్థాయిలో వరదలు రావడమేనని చెబుతున్నారు.ఇతర చోట్ల పంప్ హౌస్ లు మునిగిన ఉదంతాలను ఏకరువు పెడుతున్నారు. ఇది కూడా నిజమే కావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వేగం, పూర్తి అయిన తీరు చూసి పలువురు కేసీఆర్ ను మెచ్చుకున్నారు. ఎనభై వేల కోట్లను వ్యయం చేసి ఆ స్థాయి నిర్మాణాన్ని ఒక రాష్ట్రం చేయడం అరుదైన విషయమే. అయితే దీనివల్ల కలిగిన ప్రయోజనాలపై బిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బాక్ వాటర్ ప్రభావం తదితర ముఖ్యమైన వాటిపై సరిగా అధ్యయనం జరగలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపైనే అదికంగా చర్చ జరిగింది. ఇంతవరకు ఒక రకం అయితే ఆయనకు మద్దతుగా కేంద్రం కాని, ఇతర రాజకీయ పక్షాలు కాని మాట్లాడకపోవడంతో కేసీఆర్ వి రాజకీయ వ్యాఖ్యలే అన్న భావన ఏర్పడడానికి అవకాశం వచ్చింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధ్యం కాని కేంద్రం స్పష్టం చేయడం, దానికి పెట్టుబడి క్లియరెన్స్ లేదని చెప్పడం మరో సారి కేంద్ర, రాష్ట్రాల మధ్య వాదోపవాదాలకు అవకాశం వచ్చింది. దీనిని టీఆర్ఎస్ సెంటిమెంట్ గా వాడుకునే అవకాశం ఉంటుంది. ముందుగా పెట్టుబడి వ్యయ అంచనాపై కేంద్రం నుంచి ఆమోదం పొంది ఉంటే బీజేపీ ఆత్మరక్షణలో పడేది.కాని అది జరగకపోవడంతో టీఆర్ఎస్ పై బీజేపీ దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇక పోలవరం ఎత్తు , భద్రాచలం వద్ద ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న మంత్రి అజయ్ డిమాండ్ కొత్తదేమీ కాదు. గతంలో కేంద్రం ఈ మండలాలలోని వివిధ గ్రామాలను ఏపీలో విలీనం చేసినప్పుడే కొంత వ్యతిరేకత వ్యక్తం అయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్ కు పిలుపు ఇచ్చి అప్పట్లో నిరసన తెలిపింది. ఆ తర్వాత అది పూర్వపక్షం అయింది. ఖమ్మం ,భద్రాచలం వారికి దగ్గరగా ఉండడం తో ఆ గ్రామాలవారికి తెలంగాణలోనే ఉండాలని అనుకోవచ్చు. అయితే ఒకప్పుడు అవి ఏపీలోనే గ్రామాలే. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం 1952, 1955 ఎన్నికలలో ఆంద్ర రాష్ట్రంలో బాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉండేది. ఉమ్మడి రాష్ట్రం తర్వాత అది ఖమ్మం జిల్లాలో భాగమైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఈ ఏడు మండలాలలోని వివిధ గ్రామాలు నీట మునుగుతాయని అంచనా వేసి భూములకు పరిహారం ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం ముందుకు కూడా వెళ్లింది. అయితే పెరిగిన భూముల ధరల నేపద్యంలో వారికి అధిక పరిహారం ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సుమారు ఏభై వేల కోట్ల రూపాయల ప్యాకేజీని నిర్వాసితులకు అందించాలని విజ్ఞప్తి చేసింది. అది ఇంకా ఖరారు కాలేదు. ఈ లోగా పోలవరం ఎత్తు తగ్గించకపోతే భద్రాచలం మునిగిపోతుందని మంత్రితో పాటు నీటిపారుదల సంస్థ చైర్మన్ ప్రకాష్ తదితరులు వాదన చేశారు.నిజానికి ;పోలవరం ప్రాజెక్టు లేనప్పుడు కూడా భద్రాచలం, పరిసర మండలాలు నీట మునిగాయి. అన్ని విషయాలను కేంద్ర సంస్థలు పరిశీలించిన తర్వాతే ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చాయి. ఈ విషయం అందరికి తెలుసు. అయినా సెంటిమెంట్ రీత్యా తెలంగాణ రాజకీయాలకు కొంత ఉపయోగపడుతుందన్న భావనో లేక నిజంగానే ఆ ముంపు మండలాల ప్రజల కోరికను అజయ్ బయటపెట్టారో కాని, అది చర్చనీయాంశంగా మారింది. అయినా ఈ దశలో ఎత్తు తగ్గించడం అన్నది సాధ్యపడకపోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా సమస్య అధికం అవుతుందని అనుకుంటే నీటి నిల్వను కొంత తక్కువ మట్టంలో ఉంచవచ్చు. అది రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో చేసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టును తొలుత 36లక్షల క్యూసెక్కుల సామర్ధ్యంతో ప్రతిపాదించినా, ఏదైనా ప్రమాదం జరిగితే రాజమండ్రితో సహా పలు ప్రాంతాలకు నష్టం వస్తుందనే దానిని ఏభై లక్షల క్యూసెక్యులకు పెంచారు. అయినా ప్రకాష్ రాజమండ్రి కూడా ఈ ప్రాజెక్టు వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పడం అంత సహేతుకంగా అనిపించదు. రాజమండ్రితో సహా ఉభయగోదావరి జిల్లాల ప్రజలు, మొత్తం ఏపీ ప్రజలు ఈ ప్రాజెక్టు తమ కలగా భావించారన్న సంగతి గుర్తించాలి. ఏది ఏమైనా సున్నితమైన నీటిపారుదల ప్రాజెక్టుల విషయాలలో రెండు రాష్ట్రాల నేతలు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు సాగుతున్నాయి. అవి చాలవన్నట్లు కొత్త పంచాయతీలు పెట్టుకోకుండా ఉంటే బెటర్ .కాని ఎన్నికల రాజకీయాలలో అది ఎంతవరకు సాధ్యం అన్నది చెప్పడం కష్టమే. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
క్లౌడ్ బరస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆసక్తికర వ్యాఖ్యలు
-
క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
యానాం: క్లౌడ్ బరస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు క్లౌస్ బరస్ట్ వల్ల కాదని ఆమె అన్నారు. ఇవి ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని.. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ వరదలు వచ్చాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. యానాంలో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అలా.. గవర్నర్ ఇలా.. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. క్లౌడ్ బరస్ట్ వల్లే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు సంభవించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. విదేశాలే ఈ కుట్ర చేసి ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు గవర్నర్ తమిళిసై మాట్లాడటం గమనార్హం. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 51.8అడుగులకు చేరింది. ఎగువ నుంచి 13 లక్షల 50వేలు క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వస్తోంది. భద్రాచలం టౌన్‌లోని ముంపునకు గురైన కాలనీలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయి. ఇప్పటికీ రామాలయం పురవీధులు చెరువులను తలపిస్తున్నాయి. 53 అడుగుల లోపు వచ్చిన మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదిప్ దురిశెట్టి తెలిపారు. చదవండి: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు -
కుట్ర సమాచారం సరే.. వరద నష్టం గురించి అందలేదా?
సాక్షి, హైదరాబాద్: ‘విదేశీ కుట్రల మీద సమాచారం ఉన్న దొరకు.. వరదల నష్టం మీద సమాచారం అందలేదా’ అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల వానల తర్వాత దొరకు ఇవ్వాళ తీరిక దొరికిందా అని ఎద్దేవా చేశారు. వరద బాధిత ప్రజలను చూసేందుకు దొర ఇప్పటికైనా గడి నుంచి బయట అడుగు పెట్టారని, ఏరియల్ సర్వే చేసి, రాష్ట్రంపై విదేశీ కుట్ర జరుగుతోందని సెలవిచ్చారని విమర్శించారు. వానలు, వరదలకు క్లౌడ్ బస్టర్ కారణమని కాకమ్మ కథలు చెప్పడం, బోడి గుండుకు మోకాలుకు ముడేసినట్లుందని వ్యాఖ్యానించారు. ‘లక్షల్లో ఆస్తి నష్టపోయి, గూడు కోల్పోయి బాధితులకు ప్రకటించిన సాయమన్నా సరిగ్గా అందుతుందా లేదా జీహెచ్ఎంసీలో వరద సాయమని గులాబీ లీడర్లు స్వాహా చేసినట్టు చేస్తారా’ అని సందేహం వ్యక్తం చేశారు. చదవండి: (CM KCR: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు) -
క్షేమంగానే ఉన్నా.. కంగారుపడకండి
సాక్షి,తెర్లాం(విజయనగర): అమర్‌నాథ్‌లోని శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన తను క్షేమంగానే ఉన్నానని, భయపడవద్దంటూ తెర్లాం గ్రామానికి చెందిన కోల శ్రీనివాసరావు మంగళవారం ఫోన్లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కొద్దిరోజుల కిందట ఆయన అమర్నాథ్ యాత్రకు వెళ్లాడు. అక్కడ కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లి సుమారు 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ వార్తలు టీవీల్లో ప్రచారం కావడంతో శ్రీనివాసరావు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అమర్నాథ్లో క్షేమంగానే ఉన్నట్టు తన ఫొటోను వాట్సప్‌లో పంపించడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటివరకు 9 సార్లు అమర్నాథ్ యాత్రకు వెళ్లి మహా శివలింగాన్ని దర్శించుకున్నట్టు ఆయన ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. -
అమర్నాథ్ యాత్ర: కాపాడాలని రాయగడ యువకుల వీడియో సందేశం
కొరాపుట్(భువనేశ్వర్): పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఒడిశా వాసులు అనుకోని ఆపదలో చిక్కుకున్నారు. ఇందులో నవరంగ్‌పూర్ వాసులు క్షేమంగా భయటపడగా, రాయగడకు చెందిన యువకులు మాత్రం ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం అందించారు. నవరంగపూర్‌జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన పశుమర్తి నగేష్, శాంతి, వినయ్, వాసు, చిన్ను, సోహిణీ, హరి, బొద్దుపు సునీత యాత్రకు భయలుదేరి వెళ్లారు. వీరితో పాటు జయపురానికి చెందిన కోట కామేశ్వరరావు, చంద్ర దంపతులు, సాలూరులో పలివెల శ్రీను, జ్యోతి, పార్వతీపురానికి చెందిన నాగుల రేష్మ దంపతులు తోడయ్యారు. అంతా శుక్రవారం అమర్నాథ్లో విపత్తు జరిగే సమయానికి కొన్ని గంటల ముందు స్వామివారి దర్శనం చేసుకొని, తిరిగి శ్రీనగర్ చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వీరు అమర్నాథ్ గుహ వద్దనే ఉన్నారు. సాయంత్రం ఈ ఘటన జరిగింది. శ్రీనగర్ చేరే సమయంలో విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి టీవీల్లో దుర్ఘటన విషయం తెలుసుకున్న బంధుమిత్రులు ఆందోళనకు గురయ్యారు. జమ్మూ–కశ్మీర్లో బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ ఫోన్లు మాత్రమే పని చేస్తాయి. కేవలం స్థానికులకు మాత్రమే ప్రీ పెయిడ్ ఫోన్లు పనిచేస్తాయి. వెళ్లిన వారందరివీ ప్రీపెయిడ్ ఫోన్లు కావడంతో వీరి క్షేమ సమాచారం ఆలస్యమైంది. శ్రీనగర్‌లో ప్రతి హోటల్లో వైఫై సదుపాయం ఉంటుంది. దీంతో వీరందరి ఫొటోలు వాట్సాప్‌లో పంపిచడంతో అంతా క్షేమంగా ఉన్నట్లు తెలియజేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే గండం నుంచి భయట పడ్డామని యాత్రికులు తమ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. చిక్కుకున్న రాయగడ వాసులు.. రాయగడ: ‘అమర్నాథ్ యాత్రకు వెళ్లాం. అనుకోని విధంగా అంతా ప్రమాదంలో చిక్కుకున్నాం. మమ్మల్ని కాపాడండి’ అని రాయగడకు చెందిన యువకులు వీడియో సందేశం ద్వారా ప్రాథేయపడ్డారు. పట్టణంలోని కాళీపూజ జంక్షన్‌కు చెందిన బసంతకుమార్ సేనాపతి, సౌమ్యరంజన్ పాత్రొ, కొనతాం రవికుమార్, టుకున ప్రధాన్, నిహార్‌రంజన్ పాత్రొ 10రోజుల క్రితం అమర్నాథ్ యాత్రకు వెళ్లాం. వీరంతా తమకు సంబంధించిన సామగ్రిని జమ్మూలో విడిచి, అమర్నాథ్కు పయనమయ్యారు. యాత్రలో భాగంగా మంచులింగాన్ని శుక్రవారం ఉదయం దర్శించుకుని, తిరిగి వస్తున్న సమయంలో వంశతరణి నదీ వర్షబీభత్సానికి వారు నివసించేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లు కొట్టుకుపోయాయి. దీంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బాతల్ నుంచి నడక ప్రయాణం కొనసాగించామని వీడియో ద్వారా రాయగడలో ఉన్న తమ మిత్రులకు తెలియజేశారు. ప్రస్తుతం తాము ఐదుగురం మంచుకొండలపై ప్రయాణం చేస్తున్నామని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంతో ఉన్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. జమ్మూ వరకు తమను చేర్చేవిధంగా సహకరించాలని వారంతా ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం స్పందించి తమ వారిని కాపాడాలని బాధితుల కుటుంబీకులు కోరుతున్నారు. చదవండి: కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత గుడ్‌బై! బీజేపీ గూటికి కుల్దీప్ బిష్ణోయ్! -
అమర్నాథ్ యాత్రలో ఆకస్మిక వరదలు.. యాత్రికుల గల్లంతు!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అమర్నాథ్ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మిక వరద పోటెత్తింది. గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. సుమారు 12 వేల మంది భక్తులు వరదలో చిక్కుకుపోయారు. వరద ఉధృతికి పలువురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య భారీగా పెరగొచ్చని భావిస్తున్నారు. సాయంత్రం 5.30గం. నుంచి కుంభవృష్టి మొదలైంది. భోలేనాథ్ గుహ సమీపంలోనే మొదలైంది కుంభవృష్టి. ఆకస్మిక వరద ఉదృతికి యాత్రికుల టెంట్లు మొత్తం కొట్టుకుని పోయాయి. పలువురు వరదల్లో కొట్టుకుపోగా.. ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. అయితే చాలా మంది కనిపించకుండా పోవడంతో వరదలో కొట్టుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రాణ నష్టం వివరాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విపత్తు నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక వాయిదా వేశారు. ఆకాశం బద్ధలైనట్లుగా.. 2 కిలోమీటర్ల మేర వరద ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు పోటెత్తిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పెను విషాదంగా మారే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం తగ్గడంతో.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లైట్ల వెలుతురులో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. మరింత సమాచారం అందాల్సి ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Major cloud burst hit holy Amar nath cave,many tents washed Way, several people missing.. Cloudburst near Amarnath lower cave, #NDRF & SDRF teams start rescue operation.#Amarnath #AmarnathYatra #Jammu pic.twitter.com/03MhDB7MNY — Chaudhary Parvez (@ChaudharyParvez) July 8, 2022 #WATCH | J&K: Visuals from lower reaches of #Amarnath cave where a cloud burst was reported. Rescue operation underway by NDRF, SDRF & other agencies #cloudburst (Source: ITBP) pic.twitter.com/LEfOpOpxZO — NewsMobile (@NewsMobileIndia) July 8, 2022 J&K | #Exclusive visuals of flash floods at #Amarnath cave. pic.twitter.com/UM8KPgCTyg — News18.com (@news18dotcom) July 8, 2022 -
హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన యాత్రికులు?
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని మణికరణ్‌లో బుధవారం చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్‌బస్ట్ అయ్యింది. చోజ్ గ్రామంలో క్లౌడ్‌బస్ట్ కావడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి, దీంతో ఆ పరిసరాల్లోని గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ఘటనలో నలుగురు గల్లంతు అయినట్లు కులు ఎస్పీ గురుదేవ్ చాంద్ శర్మ తెలిపారు. పార్వతి నదిలో అకస్మాత్తుగా వరద పెరగడంతో సమీపంలో ఉన్న క్యాంపు సైట్లన్నీ ఆ ధాటికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొందరు యాత్రికులు కూడా కొట్టుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా దీనిపై స్పష్టత రావ్వాల్సి ఉంది. వరద ధాటికి పార్వతి నదిపై ఉన్న వంతెన కూడా ధ్వంసం అయ్యింది. నది సమీపంలో ఉన్న పలు షాపులు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన వారి కోసం అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. చదవండి: ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి.. ఒక్క లేఖతో కలకలం -
Telangana: కుండపోత వాన.. నగరం హైరానా
సాక్షి, హైదరాబాద్: ఏకధాటిగా మూడు గంటల పాటు కురిసిన వర్షానికి జంట నగరాలు చిగురుటాకులా వణికాయి. గురువారం రాత్రి కుండపోత వానకు రహదారులు గోదారిని తలపించాయి. పలు ప్రాంతాల్లో మోకాలి లోతున నీళ్లు ప్రవహించాయి. ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిపోయా యి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయా యి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాం తాలు నీటమునిగాయి. తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు రోజులు వర్షాలే.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఊహించని ఉపద్రవం.. ధర్మశాలలో ఆర్తనాదాలు
Dharamshala Cloud Burst కమ్ముకున్న నల్ల మేఘాలు, ఆ వెంటనే భారీ వర్షాలు.. హఠాత్తుగా ముంచుకొచ్చిన వరదలతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో. ముఖ్యంగా భాగ్సు నాగ్ ఏరియాలో వరదల్లో చిక్కుకుపోయిన వందల మంది సాయం కోసం కేకలు వేస్తున్నారు. సిమ్లా: కుంభవృష్టితో ధర్మశాల నీట మునిగింది. సోమవారం ఉదయం వరకు మూడు వేల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. కొండలపై నుంచి నీళ్లు.. భాగ్సునాగ్ నాలా ఉప్పొంగడంతో ధర్మశాలలోకి నీరు చొచ్చుకువచ్చింది. బురద నీటి ప్రవాహం, కార్లు కొట్టుకుపోవడం, కట్టలు తెగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Himachal Pradesh rains wreak havoc in #Dharamshala. pic.twitter.com/J60nmYNKJp — Ayushi Agarwal (@ayu_agarwal94) July 12, 2021 #HimachalPradesh Surge in water level of #Bhagsunag nullah in #Dharamshala following heavy rainfall. pic.twitter.com/S7f5dscHt8 — αѕℓαм кнαη ᴀɴᴛɪ ᴡᴀʀ ᴀᴄᴛɪᴠɪꜱᴛ. (@aslamkhanbombay) July 12, 2021 As rains lash down in #Dharamshala shanties of safai karamcharis get washed out by the river in spate. This community has been demanding proper & safe housing for the last 5 years. HP govt & admin is accountable. They should be given immediate relief by providing shelter & food. pic.twitter.com/MfcKRJRZU6 — Endangered Himalaya (@EndangeredHimal) July 12, 2021 ఆ వీడియోలు అక్కడి ప్రజల నిస్సహయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. తమను కాపాడాలంటూ చాలామంది సోషల్ మీడియాలోనే వీడియోలు పెడుతున్నారు. ఇక మాన్హి నది ఉప్పొంగడంతోనూ వరదలు మరింత పొటేత్తాయి. Orange Alert in #Dharamshala in #HimachalPradesh after a huge cloud burst pic.twitter.com/D52FHzN0Wk — Holidays Hunt (@HolidaysHunt) July 12, 2021 This is Gaggal Bridge.#Dharamshala#HimachalPradesh pic.twitter.com/F2jL1suMGd — Aryan Rajput🇮🇳 (@AryanRajput21) July 12, 2021 Hoping everyone is safe.🙏 #dharamshala pic.twitter.com/80qP8IXZ1y — Srejan Shankar (@SrejanShankar) July 12, 2021 లాక్డౌన్ తర్వాత ఆంక్షలు సడలించడం, పైగా వారాంతం కావడంతో చాలామంది టూరిస్టులు అక్కడికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఊడిపడ్డ వరదల్లో వాళ్లు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ వర్షం కురవడం, వరద ఉధృతి పెరుగుతుండడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని ధర్మశాల అధికారులు చెప్తున్నారు. Flash flood in Bhagsu Nag, #Dharamshala due to heavy rainfall. #HimachalPradesh (Video credit: SHO Mcleodganj Vipin Chaudhary) ANI pic.twitter.com/O3kbHOToji — Jagran English (@JagranEnglish) July 12, 2021 -
మళ్లీ ఉత్తరాఖండ్ లో ప్రకృతి విలయం
కుంభవృష్టి, వరదలతో చమోలి జిల్లా అస్తవ్యస్తం 30 మంది మృతి..రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నెలవైన ఉత్తరాఖండ్ మళ్లీ ప్రకృతి విలయంతో అల్లాడుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ బీభత్సం ధాటికి చమోలి జిల్లాలో కనీసం 30 మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి అంతకంతకు చేజారుతుండటంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెంటనే స్పందించి జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను రాష్ట్రానికి పంపింది. ఉరుముతున్న అలకనంద నది గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అలకనంద నది ప్రమాదస్థాయిని ధాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 54 మిల్లీమీటర్ల వర్షం కురువడంతో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. మృతుల కుటుంబాలకు 2లక్షల పరిహారం రాష్ట్రంలోని వరద బీభత్సంపై సమీక్ష నిర్వహించిన సీఎం హరీశ్ రావత్ ఈ విలయంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. పిత్తరగఢ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు సహాయక బృందాలను పంపినట్టు ఆయన తెలిపారు. మరోవైపు థాల్-మున్సియారి రోడ్డు వరదల ధాటికి తెగిపోవడంతో ఇరుపక్కల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వానలు, వరదల తాకిడికి పెద్ద ఎత్తున పంటపొలాలు ధ్వంసమయ్యాయి. వర్షం ఎంతకూ నిలువకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇంటికి పరిమితమయ్యారు. దీంతో చాలా జిల్లాల్లో ప్రజాజీవితం స్తంభించిపోయింది.