Arunachal pradesh Assembly
-
అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, దాని మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో బీజేపీ ఏకంగా 42 స్థానాల్లో గెలపొందింది. ఇంకా నాలుగు స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 50 స్థానాల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి అయ్యాయి. బీజేపీ గెలుపుతో పెమా ఖండూ మూడోసారి ముఖ్యమంత్రి కానున్నారు.ఇప్పటికే 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అందులో ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఉన్నారు. మిగతావారిలో డిప్యూటీ ముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఇటానగర్ నుండి టెకీ కాసో, తాలిహా నుండి న్యాతో దుకమ్, రోయింగ్ నుంచి ముచ్చు మితితో పాటు పలువురు ఉన్నారు. ఇక.. 2019లో 41 సీట్లు గెలుచుకున్న బీజేపీ మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో తమ అభ్యర్థులను ఇక్కడ బరిలో నిలిపింది. -
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: 44 సీట్లలో బీజేపీ విజయం
Counting Updates అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయంఅరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 44 సీట్లలో విజయం2 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లలో గెలుపు10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమేజిక్ ఫిగర్ స్థానాలు 30పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 సీట్లలో గెలుపునేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1 స్థానం గెలుపు , 2 ముందంజ ఇండిపెండెంట్లు 3 గెలుపు సిక్కింలో అధికార కాంత్రికారి మోర్చా ఘన విజయంసిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ 26 సీట్లలో విజయం5 స్థానాల్లో సీకేఎం లీడింగ్మేజిక్ ఫిగర్ 17 సీట్లుసిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1 స్థానం గెలుపుసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ ప్రేమ్ సింగ్ తమంగ్ రెనోక్ స్థానంలో 7044 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ దూసుకుపోతోంది11 సీట్లలో సీకేఎం పార్టీ విజయం20 స్థానాల్లో సీకేఎం లీడింగ్‌సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక్కస్థానంలో లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది26 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీనేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 18 సీట్లలో విజయం సాధించింది28 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజపీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 స్థానాల్లో లీడింగ్10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీ#WATCH | Celebration begins at the BJP office in Itanagar as the party is set to return to power in Arunachal Pradesh The ruling BJP crossed the halfway mark; won 17 seats leading on 29. National People's Party is leading on 6 seats. The majority mark in the State Assembly is… pic.twitter.com/GEEfXggrEO— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిసిక్కిం క్రాంతికారి మోర్చా రెండు స్థానాల్లో గెలుపు29 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానంలో లీడింగ్‌లో ఉంది.#WATCH | Sikkim: Pintso Namgyal Lepcha from the Sikkim Krantikari Morcha (SKM) wins from the Djongu Assembly constituency He says, "I thank all the voters who supported me and made me win with a huge margin. I also thank my party president who gave me the ticket..." pic.twitter.com/BHVMQJvwB2— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ తమంగ్ గోలే.. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమంగ్ గోలే భార్య కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్‌లో ముందంజలో ఉన్నారు.Sikkim CM and Sikkim Krantikari Morcha (SKM) chief Prem Singh Tamang, who is contesting the Assembly elections from Rhenock and Soreng-Chakung seats, is leading on both the seats.SKM crossed the halfway mark; leading on 29 seats. The majority mark in the Sikkim Assembly is 17… pic.twitter.com/1NIYCEmihZ— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న కమలం10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమిగిలిన 50 స్థానాల్లో 29 చోట్ల కమలం హవామొత్తం 39 సీట్లలో బీజేపీ ఆధిక్యం8 చోట్ల లీడింగ్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకాంగ్రెస్ ఒకచోట మాత్రమే ఆధిక్యంసిక్కింలో మరోసారి అధికారం దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చాఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కింలో క్లీన్ స్వీప్ చేసే దిశగా క్రాంతికారి మోర్చా పార్టీమొత్తం 32 సీట్లకుగాను 29 స్థానాల్లో ఎస్కేఎం ఆధిక్యంఒక స్థానంలో ఎస్ డీఎఫ్ లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్‌నేషల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్ ఫిగర్ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) 8 సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్‌ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో లీడింగ్‌ఇండిపెండెంట్ ఒక స్థానంలో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎస్‌కేఏం భారీ లీడింగ్‌లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒక స్థానంలో లీడింల్ ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో కౌంటింగ్ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) 2 సీట్లలో లీడింగ్‌లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్‌లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్‌కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్‌కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు. -
అసెంబ్లీ ఎన్నికలు: ఆ రెండు రాష్ట్రాల కౌంటింగ్ తేదీల్లో మార్పు
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసింది సీఈసీ. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ను సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కంటే రెండు రోజుల ముందే జూన్ 2వ తేదీన చేపట్టనున్న ఈసీ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ రెండో తేదీన ముగియనున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక.. ఏప్రిల్ 19న మొదటి విడతలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలో 32 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తాజా మార్పు ప్రకారం ఫలితాలు జూన్ రెండున వెల్లడికానున్నాయి. -
పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం
సాక్షి, న్యూఢిల్లీ: ఏడేళ్లుగా ఈశాన్యభారతంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తులో సాధించబోయే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈశాన్య భారతం పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తోందని, ఈ ప్రాంతాభివృద్ధిలో నవశకం ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రాంతంలో తిరుగుబాటు శక్తుల ప్రభావం తగ్గుతూ వస్తోందని ఆయన వెల్లడించారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. 2014 నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధితో పాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన అభినందించారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో చట్టసభల పనితీరును ప్రస్తావిస్తూ, పరిస్థితుల్లో మార్పు రావాలని, ప్రజల సమస్యలను ప్రస్తావించి, చర్చించి వాటికి పరిష్కారం సూచించే బదులు, అనవసర వాదులాటల ద్వారా సభా సమయాన్ని వ్యర్థం చేయడం సరికాదన్నారు. 2015–20 మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కనిష్టంగా ఒకరోజు, గరిష్టంగా ఆరు రోజులపాటు సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ధోరణి ఆందోళనకరమన్నారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాలన్నీ తమ సమావేశాల సమయాన్ని కాస్త పొడిగించుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. చట్టాల రూపకల్పనలో మహిళలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలన్నారు. ఈశాన్య భారతంలో మౌలిక సదుపాయాల కల్పన విస్తృతంగా జరుగుతోందని, తద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. 2014లో ప్రధానమంత్రి ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని తీసుకొచ్చే వరకూ ఈ ప్రాంతంలో ఆకాంక్షలకు, వాటిని పూర్తిచేయడానికి మధ్య స్పష్టమైన అంతరం ఉండేదన్నారు. అరుణా చల్ ప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలు ఇతర భాగస్వామ్య పక్షాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. -
దేశవ్యాప్తంగా 989 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
543 లోక్‌సభ స్థానాలకు దేశవ్యాప్తంగా 989 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభంకానుంది. దేశవ్యాప్తంగా 8,251 మంది లోక్‌సభ అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల కౌంటింగ్ కూడా ఉదయం 8.00 గంటలకే ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని చర్యలు చేపట్టింది. -
ప్రజా తీర్పు రేపే
* తేలనున్న పార్టీలు, నేతల భవితవ్యం * సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ * రేపు ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు * ఏపీలో 78 ప్రాంతాల్లో 168 లెక్కింపు కేంద్రాలు.. 6,955 టేబుళ్లు * ఒక్కో టేబుల్‌కు ఒక్కో సూక్ష్మ పరిశీలకుడు న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దేశంలో తొలిసారి అత్యంత సుదీర్ఘంగా తొమ్మిది దశలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో ఎవరు విజేతలో... ఎవరు పరాజితులో మరో 24 గంటల్లో తేలిపోనుంది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం మధ్యాహ్నానికి తేలిపోనుంది. రాష్ట్రం ఇంకా రెండుగా విడిపోన ప్పటికీ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో తెలంగాణ జిల్లాలో ఏప్రిల్ 30న, సీమాంధ్ర జిల్లాల్లో మే 7న వేర్వేరుగా పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా రెండు రాష్ట్రాలు విడిపోతాయని తెలిసిన తరువాత విడిపోకముందే పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై రాజకీయ పార్టీలతో పాటు.. ఆయా పార్టీల అధినేతలు, అభ్యర్థులు, ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్కంఠకు శుక్రవారం ఉదయం 10 గంటల తరువాత తెరపడనుంది. ఉదయం 10 గంటల కల్లా ఏ పార్టీ అభ్యర్థులు మెజారిటీలో ఉన్నారనే విషయం వెల్లడికానుంది. స్థానిక ఫలితాలతో తారస్థాయికి ఉత్కంఠ... ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు మొత్తం 4,508 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు 265 మంది, 119 అసెంబ్లీ స్థానాలకు 1,669 మంది అభర్థులు పోటీపడ్డారు. సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాలకు 333 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,241 మంది పోటీపడ్డారు. తెలంగాణలో 72 శాతం మంది ఓటర్లు, సీమాంధ్రలో 76.80 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొని రాజకీయ నేతల భవిష్యత్‌పై తీ ర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఎలా ఉంటుందనేది ఇటు పార్టీలు, వాటి అభ్యర్థులతో పాటు.. అటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గత మూడు రోజులుగా ఈ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఇందుకు ప్రధాన కారణం.. సార్వత్రిక ఎన్నికల కన్నా ముందు జరిగిన మునిసిపల్, పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడటమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీమాంధ్రలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అనే తరహాలో నిలిచారు. తెలంగాణలో కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలిచారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది రాష్ట్రమంతటా రెండు ప్రాంతాల్లోనూ ప్రధాన చర్చనీయాశంగా మారింది. ఈ ఉత్కంఠకు శుక్రవారం తెరపడనుంది. 168 కేంద్రాల్లో లెక్కింపు... శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లోక్‌సభ స్థానాలతో పాటు ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలకు ఒకే ప్రాంతంలో ఓట్ల లెక్కింపుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 78 ప్రాంతాల్లో 168 కేంద్రాల్లో 437 హాళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందుకోసం 6,955 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక్కో సూక్ష్మ పరిశీలకుడిని నియమించనున్నారు. అలాగే అభ్యర్థుల ఏజెంట్లను కూడా అనుమతిస్తారు. 18 సంవత్సరాలు నిండిన వారినెవరినైనా అభ్యర్థులు ఏజెంట్‌గా నియమించుకోవచ్చు. స్థానికులే ఉండాలనే నిబంధన ఏదీ లేదు. పోలీసు భద్రత కలిగిన అభ్యర్థులను భద్రతా వలయంతో లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లనీయరు. భద్రతా సిబ్బందిని సరెండర్ చేస్తేనే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోని వారిని ఏజెంట్లగా అనుమతించరు. ప్రభుత్వ ఉద్యోగులను ఏజెంట్లుగా నియమించకూడదు. -
అరుణాచల్ అసెంబ్లీ రద్దు
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ నిర్భయ్ శర్మ గురువారం రాత్రి రద్దు చేశారు. వచ్చేనెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలతోపాటే అరుణాచల్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఆ రాష్ట్ర కేబినెట్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం నబం టుకీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసింది. దీంతో గవర్నర్.. అరుణాచల్ అసెంబ్లీని రద్దు చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమేశ్ నెగీ తెలిపారు. లోక్‌సభతోపాటే అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల వ్యయం తగ్గుతుందని కేబినెట్ అభిప్రాయపడినట్టు చెప్పారు. అరుణాచల్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి.