మాడ్రిడ్ : భారీ వర్షానికి ఆకస్మికంగా సంభవించిన వరదలు స్పెయిన్ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా భారీ సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయిలయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.
ఓ వైపు వర్షం.. మరోవైపు వరద ధాటికి లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారి జాడ కోసం బాధిత కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. బురద నీరు ముంచెత్తడంతో రైలు, విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది.
దీంతో స్పెయిన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రమాదంలో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సాయంతో బాధితుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. తాజాగా, పదుల సంఖ్యలో మృతదేహాల్ని గుర్తించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఆకస్మిక వరదలపై ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ దేశ ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా ఇతర అన్నీ రంగాలకు చెందిన కార్యకలాపాల్ని గురువారం వరకు మూసివేయాలని ఆదేశించారు. ఇక వరద ప్రభావాన్ని అంచనా వేసేలా కేంద్ర క్రైసిస్ కమిటీ ఉన్నతాధికారులకు ప్రధాని అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment