
భారీ వర్షాలతో ఎయిర్‌పోర్ట్ మూసివేత
అహ్మదాబాద్ : గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. వదోదరలో వరద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. వదోదర రైల్వే స్టేషన్‌ను మూసివేయడంతో 22కి పైగా రైళ్లు రద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించే ప్రక్రియలో సహకరిస్తున్నారు.
వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. అహ్మదబాద్, సూరత్ సహా మధ్య గుజరాత్‌లో భారీ వర్షాలతో సాధారణ జనజీవనం స్థంభించింది. మరో 48 గంటలు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుజరాత్‌లో వరదల పరిస్థితిపై సీఎం విజయ్ రూపాని అధికారులతో సమీక్షించారు.