
సాక్షి, హైదరాబాద్: నగరంలో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా జోరుగా వాన పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమీర్‌పేట, కొండాపూర్, కొత్తగూడ, మియాపూర్, బోరబండ, శేరిలింల్లి, పటాన్‌చెరు, ఎర్రగడ్డ తదితర ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. మరోవైపు..
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలోనూ వాన దంచికొట్టింది. వాన, నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో.. నవంబర్ 1వ తేదీ దాకా తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment