మంగళ వాయిద్యాల నడుమ మధ్య బద్రీనాథ్ తలుపులు ఈరోజు(ఆదివారం) తెరుచుకున్నాయి. ఇకపై భక్తులకు బద్రివిశాల్ స్వామి ఆరు నెలల పాటు దర్శనమివ్వనున్నాడు. బద్రీనాథ్ తలుపులు తెరిచే సమయానికి దాదాపు పది వేల మంది భక్తులు ధామ్ ముందు బారులు తీరారు. అఖండ జ్యోతి దర్శనం కోసం 20 వేల మంది యాత్రికులు నేటి సాయంత్రం నాటికి బద్రీనాథ్ చేరుకునే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రకు ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి ధామ్ నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా బద్రీనాథ్ ధామ్‌కు చేరుకుంటుంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆలయాల తలుపులు మే 10న తెరుచుకున్నాయి. బద్రీనాథ్ పుష్ప సేవా సమితి ధామ్‌ను 15 క్వింటాళ్ల బంతి పూలతో అలంకరించింది. ధామ్‌లోని పురాతన మఠాలు, దేవాలయాలను కూడా అందంగా అలంకరించారు.
బద్రీనాథ్ ధామ్‌లో పాలిథిన్ వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడి వ్యాపారులు పాలిథిన్ కవర్లను వినియోగించరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయంలో పూజలు ప్రారంభమైనట్లు బీకేటీసీ మీడియా ఇన్‌ఛార్జ్ డాక్టర్ హరీశ్‌గౌడ్ తెలిపారు. ముందుగా లక్ష్మీ అమ్మవారిని గర్భగుడి నుండి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించాక, ధామ్‌లో ఆశీనురాలిని చేయించారు. బద్రివిశాల్ స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం.. చతుర్భుజుడైన స్వామివారికి నెయ్యితో అలంకారం చేశారు. ఆరు గంటలకు భక్తుల సందర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు.
#WATCH | Chamoli, Uttrakhand: The doors of Shri Badrinath Dham were opened for the devotees today at 6 am amidst the melodious tunes of the Army Band, with complete rituals, Vedic chanting and slogans of 'Badri Vishal Lal Ki Jai'. pic.twitter.com/lPSCXxKfvx
— ANI (@ANI) May 12, 2024
Comments
Please login to add a commentAdd a comment