
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రానున్న ఆరు గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో నాలుగు రెడ్ అలర్ట్‌లను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రేపు మధ్యాహ్ననికి పుదుచ్చేరి వద్ద తుపాను తీరాన్ని తాకనుంది. రెండు రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాముందన్న వాతావరణ శాఖ.. దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, రాష్ట్రంలో మిగతా పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.

Comments
Please login to add a commentAdd a comment