
సాక్షి,తెర్లాం(విజయనగర): అమర్‌నాథ్‌లోని శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన తను క్షేమంగానే ఉన్నానని, భయపడవద్దంటూ తెర్లాం గ్రామానికి చెందిన కోల శ్రీనివాసరావు మంగళవారం ఫోన్‌లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కొద్దిరోజుల కిందట ఆయన అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాడు. అక్కడ కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లి సుమారు 18 మంది దుర్మరణం పాలయ్యారు.
ఈ వార్తలు టీవీల్లో ప్రచారం కావడంతో శ్రీనివాసరావు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అమర్‌నాథ్‌లో క్షేమంగానే ఉన్నట్టు తన ఫొటోను వాట్సప్‌లో పంపించడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటివరకు 9 సార్లు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి మహా శివలింగాన్ని దర్శించుకున్నట్టు ఆయన ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు.