బల్తార్: జమ్మూ కశ్మీర్ బల్తార్లో భారీ వర్షాలు, వరదలకు ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో 9 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 13 ఏళ్ల బాలిక, 12 ఏళ్ల బాలుడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో 11 మంది అచూకీ లభించాల్సి ఉందని చెప్పారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ప్రారంభించామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు శ్రీనగర్-లడక్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. అమర్నాథ్ యాత్రికులు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే అమర్నాథ్కు వెళ్తున్న 780 మంది యాత్రకులని ఆర్మీక్యాంపుకు తరలించామని చెప్పారు.
జమ్ముకశ్మీర్లో వరదలు: ఇద్దరి మృతి
Published Sat, Jul 25 2015 7:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM
Advertisement
Advertisement