1/17
2/17
అతి తక్కువ సమయంలో.. భారీగా వర్షం పడటాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. మొన్నీమధ్య కేరళ వయనాడ్‌లో విలయానికి ఇది కారణం కాగా.. తాజాగా చెన్నై, ముంబైలలో అంతకు ముందు హైదరాబాద్‌లోనూ ఈ తరహా పరిస్థితులే కనిపించాయి.
3/17
మేఘాల విస్పోటం(Cloud Burst) వల్ల ఒక్కోసారి భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. ఒకప్పుడు వర్షాకాలంలో దీని పేరు అరుదుగా వినిపించేది. ఇప్పుడది సర్వసాధారణంగా మారింది.
4/17
భారత వాతావరణశాఖ గణాంకాల ప్రకారం, 1970 నుంచి 2016 వరకు 30 క్లౌడ్ బరస్ట్‌లు సంభవించాయి. అయితే.. గత పదేళ్లలో సంభవించిన క్లౌడ్ బరస్ట్‌లు మాత్రం భారీగానే నష్టాన్ని మిగిల్చాయి.
5/17
2024 ఆగష్టులో హిమాచల్ ప్రదేశ్‌లో మేఘాలు బద్ధలై మెరుపు వరదలు పోటెత్తాయి. ఈ వరదలతో 21 మంది చనిపోగా.. మరికొంత మంది ఆచూకీ లేకుండా పోయారు.
6/17
2023 జులైలో ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్‌తో 32 మంది మరణించారు. కానీ, చాలా మంది ఆచూకీ లేకుండా పోయారు.
7/17
2022లో అమర్‌నాథ్ గుహ వద్ద జరిగిన క్లౌడ్‌బరస్ట్ కారణంగా వరదలు సంభవించాయి. ఆ విషాద ఘటనలో 16 మంది మృత్యువాతపడటంతోపాటు పదుల సంఖ్యలో యాత్రికులు గాయాలపాలయ్యారు.
8/17
2021, జులై 28వ తేదీన జమ్ము కశ్మీర్ కిష్త్వర్ జిల్లా దాచన్ ఏరియాలో క్లౌడ్ బరస్ట్ సంభవించి 26 మందిని బలిగొంది. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
9/17
2010 లడఖ్ లేహ్‌లో క్లౌడ్ బరస్ట్‌తో సంభవించిన వరదలు.. పెను విషాదాన్నే మిగిల్చాయి. సుమారు 250 మంది చనిపోగా.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
10/17
2024 జులై 30వ తేదీన వయనాడ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగానే కొండచరియలు విరిగిపడి 231 మంది మరణించారు. 397 మంది గాయపడగా.. 118 మంది జాడ ఇంకా దొరకలేదు. ఈ ప్రకృతి విలయంతో ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. వయనాడ్ రీజియన్‌లో 48 గంటల్లోనే 572 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.
11/17
2002లో ఉత్తరాంచల్‌లో సంభవించిన కుంభవృష్టికి 28 మంది బలయ్యారు. ఆకస్మిక వరదల దాటికి పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
12/17
క్లౌడ్ బరస్ట్ ప్రకారం.. 20 నుంచి 30చ.కి.మీ పరిధిలో గంట గ్యాప్‌లో 10సెం.మీ (100మి.మీ) వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. ఆ వరదలతోనే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది.
13/17
స్వల్ప పరిధిలో రెండు గంటల వ్యవధిలోనే 5 సెం.మీ, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే కూడా దాన్ని మినీ క్లౌడ్‌బరస్ట్‌గా వ్యవహరిస్తారు. అన్ని క్లౌడ్‌బరస్ట్‌లు భారీ వర్షాలకు దారి తీస్తాయి. అలాగని స్వల్ప సమయంలో సంభవించే భారీ వర్షాలన్నింటినీ క్లౌడ్ బరస్ట్‌గా పరిగణించలేం. కొన్ని వాతావరణ పరిస్థితులు ఉంటేనే వాటిని క్లౌడ్ బరస్ట్‌గా పరిగణిస్తారు.
14/17
తాజాగా ఆగష్టు 20వ తేదీన హైదరాబాద్(తెలంగాణ)లో క్లౌడ్ బరస్ట్‌తో కుండపోత కురిసింది. అలాగే.. ముంబైలో సెప్టెంబర్ 25వ తేదీన కేవలం 5 గంటల్లో.. 200 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.
15/17
క్లౌడ్‌బరస్ట్ ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లోనే చోటుచేసుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ మార్పుల వల్ల ఇవి అకస్మాత్తుగా సంభవిస్తుంటాయి. కానీ, ఈమధ్య కాలంలో నగరాల్లోనూ క్లౌడ్‌బరస్ట్ వాన ముంచెత్తుతోంది.
16/17
రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇవి పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నట్లు అధిక తేమను కలిగి ఉంటాయి. అయితే, వర్షం పడే స్థితి ఏర్పడినప్పటికీ వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవించడం కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఘనీభవన ప్రక్రియ పలుసార్లు కొనసాగడంతో మేఘాలు సాంద్రత పెరిగి (బరువెక్కి) ఏదో ఒక సమయంలో ఒక్కసారిగా బద్ధలవుతాయి. దీంతో తక్కువ పరిధిలో, తక్కువ సమయంలోనే కుంభవృష్టి కురిసి భారీ వరదలకు కారణమవుతాయి.
17/17
భారీ వరదలకు కారణమయ్యే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని దస్తుగా అంచనా వేయడం కూడా ఓ సవాల్. కుంభవృష్టితో ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసే ఈ ప్రతికూల వాతావరణస్థితిని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమే. అయితే ఆ మధ్య క్లౌడ్ బరస్ట్ వెనక విదేశీ కుట్ర ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం కావడం గమనార్హం.