
పాక్‌లో ఆకస్మిక వర్షాలు: 71 మంది మృతి
ఉత్తర పాకిస్తాన్‌లో కురుస్తున్న ఆకస్మిక వర్షాలకు 71 మంది మృతి చెందారు. భారీగా కురుస్తున్న వర్షాలతో వరదలు ముంచెత్తాయి. వేలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసివేశారు.
'కోహిస్తాన్‌లో కొండచరియలు విరిగిపడడంతో 30 మంది అక్కడే చిక్కుకున్నారు. వీరిని రక్షించడానికి హెలికాప్టర్‌ను పంపినట్టు' విపత్తు నిర్వహణ అధికారి యూసుఫ్ జియా తెలిపారు.