ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో భారీ వర్షాల కారణంగా ఘోర విపత్తు సంభవించింది. ఈ ఘటన జరిగి 18 రోజులు దాటినా ఈ విపత్తులో చిక్కుకున్న 17 మంది జాడ ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్‌కు ఇప్పటి వరకూ ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఆరు మృతదేహాలను గుర్తించారు. కాగా ఈ విపత్తులో 23 మంది గల్లంతైనట్లు సోన్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
నేటికీ ఆచూకీ తెలియని 17 మందిలో యాత్రికులతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. వీరి ఆచూకీ కోసం గౌరీకుండ్-కేదార్‌నాథ్ కాలినడక మార్గంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూలై 31న రాత్రి భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ నడక మార్గం రాళ్లతో మూసుకుపోయింది. ఈ సమయంలో చాలా మంది ఆ రహదారిలో చిక్కుకుపోయారు. నాటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజాగా లించోలిలో శిథిలాలు, రాళ్ల కింద ముగ్గురు మృతదేహాలను కనుగొన్నారు. వీరిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నివాసితులు సుమిత్ శుక్లా (21), చిరాగ్ గుప్తా (20), న్యూ మాండ్లోయ్ నివాసి నిఖిల్ సింగ్ (20)గా గుర్తించారు. ఈ మృతదేహాలకు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment