weather reporting
-
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం
సాక్షి, హైదరాబాద్: నగరంలో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా జోరుగా వాన పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమీర్‌పేట, కొండాపూర్, కొత్తగూడ, మియాపూర్, బోరబండ, శేరిలింల్లి, పటాన్చెరు, ఎర్రగడ్డ తదితర ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. మరోవైపు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలోనూ వాన దంచికొట్టింది. వాన, నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో.. నవంబర్ 1వ తేదీ దాకా తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది. -
26న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/నెట్వర్క్: దక్షిణ మరట్వాడా నుంచి దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోపక్క ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి ఉత్తర కర్ణాటక వరకు విదర్భ, మరట్వాడా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఈనెల 26న శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం రాత్రి వెల్లడించింది. ఇది 24 గంటల తర్వాత బలపడి వాయుగుండంగా మారవచ్చని తెలిపింది. మరోవైపు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు సోమవారం కూడా కొనసాగనున్నాయి. కోస్తాంధ్రపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడతాయని వివరించింది. సాధారణ ఉష్ణోగ్రతలే.. ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. కొన్ని రోజులుగా సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా, ఆదివారం అనేక చోట్ల దాదాపు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు, అనంతపురంలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గడచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 11 సెం.మీల భారీ వర్షం కురిసింది. శృంగవరపుకోటలో 6, మెరకముడిదాంలో 5, బొబ్బిలి, సీతానగరం, పొదిలిల్లో 4, రాచెర్ల, కోడూరు, రోళ్ల, బద్వేలుల్లో 3, విశాఖపట్నం, ఉదయగిరి, సాలూరు, పాకాలల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అరటి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మాతుమూరు, కర్రివలస, పద్మాపురం, కేసలి, గురివినాయుడుపేట తదితర ప్రాంతాల్లో మామిడిపంట దెబ్బతింది. కొత్తూరులో పిడుగు పడి ఒకరు మృతి చెందారు. -
ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు ‘టిట్లీ’ తుఫాన్!
-
ఓడల్లోనూ వాతావరణ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులపై ‘భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం(ఇన్కాయిస్)’ అందించే సమాచారం తమకు ఎంతగానో దోహదపడుతోందని షిప్పింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ అరుణ్‌కుమార్ గుప్తా అన్నారు. మంగళవారం ఇన్ కాయిస్‌లో ఏర్పాటు చేసిన యూజర్ ఇంటరాక్షన్ వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుపాను, సునామీ, ఫిషింగ్, కోస్ట్‌గార్డ్ త దితర అంశాలపై సంబంధిత వర్గాలకు ఇన్కాయిస్ అందిస్తున్న సమాచారం ఎలా ఉపయోగపడుతోంది, ఆయా వర్గాల వారు ఇంకా ఎలాంటి సమాచారం కోరుకుంటున్నారన్న దానిపై వర్క్‌షాప్‌లో చర్చించారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ.. సముద్ర మార్గాల్లో పరిస్థితుల సమాచారాన్ని ‘ఇన్కాయిస్’ తెలుసుకునేందుకు వీలుగా ఓడలపై ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐకార్ డిప్యూటి డెరైక్టర్ జనరల్ మీనాకుమారి, ఇన్కాయిస్ డెరైక్టర్ షెనాయ్ తదితరులు పాల్గొన్నారు.