flash floods
-
ఏపీకి బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రానున్న ఆరు గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో నాలుగు రెడ్ అలర్ట్‌లను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రేపు మధ్యాహ్ననికి పుదుచ్చేరి వద్ద తుపాను తీరాన్ని తాకనుంది. రెండు రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాముందన్న వాతావరణ శాఖ.. దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, రాష్ట్రంలో మిగతా పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. -
స్పెయిన్‌లో వర్ష బీభత్సం
బార్సెలోనా: కుండపోత వర్షాలు, వడగళ్ల వానలతో స్పెయిన్ అతలాకుతలమవుతోంది. ఆకస్మిక వరదలు మంగళవారం దేశ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. కనీసం 95 మందికి పైగా బలైనట్టు సమాచారం. ఒక్క వాలెన్సియా ప్రాంతంలోనే బుధవారం ఒక్క రోజే మృతుల సంఖ్య 62కు చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే పలువురి మృతదేహాలు దొరికినట్టు తెలిపారు. ఎంతోమంది గల్లంతైనట్టు చెప్పారు. పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అక్కడ మరెంతో మంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల భారీగా పెరిగేలా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 320 మి.మీ. వర్షం పడింది! దాంతో మలగా నుంచి వాలెన్సియా దాకా ఎక్కడ చూసినా నదులుగా మారిన రోడ్లు, కూలిన గోడలు, కొట్టుకుపోతున్న కార్లతో ఎక్కడ చూసినా పరిస్థితి భీతావహంగా కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల గ్రౌండ్ ఫ్లోర్లన్నీ నీట మునిగిపోయాయి. ఇళ్లలోని సామాన్లన్నీ వరద పాలై కొట్టుకుపోతున్నాయి. స్పెయిన్ ఇంతటి వరదల బారిన పడటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. వరదలో చిక్కిన వారిని హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా కాపాడుతున్నారు. ప్రభావి త ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసర సైనిక బృందం నుంచి వెయ్యి మంది సిబ్బందిని నియోగించారు. ఎడతెరిపి లేని వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గురువారం తీవ్ర వర్షసూచనలున్నాయి.This is SPAIN, most of you have been here.Demand #ClimateAction & don’t put up with #FossilFuel company misinformation.Flash floods in Spain leave at least 51 people dead.https://t.co/UEO9y7iPl3 pic.twitter.com/WqBikKltbM— Dr Jill Belch (@JillBelch) October 30, 2024రవాణా కుదేలుఆకస్మిక వరదల దెబ్బకు ఏకంగా పలు నదులపై బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. దాంతో స్పెయిన్ అంతటా రవాణా వ్యవస్థ కుదేలైంది. రైలు, విమాన సేవలు ప్రభావితమయ్యాయి. మలగా సమీపంలో 300 మంది పై చిలుకు ప్రయాణికులతో వెళ్తున్న హైస్పీడ్ ట్రెయిన్ పట్టాలు తప్పింది. దాంతో వాలెన్సియా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లు, పార్కులను మూసేస్తున్నట్లు, క్రీడా కార్యక్రమాలను నిలిపేస్తున్నట్లు వాలెన్సియా సిటీ హాల్ తెలిపింది. అండలూసియాలో కొన్ని ప్రాంతాల్లో రెండో అతి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వరదల్లో చాలా మంది గల్లంతయ్యారని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ అన్నారు. బాధితులను ఉద్దేశించి ఆయన టీవీలో మాట్లాడారు.నిన్నటిదాకా కరువు...స్పెయిన్ కొన్నేళ్లుగా తీవ్ర కరువు పరిస్థితుల బారిన పడింది. తాజాగా గత సీజన్లో కొనసాగిన కరువు దెబ్బ నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే ఇలా వరదలు వచ్చి పడ్డాయి. వెచ్చని మధ్యధరా జలాలపై చల్లని గాలి కారణంగా ‘కోల్డ్ డ్రాప్’తో ఏర్పడ్డ క్యుములోనింబస్ మేఘాలు ఈ ఆకస్మిక వర్షాలకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి విపరీత సంఘటనలు తరచుగా, తీవ్రస్థాయిలో జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.SPAIN — The death toll from devastating flash floods in Spain’s eastern region of Valencia has risen to 51, with heavy rains submerging roads and sweeping away cars. The torrents, which followed an intense downpour, overwhelmed local infrastructure, turning town streets into… https://t.co/VwIMQh2FMq pic.twitter.com/yxHl0upKi8— News is Dead (@newsisdead) October 30, 2024క్రెడిట్స్: News is Dead Our thoughts are with Spain in the wake of the tragic flash floods. We extend our deepest condolences to those who have lost loved ones and express our gratitude to the rescuers working tirelessly to aid those affected. 🇪🇸 pic.twitter.com/c3RRSwH8OQ— EPP (@EPP) October 30, 2024 -
స్పెయిన్‌ను వణికిస్తున్న ఆకస్మిక వరదలు
మాడ్రిడ్ : భారీ వర్షానికి ఆకస్మికంగా సంభవించిన వరదలు స్పెయిన్ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా భారీ సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయిలయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.ఓ వైపు వర్షం.. మరోవైపు వరద ధాటికి లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారి జాడ కోసం బాధిత కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. బురద నీరు ముంచెత్తడంతో రైలు, విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది.దీంతో స్పెయిన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రమాదంలో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సాయంతో బాధితుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. తాజాగా, పదుల సంఖ్యలో మృతదేహాల్ని గుర్తించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఆకస్మిక వరదలపై ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ దేశ ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా ఇతర అన్నీ రంగాలకు చెందిన కార్యకలాపాల్ని గురువారం వరకు మూసివేయాలని ఆదేశించారు. ఇక వరద ప్రభావాన్ని అంచనా వేసేలా కేంద్ర క్రైసిస్ కమిటీ ఉన్నతాధికారులకు ప్రధాని అప్రమత్తం చేశారు. -
భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడి.. 13 మంది మృతి
యూరోపియన్ దేశమైన బోస్నియా-హెర్జెగోవినాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణగంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు, కొండచరియలు విరిగినపడిన ఘటనలో 13 మంది మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి బోస్నియాకు రెస్క్యూ బృందాలు చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.BREAKING!!! WORLD MEDIA DONT TALK ABOUT THIS !!! Bosnia and Herzegovina under heavy flooding may lives lost, many disappeared. pic.twitter.com/DniAUgk87n— Neo (@petrovicsrb) October 5, 2024 ఈ ఘటనలో శిథిలాలల కింది చిక్కుకున్న ప్రజలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కోనసాగిస్తున్నాయి. కనీసం 10 మంది వ్యక్తుల ఆచూకీ తెలియలేదని, మృతిచెందిన వారిలో చాలా మంది దక్షిణ బోస్నియాలోని డోంజా జబ్లానికా గ్రామంలో ఉన్నారని అధికారులు తెలిపారు.BREAKING!!! Jablanica, BOSNIA AND HERZEGOVINA: The flood destroyed the whole village. pic.twitter.com/sv4ZCpGS8n— Neo (@petrovicsrb) October 5, 2024 ‘‘జబ్లానికా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో వరదలు పోటెత్తాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ’ అని ప్రభుత్వ అధికారి డార్కో జుకా తెలిపారు.📷: An aerial view shows the area destroyed by a landslide in Donja Jablanica, Bosnia, Saturday, Oct. 5, 2024.https://t.co/QmZXdIENx7 pic.twitter.com/1CC0JL8gyu— Voice of America (@VOANews) October 6, 2024 -
మేఘాలయలో ఆకస్మిక వరదలు..10 మంది మృతి
షిల్లాంగ్:మేఘాలయలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. భారీ వర్షాల ప్రభావంతో ఒక్కసారిగా సౌత్‌గారో హిల్స్ జిల్లాలో వరదలు వచ్చాయి. కేవలం 24 గంటలపాటు కురిసిన వర్షాలకే వరదలు రావడంతో ప్రాణనష్టం జరిగింది.వరదల వల్ల సౌత్‌గారో హిల్స్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడడంతో మొత్తం 10 మంది మరణించారు. ఒకే కుంటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమీక్ష నిర్వహించారు.ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేశారు.ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇదీ చదవండి: ఆహారంలో బల్లి..50 మందికి అస్వస్థత -
కామన్‌గా మారిపోయిన క్లౌడ్ బరస్ట్!! ఎంత ఘోరంగా అంటే.. (ఫొటోలు)
-
డీవీసీతో సంబంధం తెంచేసుకుంటాం
కోల్‌కతా: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ)తో తమ రాష్ట్రం అన్ని సంబంధాలను తెంచేసుకుంటుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదలకు డీవీసీ ఏకపక్షంగా నీటిని విడుదల చేయడమే కారణమని ఆమె ఆరోపించారు. సీఎం మమత శుక్రవారం ఈ మేరకు ప్రధానికి నాలుగు పేజీల లేఖ రాశారు. రాష్ట్రంలోని చిన్న చిన్న నదులు ప్రమాదకర స్థాయి, అంతకు మించి ప్రవహిస్తున్న విషయం తెలుపుతూ తమ అధికారులు, నీటి విడుదలను వాయిదా వేయాలంటూ లేఖ రాసినా డీవీసీ పట్టించుకోలేదని మమత ఆరోపించారు. డీవీసీ నియంత్రణలో ఉన్న మైథోన్, పంచెట్ జలాశయాల నుంచి కొద్ది గంటల వ్యవధిలోనే ఏకంగా 5 లక్షల క్యూసెక్కుల నీటిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా విడుదల చేశారన్నారు. ఒక్కసారిగా భారీగా వరదలు చుట్టుముట్టడంతో పూర్బ వర్ధమాన్, పశ్చిమ బర్ధమాన్, బీర్భూమ్, బంకురా, హౌరా, హుగ్లీ, పూర్బ మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలకు చెందిన 50 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. -
పాఠం నేర్చుకోకపోతే... ఇక ఇంతే!
ఈ ఏడాది జూలై 30, మంగళవారం కేరళ, వయనాడ్‌లోని వెల్లారి మలలో భారీ కొండచరియలు విరిగిపడటంతో వైతిరి తాలూకాలోని మెప్పాడి గ్రామ పంచాయితీలోని ముండక్కై, చూరల్మల గ్రామాలు చాలా వరకు కొట్టుకుపోయాయి. అపార ప్రాణ నష్టం సంభవించింది. బురద, బండరాళ్లు, నేల కూలిన చెట్లతో కూడిన ప్రవాహం భారీ వినాశనానికి కారణమయింది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు రావడంతో కొండచరియలు చల్యార్ నది ఉప నదులలో ఒకటైన ఇరువజింజి పూజ (మలయాళంలో పూజ అంటే నది అని అర్థం)లోకి జారిపడి, బురద వేగంగా ప్రవహించి దిగువ ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగించింది.‘సెంటర్ ఫర్ ఎకలాజికల్ స్టడీస్’కు చెందిన పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ వయనాడ్ విపత్తు క్వారీ కార్యకలాపాల వల్లనే సంభవించిందని అన్నారు. 2011లో ఆయన నేతృత్వంలోని పశ్చిమ కనుమల ఎకాలజీ నిపుణుల బృందం వర్గీకరించిన మూడు సున్నితమైన పర్యావరణ జోన్లలో ప్రస్తుతం ప్రభావితమైన వైత్తిరి తాలూకా అత్యంత బలహీనమైన, సున్నితమైన జోన్. 2019లో, ముండక్కై కొండ దిగువలో జరిగిన, పుత్తుమల కొండచరియ విరిగిపడిన ఘటన తర్వాత, జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వేచేసి మరి కొన్ని తేలికపాటి కొండ చరియలు విరిగిపడిన స్థలా లను గుర్తించి, వయనాడ్‌లోని వేలారిమల ప్రాంతాన్ని, అత్యంత బలహీనమైన జోన్‌గా వర్గీకరించింది. పశ్చిమ కనుమలలోని ఈ ప్రాంతం భౌగోళికంగా ఒక పీఠభూమి. అనేక చిన్న చిన్న నదులతో కూడిన ఒక నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్). ఇవి చెల్లయ్యయార్ నదికి ఉపనది అయిన ఇరువజింజి పుళాలో కలుస్తాయి. ఈ చిన్న చిన్న నదుల వాలులపై ఏర్పడిన మంద పాటి మట్టి పొరలు చాలా తొందరగా కిందికి కదిలి ఉండవచ్చు. వయనాడ్‌కు అంతకు ముందూ కొండచరియలు విరిగిపడిన చరిత్ర ఉంది. 1984, 2020ల్లో తక్కువ తీవ్రతతో విరిగిన కొండ చరియలు ప్రస్తుత పరిస్థితికి మరింత దోహదపడి ఉండవచ్చు.కొండ ప్రాంతాలలో భూమి కొరత వలన కొండ వాలులు, నదీ తలాలపై ఇళ్లు నిర్మించుకుంటూ ఉంటారు. ఈ చర్యను నివారించాలి. ముండక్కై, చూరల్మల గ్రామాల్లో కొన్ని ఇళ్ళు ఈ తరహా లోనే ఉన్నట్లుగా గూగుల్ ఇమేజ్‌లో చూస్తే అర్థమవుతుంది. 2013లో ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు, జరిగిన విధ్వంసానికి ముఖ్య కారణం, మందాకిని నదీ తలాల్లో నిర్మించిన అడ్డదిడ్డమైన కట్టడాలే అని నిపుణులు స్పష్టం చేశారు. వయనాడ్ సంఘటనలో కూడా చాలావరకు ఇళ్ళు, నీటి మట్టం పెరిగి, నదీ ప్రవా హంలో కొట్టుకుపోయాయి. వయనాడ్‌లో ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఎన్నో ప్రాణాలు పోయేవి కావు. ప్రకృతి వైపరీత్యాల అనుభవాల నుండి మనం ఎంతో నేర్చుకోవాలి. సహజ విపత్తులను ఎటూ నివారించలేం. అయితే జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చు. వివిధ కార ణాల వల్ల నిపుణుల సూచనలను విధాన రూప కర్తలు పట్టించుకోరు. వయనాడ్ విలయం వంటి వాటిని నివారించడానికి... నది తలాలను ఆక్రమణకు గురి చేయకపోవడం, బలహీనమైన వాలుల నుండి నివాసాలను ఖాళీ చేయించడం, ఘాట్ రోడ్ల వెంబడి బలహీనమైన చోట్ల గోడలను నిర్మించడం లాంటివి తరచుగా నిపుణులు ఇచ్చే సూచ నలు. వీటిని పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అయితే మన జీవన విధానం ప్రకృతికి అనుకూలంగా క్రమబద్ధం చేసుకోకపోవడమే వచ్చిన చిక్కల్లా!ఎన్. కుటుంబరావు వ్యాసకర్త డైరెక్టర్ జనరల్ (రిటైర్డ్), జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియామొబైల్: 94404 98590 -
గల్లంతైన వారిలో 62 మంది సురక్షితం
గ్యాంగ్‌టక్/జల్పాయ్గురి: సిక్కింలో తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిలో 62 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో, గల్లంతైన వారి సంఖ్య 143 నుంచి 81కి తగ్గిపోయింది. మరోవైపు, వరదల్లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. మరో వైపు, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన 22 మంది ఆర్మీ సిబ్బందిలో మరో రెండు మృతదేహాలు శనివారం బయటపడ్డాయి. దీంతో, ఇప్పటి వరకు 9 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. నాలుగు జిల్లాల్లోని సుమారు 42 వేల మంది ప్రజలపై వరదలు ప్రభావం చూపగా, 1,320 నివాసాలు దెబ్బతిన్నాయని, 13 వంతెనలు కొట్టుకుపోయాయని రాష్ట్ర యంత్రాంగం శనివారం తెలిపింది. తీవ్రంగా గాయపడిన 26 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మంగన్ జిల్లాలోని లచెన్, లచుంగ్ల్లో వరద ముంపులో చిక్కుకున్న సుమారు 3వేల మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకు తరలించేందుకు వైమానిక దళానికి చెందిన ఎంఐ–17 హెలికాప్టర్లతో ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించలేదని అధికారులు చెప్పారు. చుంగ్థంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు హెలికాప్టర్ ద్వారా అత్యవసరాలను సరఫరా చేశారు. సింగ్టమ్, బర్దంగ్, రంగ్పోల్లోని వారిని రక్షించే పనుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తలమునకలై ఉన్నాయి. అనూహ్య వరదలతో చుంగ్థంగ్ పట్టణం 80 శాతం మేరకు తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రభావిత మాంగన్ జిల్లాను సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ శనివారం సందర్శించారు. సహాయక కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో కూడిన అధికారుల కేంద్ర బృందం ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాలకు పంపుతున్నట్లు కేంద్ర మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా చెప్పారు. ఇలా ఉండగా, వచ్చే అయిదు రోజులపాటు మంగన్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ 150 మంది తృటిలో తప్పించుకున్నారు తీస్తా నదికి సమీపంలోని సిక్కిం– పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో రైల్వే సొరంగం పనుల్లో పాల్గొంటున్న సుమారు 150 మంది కార్మికులు ఆకస్మిక వరదల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎగువ నుంచి భారీగా వరద ముంచుకొస్తున్న సమాచారాన్ని అధికారులు కాలింపాంగ్ జిల్లా జీరో మైల్ ప్రాంతం వద్ద ఉన్న ప్రైవేట్ రైల్వే కాంట్రాక్ట్ సంస్థకు చేరవేశారు. సంస్థ అధికారులు వెంటనే ఒక సెక్యూరిటీ గార్డును హుటాహుటిన కార్మికులుండే క్యాంపునకు పంపించారు. పగలంతా పనులు చేసి, అలసిపోయి క్యాంపుల్లో నిద్రిస్తున్న కార్మికులను గార్డు అప్రమత్తం చేశారు. దాదాపు 150 మంది కార్మికులు ఉన్నఫళంగా విలువైన పత్రాలు, దగ్గరున్న డబ్బు, కట్టుబట్టలతో అక్కడి నుంచి అడ్డదారిన బయలుదేరారు. దాదాపు 20 నిమిషాల అనంతరం ప్రధాన రహదారికి వద్దకు చేరుకున్నారు. అప్పటికే వరద దిగువనున్న వారి క్యాంపును మింగేయడం కళ్లారా చూసి కార్మికులు షాక్ అయ్యారు. అప్పటికే అక్కడున్న ట్రక్కుల్లో 2 కిలోమీటర్ల దూరంలోని రాంబి బజార్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌నకు చేరుకున్నారు. వీరంతా అస్సాం, బిహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు. -
సిక్కిం కకావికలం.. అంతకంతకూ పెరుగుతున్న మరణాలు
ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బర్స్ట్‌తో సిక్కిం రాష్ట్రం కకావికలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన కుంభవృష్టి వర్షం, చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో తీస్తా నదికి భారీ వరద పోటెత్తింది. దీంతో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా నదిలో నీటిమట్టం పెరగి వరద నీరు ఉప్పొంగి ప్రవహించింది. ఈ వరదల్లో ఆర్మీ జవాన్లు సహా వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్వీరామంగా గాలిస్తున్నాయి. పెరుగుతున్న మరణాలు సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. వరదల్లో చిక్కుకొని మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం 53కు చేరింది. వీరిలో ఏడుగురు జవాన్లు కూడా ఉన్నారు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నదిలో ఇప్పటి వరకు 27 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ఇంకా 140 మంది ఆచూకీ తెలియడం లేదు. రాష్ట్రంలో 1,173 ఇళ్లు దెబ్బతిన్నాయని, రద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 2,413 మంది ప్రజలను రెస్క్యూ బృందాలు రక్షించినట్లు సిక్కిం ప్రభుత్వం పేర్కొంది. జల విలయానికి 13 వంతెనలు ధ్వంసమయ్యాయని, రోడ్ల కనెక్టివీటి తెగిపోయిందని తెలిపింది. అయితే 6,875 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, రాష్ట్రవ్యాప్తంగా 22 సహాయ శిబిరాల్లో వీరంతా ఆశ్రయం పొందుతున్నాదరని తెలిపింది. తీస్తా-V జల విద్యుత్ కేంద్రానికి దిగువన ఉన్న అన్ని వంతెనలు మునిగిపోయి వరదలో కొట్టుకుపోయాయని పేర్కొంది. ఉత్తర సిక్కింలో కమ్యూనికేషన్‌కు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించింది. సీఎం ఉన్నతస్థాయి సమావేశం వదరల నేపథ్యంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ తమాంగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు, పునరుద్దరణ పనులపై సమీక్షించారు. చుంగ్తంగ్ వరకు రోడ్డు కనెక్టివిటీని ప్రారంభించేందుకు చర్యలుచేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగా నుంచి టూంగ్ వరకు వీలైనంత త్వరగా రహదారిని నిర్మించాలని పేర్కొన్నారు. కుంభవృష్టి వర్షాలు, వరదలతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు. #सिक्किम में बदलफाड़ तबाही के अभी कई लोग लापता, एक्शन में सीएम प्रेम सिंह तमांग, नागा गांव मंगन में बाढ़ प्रभावित इलाकों और राहत शिविरों में पहुंचकर स्थिति का लिया जायजा।#Sikkim #sikkimflood @PSTamangGolay #SikkimCloudburst @BJP4Sikkim pic.twitter.com/uboYFaWOMC — हिंद उवाच (@TheHindUVAACH) October 7, 2023 నదిలో కొట్టుకొస్తున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తీస్తా నది వరదల్లో ఆర్మీకి చెందిన పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కొట్టుకొని వచ్చిన ఆయుధం పేలి ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడటం కలవరపెడుతోంది. దీంతో నదిలో కొట్టుకువచ్చే పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులను ముట్టుకోవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సిక్కిం ప్రభుత్వం కూడా అడ్వైజరీ జారీ చేసింది. నదీ తీరం వెంట వాటిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను సైన్యం రంగంలోకి దింపింది. The rescue of 68 people stranded for 3 days in the Glacier Lake Outburst Flood (GLOF) in North Sikkim by @ITBP_official Himveers needs to be appreciated for their heroic efforts. Respect! 👏👍👌💐👏 @ndmaindia @NDRFHQ https://t.co/m0mDOz0Gzs — Vinod Menon (@nvcmenon) October 7, 2023 మరో అయిదు రోజులు వర్షాలు భారత వాతావరణ శాఖ రాబోయే ఐదు రోజులలో మంగన్ జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. లాచెన్, లాచుంగ్ లోయలలో ప్రతికూల వాతావరణం కారణంగా గత రెండు రోజులుగా Mi-17 హెలికాప్టర్లతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను నిర్వహించడానికి చేస్తున్న అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని భారత వైమానిక దళం వెల్లడించింది. వాతావరణం అనుకూలిస్తే నేడు ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్లు తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపింది. రూ. 44 కోట్లు విడుదల రాష్ట్రానికి మరోవైపు చుంగ్తాంగ్ డ్యామ్ తెగిపోవడానికి గత ప్రభుత్వాలు నాసిరకంగా నిర్మించడమే కారణమని ఆరోపించారు. చుంగుతాంగ్ డ్యామ్ నిర్మాణం సరైన పద్ధతిలో జరగలేదని, ఈ కారణంగానే డ్యామ్ కొట్టుకుపోయి ఇంతటి విపత్తుకు దారి తీసిందని తెలిపారు. ఇక వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డిడీర్ఎఫ్) కేంద్ర వాటా నుంచి ముందస్తుగా ₹ 44.8 కోట్ల విడుదలకు హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT)ని కూడా ఏర్పాటు చేసింది. -
సిక్కిం వరదలు.. 26కు చేరిన మరణాలు
గ్యాంగ్‌టక్: సిక్కింలోని తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరి్వరామంగా గాలిస్తున్నాయి. ఇప్పటి దాకా 26 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో ఏడుగురు జవాన్ల మృతదేహాలున్నాయి. బర్దంగ్ ఏరియాలో సంభవించిన వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైన విషయం తెలిసిందే. జవాన్లు సహా మొత్తం 143 మంది జాడ తెలియాల్సి ఉంది. జల దిగ్బంధానికి గురైన మొత్తం 2,413 మందిని రక్షించి, సహాయక శిబిరాలకు తరలించామని అధికారులు చెప్పారు. బర్దంగ్ ప్రాంతంలో ఇసుక మేటను తొలగించి ఆయుధ డిపోను వెలికితీసినట్లు రక్షణ శాఖ తెలిపింది. అన్వేషణ కార్యకలాపాల్లో స్పెషల్ రాడార్లు, జాగిలాలను రప్పించామని తెలిపింది. సింగ్టమ్–బర్దంగ్ మధ్య ధ్వంసమైన రహదారిని వాహనాల రాకపోకలకు వీలుగా పునరుద్ధరించినట్లు తెలిపింది. ఇలా ఉండగా, రాష్ట్రానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని సీఎం తమాంగ్ చెప్పారు. అడ్వాన్సుగా రూ.44.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా చెప్పారన్నారు. ఆకస్మిక వరద నష్టం అంచనాకు హోం శాఖ, ఇతర విభాగాల అధికారులతో కూడిన బృందాన్ని కూడా పంపుతామని అమిత్ షా తెలిపినట్లు సీఎం వెల్లడించారు. -
సిక్కిం వరదలు..18కి చేరిన మరణాలు
గ్యాంగ్‌టక్: సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. అదేవిధంగా, 22 మంది ఆర్మీ అధికారులు సహా గల్లంతైన వారి సంఖ్య 98కు పెరిగింది. ఉత్తర సిక్కింలో తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలోని ఎల్‌హొనాక్ సరస్సు ఉప్పొంగి సంభవించిన వరదల్లో గల్లంతైన మరో ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో మరణాల సంఖ్య 18కు చేరుకుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్‌ఎస్‌డీఎంఏ) గురువారం బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటివరకు 2,011 మందిని కాపాడినట్లు పేర్కొంది. గల్లంతైన 22 మంది జవాన్ల ఆచూకీ కోసం దిగువ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వివరించింది. ఇలా ఉండగా, వరదల్లో కొట్టుకువచ్చిన 18 మృతదేహాల్లో నాలుగు జవాన్లవని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ఇవి సిక్కింలో గల్లంతైన జవాన్ల మృతదేహాలా కాదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలతో చుంగ్థంగ్ డ్యామ్ ధ్వంసం కావడం.. విద్యుత్ మౌలిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతినడంతోపాటు నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగన్ జిల్లాలోని 8 వంతెనలు సహా మొత్తం 11 బ్రిడ్జీలు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి పదో నంబర్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. చుంగ్థంగ్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. తీస్తా నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నందున, పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ఎస్‌ఎస్‌డీఎంఏ కోరింది. సిక్కింలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన వేల మంది పర్యాటకుల్లో విదేశీయులూ ఉన్నారు. -
సిక్కిం కుంభవృష్టి.. 102 మంది మిస్సింగ్
గాంగ్టక్: భారీ వర్షాలు, వరదలతో సిక్కిం రాష్ట్రం వణికిపోతోంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో తీర ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 14 మంది పౌరులు మరణించారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 102 మంది గల్లంతయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. వారి ఆచూకీ కనిపెట్టేంందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరో 25 మంది క్షతగాత్రులు సహా వరదల్లో చిక్కుకున్న 45 మందిని రక్షించామని తెలిపాయి. ⚡️⚠️ 𝐄𝐍𝐃 𝐓𝐈𝐌𝐄 𝐒𝐂𝐄𝐍𝐀𝐑𝐈𝐎⚠️⚡️ 𝐃𝐞𝐯𝐚𝐬𝐭𝐚𝐭𝐢𝐧𝐠 𝐟𝐥𝐨𝐨𝐝 𝐢𝐧 𝐒𝐢𝐤𝐤𝐢𝐦,𝐈𝐧𝐝𝐢𝐚 As many as 10 civilians have died and 82 people, including 22 Army personnel, are missing after a cloudburst over the Lhonak Lake in north Sikkim caused it to overflow,… pic.twitter.com/rBOrPhUjkK — {Matt} $XRPatriot (@matttttt187) October 5, 2023 కూలిన 14 వంతెనలు సింగ్తామ్ వద్ద వరద ప్రవాహంలో మొత్తం 23 మంది ఆర్మీ జవాన్లు కొట్టుకుపోగా బుధవారం సాయంత్రం నాటికి ఓ సైనికుడిని సహాయక బృందాలు రక్షించాయి. రాష్ట్రంలో 14 వంతెనలు కూలిపోయాయి. వివిధ ప్రాంతాల్లో దాదాపు 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత వరద బీభత్సం ప్రారంభమైంది. బుధవారం చుంగ్‌థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత భీతావహంగా మారిందని తెలియజేశాయి. सिक्किम में सेना के 23 जवान लापता। उत्तरी सिक्किम में अचानक बादल फटने से तीस्ता नदी में बाढ़ आ गई। अचानक आई इस बाढ़ के कारण सेना के 23 जवान लापता हो गए हैं। खोज एवं बचाव अभियान जारी है। ईश्वर से सभी की कुशलता के लिए प्रार्थना 🙏🏽#sikkimflood#IndianArmy#TeestaRiver#Sikkim pic.twitter.com/Gy7Nv1ooZP — JAGDISH PALIWAL (@JAGDISH_BAP) October 5, 2023 లోతట్టు ప్రాంతాలు జలమయం రాజధాని గాంగ్టక్కు 30 కిలోమీటర్ల దూరంలోని సింగ్తామ్ ఉక్కు వంతెన బుధవారం తెల్లవారుజామున పూర్తిగా కొట్టుకుపోయిందంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. రహదారులపై రాకపోకలు స్తంభించాయి. సిక్కిం రాష్ట్రాన్ని దేశంలోని ఇతర భూభాగంతో అనుసంధానించే పదో నెంబర్ జాతీయ రహదారి పలుచోట్ల పూర్తిగా ధ్వంసమైంది. People being rescued and taken to a safe shelter. They didn’t have any say in large infrastructure project, but pay the price of the disaster. #Sikkim pic.twitter.com/KdKu3yIOdT — Aparna (@chhuti_is) October 4, 2023 జనం అప్రమత్తంగా ఉండాలని సూచన వర్షాలు, వరద విలయాన్ని సిక్కిం ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. మాంగాన్, గాంగ్టక్, పాక్యోంగ్, నామ్చీ జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 8 దాకా సెలవు ప్రకటించింది. ఉత్తర బెంగాల్‌కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. తీస్తా నది ప్రవాహ ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చుంగ్తాంగ్లోని తీస్తా స్టేజ్ 3 డ్యామ్ వద్ద పనిచేస్తున్న దాదాపు 14 మంది కార్మికులు ఇప్పటికీ టన్నెల్లో చిక్కుకొని ఉన్నారు. చుంగ్‌తాగ్, ఉత్తర సిక్కింలో చాలా వరకు మొబైల్ నెట్‌వర్క్‌లు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లకు అంతరాయం ఏర్పడింది.. చుంగ్తాంగ్లోని పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసం అయ్యింది. #earthquake #GayatriJoshi #SikkimCloudburst #SanjaySinghArrested #ElvishYadav #AishwaryaRai #ChampionsLeague 14 Dead, 102 Missing In Sikkim Flash Flood, Missing Armyman Rescued Over 3,000 tourists are feared stranded, said a government official. The Army said it has rescued… pic.twitter.com/AleFmJgiL3 — shakir Berawala (@shakirBerawala) October 5, 2023 -
లిబియా మరణాలు..11 వేలకు పైనే
డెర్నా: లిబియాలోని డెర్నాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య శుక్రవారానికి 11 వేలు దాటింది. జాడ తెలియకుండా పోయిన మరో 10 వేల మంది కోసం అన్వేషణ ముమ్మరంగా సాగుతోంది. నివాస ప్రాంతాలను తుడిచిపెట్టిన మట్టి, బురద తొలగింపు పనులు సాగుతున్నాయి. సోమవారం సంభవించిన భారీ వర్షాలు, వరదలతో ఎగువనున్న రెండు జలాశయాలు బద్దలై ఒక్కసారిగా డెర్నా నగరాన్ని నీటి ప్రవాహం ముంచెత్తిన విషయం తెలిసిందే. -
పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనక తప్పదు! ముందుంది పెను ముప్పు?
దేవభూమి ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌లో కాళ్లకింది నేల ఉన్నపళంగా కుంగిపోతున్న తీరు పర్యావరణపరంగా మానవాళి ముందున్న పెను ముప్పును కళ్లకు కట్టింది. పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. జోషి మఠ్ సమస్యకు కారణమైన అడవుల విచ్చలవిడి నరికివేత, పెచ్చరిల్లిన వాతావరణ కాలుష్యం వంటివి ప్రపంచమంతటినీ వేధిస్తున్న సమస్యలే. వాటి పర్యవసానాలను గ్లోబల్ వార్మింగ్, ఆకస్మిక వరదలు, తీవ్ర కరువుల రూపంలో అన్ని దేశాలూ చవిచూస్తూనే ఉన్నాయి. ఈ ప్రాకృతిక విపత్తుల తీవ్రత కొన్నేళ్లుగా బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇవన్నీ మనిషి అత్యాశకు ప్రకృతి ప్రతిస్పందన తాలూకు సంకేతాలే. వాటిని ఇప్పటికైనా అర్థం చేసుకుని తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ‘‘లేదంటే అతి త్వరలో పరిస్థితి పూర్తిగా చేయి దాటడం ఖాయం. ఇప్పుడు జోషి మఠ్‌లో జరుగుతున్నది రేపు అన్నిచోట్లా జరుగుతుంది. ప్రకృతితో ఇష్టారాజ్యపు చెలగాటం అంతిమంగా వినాశనానికే దారి తీస్తుంది’’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ తదితరాల వల్ల సముద్ర మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ధోరణి కొన్నేళ్లుగా వేగవంతమవుతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు క్రమంగా నీట మునుగుతాయి. మానవాళిపై పెను ప్రభావం చూపగల పరిణామమిది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో పదో వంతుకు పైగా సముద్ర తీర ప్రాంతాల్లోనే వ్యాపించి ఉంది. మహా నగరాల్లో కూడా అధిక శాతం అక్కడే ఉన్నాయి. అవన్నీ మునగడమో, పూర్తిగా నివాసయోగ్యం కాకుండా పోవడమో జరుగుతుంది. ఫలితంగా కోట్లాది మంది పొట్ట చేత పట్టుకుని వలస బాట పడతారు. వారందరికీ పునరావాసం, ఉపాధి తదితరాలన్నీ అతి పెద్ద సవాళ్లుగా నిలుస్తాయి. మానవాళి చరిత్రలో ఇది పెను విపత్తుగా మారినా ఆశ్చర్యం లేదు. అంతేగాక మితిమీరిన కాలుష్యం ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తోంది. సురక్షితమైన తాగునీటికి చాలా దేశాల్లో ఇప్పటికే తీవ్ర కొరత ఏర్పడింది. మున్ముందు ఇది మరింత తీవ్రతరం కానుంది. ప్రజలు సరైన తిండికి, తాగునీటికే కాదు, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలికి కూడా నోచుకోని పరిస్థితి తలెత్తనుంది! మాటలకే పరిమితం పర్యావరణ నష్టాలకు అడ్డుకట్టే వేసేందుకు చారిత్రక పారిస్ ఒప్పందం మొదలుకుని పలు కాప్ శిఖరాగ్రాల దాకా పేరుకు ప్రయత్నాలెన్నో జరుగుతున్నాయి. కానీ చిత్తశుద్ధితో కూడిన చర్యలు మాత్రం కన్పించడం లేదు. కర్బన ఉద్గారాల తగ్గింపు తదితరాలకు సంబంధించి గొప్ప లక్ష్యాలు నిర్ణయించుకోవడం, తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా సాగుతోంది. ఎవరికి వారు పొరుగు దేశమే ప్రధానంగా బాధ్యత తీసుకోవాలన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎటు చూసినా విపత్తులే... ► మంచు ఖండమైన అంటార్కిటికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా కరుగుతున్నాయి. దీని దుష్ప్రభావం పర్యావరణంపై చాలా రకాలుగా ఉండబోతోంది. ► ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా ముందుగా ఇంగ్లండ్ తదితర యూరప్ దేశాలు అతి శీతల వాతావరణంతో అల్లాడాయి. తర్వాత అమెరికా దాని దెబ్బకు 10 రోజులకు పైగా దాదాపుగా స్తంభించిపోయింది. దేశ చరిత్రలో ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, మంచు తుఫాన్లతో అల్లాడింది. వేల కోట్ల డాలర్ల ఆస్తి నష్టం చవిచూసింది. ► అమెరికాలో ఇటీవలి దాకా కార్చిచ్చులతో అల్లాడిన కాలిఫోర్నియా ఇప్పుడేమో కనీవినీ ఎరగని వరద బీభత్సంతో తల్లడిల్లుతోంది. ► ఉత్తర భారతం కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతటి చలితో వణుకుతోంది. ► పొరుగు దేశం పాకిస్తాన్ గతేడాది దేశ చరిత్రలో ఎన్నడూ చూడనంతటి వరదలతో అతలాకుతలమైంది. మూడొంతుల ప్రాంతాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఆ ప్రభావం నుంచి పాక్ ఇప్పటికీ కోలుకోలేదు. ఏటా 10 సెం.మీ. కుంగిన జోషీ మఠ్! జోషి మఠ్‌లో నేల 2018 నుంచి ఏటా 10 సెంటీమీటర్ల చొప్పున కుంగుతూ వస్తోందట! అధునాతన శాటిలైట్ ఇమేజ్ విశ్లేషణ ఆధారంగా జరిగిన ఒక తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో..
అకస్మాతుగా సంభవించిన భారీ వరదలో చిక్కుకున్న ఇద్దరు బాలురను ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ వ్యక్తి. ఇద్దరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి ఆ పిల్లల తండ్రి అయి ఉంటాడని అనుకున్నారు. కానీ ఓ సాధరణ వ్యక్తి అని తెలిశాక అభినందించారు. పిల్లల్ని కాపాడిన వ్యక్తిని ఫొటోగ్రాఫర్ అలీ బిన్ నాసర్ అల్ వార్దిగా గుర్తించారు. ఒమన్‌లో ఈ ఏడాది మొదట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిజెన్ అనే మహిళ దీన్ని షేర్ చేయగా.. దాదాపు నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వ్యక్తి సాహసాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఇతను రియల్ హీరో అంటూ కొనియాడారు. He is a hero! 💞pic.twitter.com/wKcUKVQpmH — Figen (@TheFigen_) December 21, 2022 చదవండి: గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట..! -
కళ్ల ముందే కన్నబిడ్డ కొట్టుకుపోతుంటే..
అలపుజ్జా: ప్రమాదాల రూపంలో జీవితాల్ని అర్థాంతరంగా ముగించడం, ఆనందకరమైన క్షణాలను అంతలోనే విషాదాలు మార్చేయడం.. విధికి అలవాటే. సరదాగా గడిపేందుకు చుట్టాల ఇంటికి వెళ్లిన ఆ కుటుంబానికి.. తిరుగు ప్రయాణంలో తీరని శోకమే మిగిలింది. కళ్ల ముందు కన్నకూతురు కొట్టుకుపోతుంటే.. కాపాడలేని నిస్సహాయస్థితిలో విలపిస్తూ ఉండిపోయారు ఆ తల్లిదండ్రులు. కేరళ అలపుజ్జా జిల్లాకు చెందిన సుశీల, సురేంద్రన్ తమ ఒక్కగానొక్క కూతురు అర్ష(24)తో కలిసి కరువరకుండులో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. అంతా కలిసి దగ్గర్లోని కొండ ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌కు వెళ్లారు. సాయంత్రందాకా సరదాగా గడిపి.. ఐదున్నర గంటల ప్రాంతంలో సమీపంలో ఉన్న నీటి ప్రవాహం దగ్గరకు వెళ్లారు. వాతావరణం అంతా మాములుగా ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా నీళ్లలోకి దిగి హుషారుగా గడపాలనుకున్నారు. అయితే.. అంతలో వాళ్ల సంతోషం కాస్త.. హాహాకారాలుగా మారిపోయింది. ఒక్కసారిగా ఆకస్మిక వరద సంభవించడంతో అక్కడున్న వాళ్లంతా చెల్లాచెదురైపోయారు. చిన్న చిన్న పిల్లలతో సహా కాస్త దూరం కొట్టుకుపోయారు. అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగలిగారు. కానీ, పాపం.. అర్ష మాత్రం నిస్సహాయ స్థితిలో నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయింది. ఆమెను కాపాడాలంటూ ఆమె తల్లిదండ్రులు బతిమాలినా.. సాహసం చేయాలేని స్థితిలో ఉండిపోయారంతా. చాలా దూరం కొట్టుకువెళ్లే క్రమంలో రాళ్లురప్పలు తగిలి ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు ఎలాగోలా తీవ్రంగా గాయపడిన అర్షను గుర్తించి స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమె తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. Credits: Mathrubhumi News ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి దుర్మార్గానికి దిగిన కన్నతల్లి -
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. ఏమిటీ క్లౌడ్ బరస్ట్?
సిమ్లా, డెహ్రాడూన్: క్లౌడ్ బరస్ట్‌లు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టిస్తున్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో నదులు పొంగిపొరలుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. మండి, కంగ్రా, చంబా జిల్లాల్లోని ముంచెత్తిన వరదల్లో 22 మంది మరణించారు. మరో అయిదుగురు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు శనివారం ఉదయం పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లను కలుపుతూ పఠాన్‌కోటలోని చక్కి నది మీద నిర్మించిన 800 మీటర్ల పొడవైన రైల్వే వంతెన కుప్పకూలిపోయింది. జోగిందర్ నగర్, పఠాన్‌కోట్ మధ్య ఈ వంతెనను బ్రిటిష్ హయాంలో 1928లో నిర్మించారు. incident of flood (Beas River) found at Village Kheri , Sub division Sujanpur, District Hamirpur. 10-12 houses on the verge of drowning 15-20 people are trapped inside them, including some small children. Till now no damage to life. Rescue teams are on the spot @DcHamirpur pic.twitter.com/dq3dpZxM6k — HIMACHAL PRADESH STATE DISASTER RESPONSE FORCE (@HP_SDRF) August 20, 2022 వంతెన బీటలు వారడంతో గత నెల రోజులుగా ఈ వంతెనపై రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. చంబా జిల్లాలో కొండచరియలు ఇళ్ల మీద విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మండిలో వరదలకు ఒకే కుటుంబంలోని అయిదుగురు కొట్టుకుపోయారు. హమీర్పూర్ జిల్లాను కూడా వరదలు ముంచెత్తాయి. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు అందిస్తున్నట్టుగా తెలిపారు. ఉత్తరాఖండ్‌లో వరుస క్లౌడ్ బరస్ట్‌లు ఉత్తరాఖండ్‌లో వరుస క్లౌడ్ బరస్ట్‌లతో నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వంతెనలు వరద ఉధృతికి కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలకు తెహ్రి జిల్లాలో ఇళ్లు కూలిపోయి నలుగురు మరణించగా, మరో 10 మంది గల్లంతయ్యారు. రిషికేష్ గంగా నది ఉప్పొంగుతోంది. టాన్స్ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో తపకేశ్వర్ గుహలను వరద నీరు ముంచెత్తింది. రాయపూర్‌లోని సార్కేత్ గ్రామంలో క్లౌడ్ బరస్ట్‌తో థానో ప్రాంతంలోని సాంగ్ నదిపై వంతెన కూలిపోయింది. ముస్సోరి సమీపంలో పర్యాటకప్రాంతమైన కెంప్టీ జలపాతం ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరద ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. అవసరమైతే ఆర్మీ సాయం కోరతామని వెల్లడించారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చదవండి: లిక్కర్ కుంభకోణంలో సూత్రధారి కేజ్రీవాల్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ జార్ఖండ్, ఒడిశాలో భారీ వానలు అటు జార్ఖండ్, ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జార్ఖండ్‌లో భారీ ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు మహానది ఉప్పొంది ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 2 లక్షల మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మయూర్ భంజ్, కియోంజార్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి గోడలు కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏమిటీ క్లౌడ్‌బరస్ట్ అతి తక్కువ వ్యవధిలో, పరిమిత ప్రాంతంలో కుంభవృష్టి కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అంటారు. భారత వాతారణ శాఖ ప్రకారం 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక గంటలో 10 సెంటీమీటర్లకి మించి వర్షం కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారు. మైదాన ప్రాంతాల కంటే కొండ ప్రాంతాల్లోనే క్లౌడ్ బరస్ట్‌లు ఎక్కువగా సంభవిస్తాయి. పర్వత ప్రాంతాల్లో మేఘాలు అధిక తేమను కలిగి సంతృప్త స్థాయికి చేరుకుంటాయి. కానీ వాతావరణం వేడిగా ఉండడం వల్ల వర్షించడం సాధ్యమవదు. ఫలితంగా కొంత సమయం గడిచాక మేఘాల్లో సాంద్రత ఎక్కువైపోయి ఒక్కసారిగా కుండపోతలా నీటిధార కురుస్తుంది. వాన చినుకుల పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. ఒక్కోసారి ఉరుములు, మెరుపులు, పిడుగులతో కుంభవృష్టి కురుస్తుంది. వీటి గురించి ముందుగా అంచనా వేయడం కష్టం. కేవలం డాప్లర్ రాడార్ల ద్వారా వీటిని గుర్తించే అవకాశం కొంతవరకు ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఈ రాడార్లు 34 ఉన్నాయి. అయినప్పటికీ కచ్చితంగా ఫలానా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరుగుతుందని ముందస్తుగా అంచనా వేయడం దాదాపుగా అసాధ్యమని భారత వాతావరణ శాఖ చెబుతోంది. -
హిమాచల్ ప్రదేశ్‌లో వరదల బీభత్సం.. 22 మంది మృతి
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడటం ప్రమాదాల తీవ్రతను మరింత పెంచుతోంది. గత 24 గంటల్లో ఒకే కుటుంబంలో ఎనిమిది మందితో సహా దాదాపు 22 మంది మరణించారు, 9 మంది గాయపడ్డారు. మరో ఆరుగురు కనిపించకుండా పోయారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ఆ రోడ్డులో కొండ చరియలు విరిగిపడడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిలిచిపోయింది. ప్రస్తుతం రహదారిని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రా, చంబా, బిలాస్పూర్, సిర్మౌర్, మండి జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండి జిల్లాలోని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఆగస్టు 25 వరకు హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ సుధేష్ కుమార్ వెల్లడించారు. WATCH: 2 killed, at least 15 missing after heavy rain #triggers #cloudburst, flash floods, landslides in several parts of Mandi district in #HimachalPradesh#Himachal #mandi #Flood #heavyrain pic.twitter.com/C6JpfVo8mp — BNN India (@BNNIN) August 20, 2022 మండి వద్ద మనాలి-చండీగఢ్ జాతీయ రహదారి, షోఘిలోని సిమ్లా-చండీగత్ హైవే సహా 743 రోడ్లు ట్రాఫిక్ కారణంగా బ్లాక్ చేశారు. ఒక్క మండిలోనే భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించగా, ఐదుగురు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి బ్రిడ్జ్ శనివారం ఉదయం కూలిపోయిన విషయం తెలిసిందే. Dharampur @ Beas River Many peoples missing in Baggi of Mandi District 🙏🏻 Damaging Rains over parts of #Uttarakhand & #HimachalPradesh pic.twitter.com/UaAyr3a0Jx — Weatherman Shubham (@shubhamtorres09) August 20, 2022 -
అమాంతం కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి.. వందల గ్రామాలకు తెగిన సంబంధాలు
సిమ్లా: కుంభవృష్టి ప్రభావంతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వణికిపోతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా.. ఇరు రాష్ట్రాల్లోనూ భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొనవచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికలతో భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. కాంగ్రా జిల్లా చక్కీ బ్రిడ్జి ఆకస్మిక వరదలకు కుప్పకూలింది. పిల్లర్లు డ్యామేజ్ కావడంతో వదర ఉదృతిని తట్టుకోలేక బ్రిడ్జి అంతా చూస్తుండగానే కూలిపోయి.. చక్కీ నదిలో కొట్టుకుపోయింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు జిల్లా అయి కంగ్రాలో చక్కీ నదిపై ఉన్న 800 మీటర్ల రైల్వే వంతెన శనివారం కూలిపోయింది. దీంతో వంతెన కొత్త పిల్లర్‌ను నిర్మించేంత వరకు పఠాన్‌కోట్, జోగిందర్ నగర్ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. Chakki railway bridge near Kandwal in Nurpur has collapsed due to heavy rain.#TTRHimachal #Kangra #railways @rpfnrumb @drm_fzr @drm_umb @HP_SDRF @SpKangra @DdmaKangra pic.twitter.com/y3lPvcAR8J — HP Traffic, Tourist & Railways Police (@TTRHimachal) August 20, 2022 ఈ బ్రిడ్జిని 1928లో బ్రిటిషర్లు కట్టించారు. రోడ్లు, బస్సు మార్గాలు అందుబాటులో లేకపోవడంతో.. పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న వందలాది గ్రామాలకు ఈ రైలు మార్గం ఆధారం. అయితే.. నదీ గర్భంలో అక్రమ మైనింగ్‌తో 90 ఏళ్ల నాటి వంతెన బలహీనపడింది. దీనిపై పలు ఫిర్యాదులు సైతం అధికారులకు అందాయి. గతంలో ఓ పిల్లర్‌కు పగుళ్లు రావడంతో రైలు సేవలను నిలిపివేయగా.. ఇప్పుడు ఏకంగా స్థంభమే కొట్టుకుపోయింది. మరోవైపు ధర్మశాలలోనూ కొండ చరియలు విరిగిపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా.. మండిలో మరో పదమూడు మంది కూడా మరణించి ఉంటారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి జై రామ్ థాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: పార్టీ చేసుకున్న ప్రధాని... స్టెప్పులతో హల్చల్: వైరల్ -
చైనాలో ఆకస్మిక వరదలు.. 12 మంది మృతి
బీజింగ్: నైరుతి, వాయవ్య చైనాలోని పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షం కారణంగా వరదలు సంభవించి సిచువాన్ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. శనివారం నాటికి ఈ ప్రాంతంలో 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. వాయువ్య గన్సు రాష్ట్రంలోని లాంగ్నాన్ నగరంలోనూ వరదల వల్ల ఆరుగురు చనిపోయినట్లు మీడియా వెల్లడించింది. ఆ ప్రాంతంలో 3000 మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించినట్లు పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లోనే వర్షపాతం 98.9 మిల్లీమీటర్లకు చేరిందని, జులై సగటుతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు అని వెల్లడించింది. ఒకవైపు చైనాలోని తూర్పు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే నైరుతి, వాయవ్య ప్రాంతాల్లో మాత్రం కుండపోత వర్షాలు కురిసి వరదలు సంభవిస్తున్నాయి. తూర్పు జెజియాంగ్ రాష్ట్రం, షాంఘై నగరాల్లో గతవారం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయయ్యాయి. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వేడి గాలులు ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటాయని, ఆ నీరు ఒక్కసారిగా విడుదలైనప్పుడు క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తాయని చెప్పారు. ఫలితంగా ఆకస్మిక వరదలు వస్తాయని పేర్కొన్నారు. చదవండి: మంటల్లో కాలిపోతున్న ఇల్లు..హీరోలా పిల్లల్ని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్ -
వరద భారతం.. సవాల్‌గా మారిన క్లౌడ్ బరస్ట్‌లు, ఆకస్మిక వరదలు
వానలు దంచికొడుతున్నాయి. ఏ రాష్ట్రాన్ని చూసినా వరదలు ముంచేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని లోతట్టు ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. అత్యంత ఆధునిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలున్నా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమర్థ ముందు జాగ్రత్త చర్యల్లో విఫలమవుతూనే ఉన్నాం. కొన్నేళ్లుగా దేశంలో వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాలు, ఏడాది మొత్తంలో కురవాల్సిన వాన ఒకట్రెండు రోజుల్లోనే పడటం వంటివి సవాలుగా మారాయి. 2010 నుంచి 2021 దాకా తుపాన్లకు బలవుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. 2013 నుంచి భారీ వర్షాలు వరదలతో ఏటా సగటున వెయ్యి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థ పనితీరు ఇలా... భారత్‌లో ప్రకృతి వైపరీత్యాలను ముందే తెలుసుకొని అప్రమత్తం కావడానికి తగిన వ్యవస్థ అందుబాటులో ఉంది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితుల్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నదులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తదితరాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షిస్తూ ఉంటాయి. దేశవ్యాప్తంగా 20 నదీ తీర ప్రాంతాల్లో దాదాపుగా 1,600 హైడ్రో మెట్రాలజికల్ స్టేషన్లు సీడబ్ల్యూసీ నిర్వహణలో ఉన్నాయి. ఇవన్నీ రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలను గుర్తిస్తూ విపత్తు నిర్వహణ సంస్థల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. వరద బీభత్సంతో ముంపు సమస్యలు తలెత్తేలా ఉంటే హెచ్చరించడానికి గూగుల్‌తో సీడబ్ల్యూసీ ఒప్పందం కుదుర్చుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఐఎండీ 33 రాడార్ నెట్వర్క్ స్టేషన్లను నిర్వహిస్తూ వాతావరణ సూచనలు చేస్తుంటుంది. వరద పరిస్థితుల అంచనాకు 14 ప్రాంతాల్లో ఫ్లడ్ మెట్రాలజికల్ ఆఫీసులు (ఎఫ్‌ఎంఒ)న్నాయి. కచ్చితత్వాన్ని మరింత పెంచేలా వీటిని మెరుగు పరచాల్సిన అవసరముంది. 2016లో వార్దా తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను ముంచేస్తుందని భారత వాతావరణ శాఖ చెబితే, యూరోపియన్ మోడల్ మాత్రం చెన్నై వైపు వెళ్తుందని కచ్చితంగా అంచనా వేసింది. గత మే నెలలో అసాని తుపాను ఒడిశా, బెంగాల్‌వైపు వెళ్తోందని ఐఎండీ చెప్పగా యూరోపియన్ మోడల్ మాత్రం ఏపీ వైపు మళ్లుతుందని కచ్చితంగా అంచనా వేసింది. ముంచేస్తున్న ఆకస్మిక వరదలు క్లౌడ్ బరస్ట్‌లతో ఏర్పడే ఆకస్మిక వరదలు కొద్ది కాలంగా విపత్తు నిర్వహణ యంత్రాంగానికి సవాలు విసురుతున్నాయి. భారత వాతావరణ శాఖ, అమెరికా జాతీయ వాతావరణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా దక్షిణాసియా దేశాల్లో వాతావరణ పరిస్థితుల అంచనాకు 2020లో ఫ్లాష్ ఫ్లడ్ గైడన్స్ సిస్టమ్ (ఎఫ్‌ఎఫ్‌జీఎస్) ఏర్పాటు చేసింది. ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్ట్లపై 6 నుంచి 24 గంటల ముందు ఇది సమాచారం ఇవ్వగలదు. కానీ ప్రతిస్పందనకు తక్కువ సమయం ఉండడం సహాయ చర్యలకు సమస్యగా మారింది. క్లౌడ్ బరస్ట్‌లను కనీసం రెండు మూడు రోజుల ముందే గుర్తించగలిగే వ్యవస్థను పటిష్టంగా నిర్మించాల్సిన అవసరముందని బోంబే ఐఐటీలో వాతావరణ అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ శ్రీధర్ బాలసుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎంత కష్టం, ఎంత నష్టం ప్రపంచవ్యాప్తంగా గతేడాది ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన ప్రకృతి వైపరీత్యాల్లో రెండింటిని మన దేశం ఎదుర్కొంది. టాక్టే, యాస్ తుపానులతో దేశం చిగురుటాకులా వణికింది. ఒక్కో తుపాను కనీసం రూ.7,600 కోట్ల నష్టం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారు వందల సంఖ్యలో, నిర్వాసితులు లక్షల్లో ఉన్నారు. దేశంలో 4 కోట్ల హెక్టార్ల భూమి వరద ముంపును ఎదుర్కొంటోంది. 1953–2010 మధ్య 4.9 కోట్ల హెక్టార్లు వరదల్లో మునిగింది. 2.1 కోట్ల హెక్టార్ల భూమికి మాత్రమే సురక్షిత ప్రాంతంలో ఉంది. ఏటా సగటున 1,685 మంది చనిపోతున్నారు. 6 లక్షల వరకు పశువులు, 12 లక్షల ఇళ్లు ప్రభావితమవుతున్నాయి. -
అమర్నాథ్ యాత్ర.. కొత్త బ్యాచ్‌లకు బ్రేక్
జమ్మూ: తీవ్ర అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్మూ నుంచి కశ్మీర్‌లోని బేస్ క్యాంప్‌లకు చేరుకోవాల్సిన అమర్నాథ్ యాత్రికుల కొత్త బ్యాచ్‌లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అమర్నాథ్ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది యాత్రికులు మృతి చెందగా మరో 40 మంది వరకు జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. జూన్ 30వ తేదీ నుంచి మొదలైన 43 రోజుల అమర్నాథ్ యాత్ర ఆగస్ట్ 11వ తేదీన రక్షా బంధన్ రోజున ముగియనుంది. -
భూమ్మీదే కాదు.. అక్కడా వరదలు ముంచెత్తాయి!
ఇప్పుడంటే అంగాకర గ్రహం ఎండిపోయి.. రాళ్లు, రప్పలు, మట్టిదిబ్బలతో కనిపిస్తోంది. మరి ఒకప్పుడు? అంటే.. ఓ 3.7 బిలియన్ల సంవత్సరాల కిందట. ఆ సమయంలో మార్స్.. ఎర్త్ తరహాలోనే ఉండేదని పరిశోధనలు ఒక్కొక్కటిగా చెబుతూ వస్తున్నాయి. ఇంతకీ ఈ అరుణ గ్రహం మానవ నివాస యోగ్యానికి అనుకూలమా? కాదా? అనేది తేల్చేక్రమంలో ఆసక్తికరమైన విషయాలెన్నో బయటపడుతున్నాయి. తాజాగా.. అంగారకుడిపై వరద ప్రవాహాల్ని సైతం గుర్తించింది నాసాకు చెందిన పర్సివరెన్స్ రోవర్. తాను దిగిన జీజెరో క్రాటర్ ప్రాంతంలోనే ఈ రోవర్, వరద జాడల్ని గుర్తించడం విశేషం. కుంభవృష్టి వరదలతో లోతైన గుంతలు ఏర్పడి ఉండొచ్చని సైంటిస్టులు నిర్ధారణకు వచ్చారు. ఇక కొత్త రోవర్‌తో అనుసంధానం కాసేపు ఆగిపోవడానికి ముందు.. పర్సివరెన్స్ కీ ఫొటోల్ని నాసా సెంటర్‌కు పంపింది. అంగారకుడి ఉపరితలంపై తీసిన ఈ చిత్రాలను పరిశీలించిన తర్వాత.. నాసా కొన్ని విషయాల్ని వెల్లడించింది. ► ఆ కాలంలో మార్స్ మీద వాతావరణం(పొరలు) దట్టంగా ఉండేది(మొదటి నుంచి ఇదే చెప్తున్నారు) ► జీజెరో క్రాటర్‌ను ఒక సరస్సుగా దాదాపు నిర్ధారణకు వచ్చేశారు ► నదులు, వాటి ప్రవాహం వల్ల మార్స్ మీద ఫ్యాన్ ఆకారంలో డెల్టా ప్రాంతాలు సైతం ఏర్పడ్డాయి ► సరస్సు(ఎండిపోయిన) చిన్నభూభాగాలు.. నది డెల్టా ప్రాంతానికి చెందినవే అయ్యి ఉంటాయి ► గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కుంభవృష్టి వరదలు ముంచెత్తాయి.. బహుశా ఆ ప్రాంతమంతా ఎండిపోయి ఉండొచ్చు ► వరదలతో సరస్సుల్లోకి కొట్టుకువచ్చిన రాళ్లురప్పల ఫొటోల్నే పర్సివరెన్స్ ఇప్పుడు నాసాకి పంపింది. చదవండి: గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్...! -
హైదరాబాద్‌లో ఒక్కసారిగా కుండపోత వర్షం.. ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ పరిధిలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి పొద్దు పోయే వరకు కుండపోతగా జడి వాన కురిసింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో నగరం నిండా మునిగింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్ల కొమ్మలు తెగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగి పడడంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పలు బస్తీలలో ఇళ్లల్లోకి చేరిన వరద నీటితో స్థానికులు అవస్థలు పడ్డారు. చైతన్యపురి ప్రధాన రహదారిలో Greater Hyderabad 🌧🌦#HyderabadRains pic.twitter.com/vFbKjT1erQ — Nani (@srichowdary4) October 9, 2021 ప్రధాన రహదారులపై రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. దిల్సుఖ్నగర్ పరిధిలోని లింగోజి గూడలో అత్యధికంగా 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాత్రి 10 గంటల వరకు కుర్మగూడలో 11.7, ఎల్బీనగర్ 11, హస్తినాపురంలో 10.8, ఆస్మాన్‌ఘడ్ 10.5, విరాట్‌నగర్ 10.3, కంచన్‌బాగ్ 10, సర్దార్ మహల్ 9.9, చందూలాల్ బారాదరిలో 9.6, జహానుమా 9.2, రెయిన్ బజార్ 9.2, శివరాంపల్లి 8.9, అత్తాపూర్ 8.1, నాచారం 8.1, రాజేంద్రనగర్ 8, భవానీనగర్ 7.4, బేగంబజార్ 7.2, బతుకమ్మకుంట 7.1, నాంపల్లిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దిల్‌సుఖ్‌నగర్‌లో #HyderabadRains | Rainwater entered a restaurant in Old City after incessant rains lashed Hyderabad yesterday. (ANI) pic.twitter.com/rJEGYwGdKZ — NDTV (@ndtv) October 9, 2021 ►రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో భారీ వర్షానికి ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్తాపూర్ ఆరాంఘర్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ►అప్పా చెరువు నుండి వరద నీరు కర్నూలు జాతీయ రహదారిపై ప్రవహించడంతో శంషాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిని మూసివేశారు. వాహనాలను హిమాయత్ సాగర్ మీదుగా మళ్లిస్తున్నారు. సాగర్ రింగ్‌రోడ్డులో ►కాటేదాన్ 33/11 కె.వి సబ్‌స్టేషన్ మరోసారి నీటమునిగింది. దీంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ►సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ, వారాసిగూడ, సీతాఫల్‌మండీ, చిలకలగూడ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. ఎల్బీనగర్లో #HyderabadRains in #Telangana on Friday night. Today morning as well we have seen water logging in many areas. Yesterday, Three cars drowned at PVNR expressway pillar no. 194 #HeavyRainpic.twitter.com/JRZ6ibSIBg — #Telangana (@HiiHyderabad) October 9, 2021 ►దిల్‌సుఖ్‌గర్, సరూర్‌నగర్, మలక్‌పేట్, మీర్‌పేట, బడంగ్‌పేటలలో వరదనీరు పోటెత్తింది. ప్రధాన రహదారులు సైతం నీటమునిగాయి. మూడు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్‌బాగ్ ప్రాంతాల్లోనూ రహదారు లు నీటమునిగి..మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. ►పాతబస్తీలో వరదనీటిలో ట్రాలీ ఆటోతో పాటు పలు వాహనాలు కొట్టుకుపోయాయి. కొత్తపేటలో #HyderabadRains in #Telangana on Friday night. Today morning as well we have seen water logging in many areas. Yesterday, Three cars drowned at PVNR expressway pillar no. 194 #HeavyRainpic.twitter.com/JRZ6ibSIBg — #Telangana (@HiiHyderabad) October 9, 2021 వందలాది ఫీడర్లలో నిలిచిన విద్యుత్ సరఫరా గ్రేటర్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ సరఫరా స్తంభించింది. 250కిపైగా ఫీడర్ల పరిధిలో అంతరాయం ఏర్పడటంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీనగర్, మీర్‌పేట, బడంగ్‌పేట, సంతో‹Ùనగర్, లింగోజిగూడ, హస్తినాపురం, నాగోల్, సరూర్‌నగర్, చంపాపేట, కర్మన్‌ఘాట్, కొత్తపేట, మలక్‌పేట, పాతబస్తీ సహా పలు ప్రాంతాలలో పూర్తిగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. రాజేంద్రనగర్, మెహదీపట్నం, అత్తాపూర్, సైదాబాద్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్, ఇమ్లీబన్ బస్టాండ్ పరిసరాల్లో అంధకారం తప్పలేదు. పాతబస్తీలో ఒకరికొకరు తోడుగా రోడ్డు దాటుతున్న దృశ్యం చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, అంబర్‌పేట, సికింద్రాబాద్ ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఒకవైపు ఏకధాటిగా కురుస్తున్న వర్షం..మరో వైపు మోకాళ్ల లోతు చేరిన వరద నీటితో ప్రయాణికులు, వీధి దీపాలు వెలగక ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచి్చంది. పలు చోట్ల గంట నుంచి గంటన్నర పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. మరికొన్ని చోట్ల రాత్రి పొద్దుపోయేదాకా కరెంట్ సరఫరా లేదు. రోడ్డుపై భారీగా చేరిన వరద నీరు వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ భారీ వర్షానికి ఉప్పల్‌లో రోడ్లపై ఉన్న షటర్లు, షాపుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్లపై డివైడర్లను తొలగించారు. వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పాతబస్తీలోని ఓ హోటల్లో.. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షం, గాలుల నేపథ్యంలో సంస్థ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సీఎండీ జి.రఘుమారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలుల నేపథ్యంలో చెట్ల కొమ్మలు కూలి విద్యుత్ లైన్స్, స్తంభాలు విరిగే అవకాశమున్నందున క్షేత్ర స్థాయి సిబ్బంది విధిగా పెట్రోలింగ్ చేయాలని ఆదేశించారు. రాత్రంతా భారీ వర్షం..గాలులు వీచే అవకాశమున్నందున ఎఫ్ఓసీ, సీబీడీ సిబ్బంది సబ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. రాంగోపాల్‌పేట నల్లగుట్టలో నీట మునిగిన కాలనీ విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షం, గాలుల నేపథ్యంలో సంస్థ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సీఎండీ జి.రఘుమారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలుల నేపథ్యంలో చెట్ల కొమ్మలు కూలి విద్యుత్ లైన్స్, స్తంభాలు విరిగే అవకాశమున్నందున క్షేత్ర స్థాయి సిబ్బంది విధిగా పెట్రోలింగ్ చేయాలని ఆదేశించారు. రాత్రంతా భారీ వర్షం..గాలులు వీచే అవకాశమున్నందున ఎఫ్ఓసీ, సీబీడీ సిబ్బంది సబ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. రాణిగంజ్‌లో.. పాతబస్తీ అతలాకుతలం చార్మినార్: పాతబస్తీలో గంటన్నరపాటు దంచికొట్టిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన పడ్డారు. చారి్మనార్, మీరాలం మండి, మదీనా, పత్తర్ గట్టి, పురానాపూల్ తదితర ప్రాంతాల నుంచి సైదాబాద్, మలక్‌పేట, సంతోష్ నగర్, డబీర్ పురా, చంచల్ గూడ, ఈదిబజార్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ రైల్వే అండర్‌బ్రిడ్జి పూర్తిగా వరదనీటిలో మునిగిపోవడంతో రోడ్లపైనే గంటల తరబడి వాహనదారులు నిలిచిపోయారు. చాంద్రాయణగుట్ట, జంగమ్మెట్, చత్రినాక, పటేల్ నగర్, శివాజీ నగర్, శివగంగా నగర్ తదితర ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దాదాపు మొదటి అంతస్తు మునిగేంత వరకు వరద నీరు చేరింది.