భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడి.. 13 మంది మృతి | Flash floods and landslides in Bosnia several deceased | Sakshi
Sakshi News home page

భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడి.. 13 మంది మృతి

Published Sun, Oct 6 2024 5:14 PM | Last Updated on Sun, Oct 6 2024 5:14 PM

Flash floods and landslides in Bosnia several deceased

యూరోపియన్‌ దేశమైన బోస్నియా-హెర్జెగోవినాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణగంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు, కొండచరియలు విరిగినపడిన ఘటనలో 13 మంది మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి బోస్నియాకు రెస్క్యూ బృందాలు చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

 

ఈ ఘటనలో శిథిలాలల కింది చిక్కుకున్న ప్రజలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కోనసాగిస్తున్నాయి. కనీసం 10 మంది వ్యక్తుల ఆచూకీ తెలియలేదని, మృతిచెందిన వారిలో చాలా మంది దక్షిణ బోస్నియాలోని డోంజా జబ్లానికా గ్రామంలో ఉన్నారని అధికారులు తెలిపారు.

 

‘‘జబ్లానికా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో వరదలు పోటెత్తాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ’ అని ప్రభుత్వ అధికారి డార్కో జుకా తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement