షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని మణికరణ్‌లో బుధవారం చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్‌బస్ట్ అయ్యింది. చోజ్ గ్రామంలో క్లౌడ్‌బస్ట్ కావడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి, దీంతో ఆ పరిసరాల్లోని గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ఘటనలో నలుగురు గల్లంతు అయినట్లు కులు ఎస్పీ గురుదేవ్ చాంద్ శర్మ తెలిపారు.
పార్వతి నదిలో అకస్మాత్తుగా వరద పెరగడంతో సమీపంలో ఉన్న క్యాంపు సైట్లన్నీ ఆ ధాటికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొందరు యాత్రికులు కూడా కొట్టుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా దీనిపై స్పష్టత రావ్వాల్సి ఉంది. వరద ధాటికి పార్వతి నదిపై ఉన్న వంతెన కూడా ధ్వంసం అయ్యింది. నది సమీపంలో ఉన్న పలు షాపులు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన వారి కోసం అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment