మళ్లీ చార్‌ధామ్ యాత్ర... | ircumstances the trip again ... | Sakshi
Sakshi News home page

మళ్లీ చార్‌ధామ్ యాత్ర...

Published Fri, Mar 21 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

మళ్లీ చార్‌ధామ్ యాత్ర...

మళ్లీ చార్‌ధామ్ యాత్ర...

 గత ఏడాది ఆకస్మిక వరదలు సృష్టించిన బీభత్సం నుంచి ఉత్తరాఖండ్ క్రమంగా తేరుకుంటోంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్ర పర్యటన అయిన చార్‌ధామ్ యాత్రను ఆ రాష్ట్ర పర్యాటకశాఖ పునఃప్రారంభించింది. ఈ ఏడాది మే 2న గంగోత్రి, యమునోత్రి, 4న కేదారనాథ్, 5న బదరీనాథ్‌లలో భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.


యాత్రికుల సౌకర్యార్థం యాత్రామార్గంలో ప్రతి 10-20 కి.మీ పరిధిలో సంచార హెల్త్ యూనిట్స్ ప్రారంభిస్తున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ టవర్స్‌ను ఏర్పాటు చేసి, మొబైల్ ఫోన్ సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తున్నారు. అత్యవసర హెలికాప్టర్ సేవలను ప్రయాణమార్గంలో యాత్రికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఏడాది 50 లక్షల నుంచి కోటి మంది దాకా చార్‌ధామ్ యాత్ర చేస్తారని అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement