
హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఫిల్మ్‌నగర్, శేరిలింగంపల్లి, నిజాంపేట్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, ప్యారడైస్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకపూల్, వర్షం దంచికొట్టింది.
వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరడంతో ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.