
సాక్షి, హైదరాబాద్: ఏకధాటిగా మూడు గంటల పాటు కురిసిన వర్షానికి జంట నగరాలు చిగురుటాకులా వణికాయి. గురువారం రాత్రి కుండపోత వానకు రహదారులు గోదారిని తలపించాయి. పలు ప్రాంతాల్లో మోకాలి లోతున నీళ్లు ప్రవహించాయి. ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిపోయా యి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయా యి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాం తాలు నీటమునిగాయి. తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మూడు రోజులు వర్షాలే..
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)