ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, దాని మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో బీజేపీ ఏకంగా 42 స్థానాల్లో గెలపొందింది. ఇంకా నాలుగు స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 50 స్థానాల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి అయ్యాయి. బీజేపీ గెలుపుతో పెమా ఖండూ మూడోసారి ముఖ్యమంత్రి కానున్నారు.
ఇప్పటికే 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అందులో ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఉన్నారు. మిగతావారిలో డిప్యూటీ ముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఇటానగర్ నుండి టెకీ కాసో, తాలిహా నుండి న్యాతో దుకమ్, రోయింగ్ నుంచి ముచ్చు మితితో పాటు పలువురు ఉన్నారు.
ఇక.. 2019లో 41 సీట్లు గెలుచుకున్న బీజేపీ మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో తమ అభ్యర్థులను ఇక్కడ బరిలో నిలిపింది.
Comments
Please login to add a commentAdd a comment