
షిల్లాంగ్:మేఘాలయలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. భారీ వర్షాల ప్రభావంతో ఒక్కసారిగా సౌత్‌గారో హిల్స్ జిల్లాలో వరదలు వచ్చాయి. కేవలం 24 గంటలపాటు కురిసిన వర్షాలకే వరదలు రావడంతో ప్రాణనష్టం జరిగింది.వరదల వల్ల సౌత్‌గారో హిల్స్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి.
కొండ చరియలు విరిగిపడడంతో మొత్తం 10 మంది మరణించారు. ఒకే కుంటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమీక్ష నిర్వహించారు.ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేశారు.ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ఇదీ చదవండి: ఆహారంలో బల్లి..50 మందికి అస్వస్థత