
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసింది సీఈసీ.
ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ను సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కంటే రెండు రోజుల ముందే జూన్ 2వ తేదీన చేపట్టనున్న ఈసీ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ రెండో తేదీన ముగియనున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక.. ఏప్రిల్ 19న మొదటి విడతలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలో 32 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తాజా మార్పు ప్రకారం ఫలితాలు జూన్ రెండున వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment