నేనే అడిగా.. అది చెప్పేందుకు సిగ్గుపడటం లేదు! | Taapsee Pannu on Kangana being offered Saand Ki Aankh | Sakshi

నేనే అడిగా.. అది చెప్పేందుకు సిగ్గుపడటం లేదు!

Oct 12 2019 6:27 PM | Updated on Oct 13 2019 12:41 PM

Taapsee Pannu on Kangana being offered Saand Ki Aankh - Sakshi

ముంబై: బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌కి, తాప్సీ పన్నుకి మధ్య ఏదో గొడవ ఉండనే ఉంటుంది. తాప్సీ గురించి కంగనా నేరుగా విమర్శించింది లేదు. కానీ, కంగనా సోదరి రంగోళీ చందేల్‌ పలు సందర్భాల్లో తాప్సీని టార్గెట్‌ చేసింది. ఇటీవల తాప్సీకి కంగనా సిస్టర్స్‌కి మధ్య మళ్లీ తగువు స్టార్ట్‌ అయింది. తాప్సీ.. భూమీ పడ్నేకర్‌తో కలిసి ‘సాండ్‌కి ఆంఖ్‌’ అనే సినిమాలో నటిస్తోంది. 60 ఏళ్లకు పైబడిన బామ్మలు షూటింగ్‌లో రాణించిన నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తాప్సీ పోషించిన పాత్ర మొదట కంగనాకు వచ్చిందట. అయితే, వృద్ధురాలైన ఆ పాత్రకు తగిన వయస్సు గల నటిని ఎంచుకుంటే బాగుంటుందని మేకర్స్‌కి కంగనా సూచించిందట. ఈ విషయాన్ని రంగోళీ వెల్లడించారు. కంగనా తిరస్కరించిన పాత్రను చేస్తూ.. తాప్సీ తెగ పోజులు కొడుతోందని రంగోళీ ఎద్దేవా చేసింది.

రంగోళీ వ్యాఖ్యలపై ఎట్టకేలకు తాప్సీ స్పందించింది. పింక్‌విల్లా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘చిత్ర దర్శకనిర్మాతలు కంగనా వద్దకు వెళ్లి ఉంటారు. నిజానికి ఈ పాత్ర కోసం వారు సగం ఇండస్ట్రీని గాలించారు. వింతవింత కారణాలతో చాలామంది ఈ పాత్రను తిరస్కరించారు. ఈ పాత్ర గురించి వారు నన్ను ఎప్పుడూ సంప్రదించలేదు. ఇలా సినిమా ప్లాన్‌ చేస్తున్నారని తెలిసి.. నేనే స్వయంగా వారిని సంప్రదించాను. దీనిని అంగీకరించేందుకు నేనేమాత్రం సిగ్గుపడటం లేదు. నేను ఆ పాత్ర చేస్తానని చెప్పాను. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రను వెతికేందుకు వారికి ఇంకోరెండేళ్లు పట్టింది’ అని వివరించింది. ఇక, 60 ఏళ్ల వయస్సు పాత్రలను వయస్సు పైబడిన వారు మాత్రమే చేయాలంటే తాను నటనను మానేస్తానని, విభిన్నమైన పాత్రలను చేయకుంటే తనను యాక్టర్‌ అని అనడంలో అర్థమేముంటుందని రంగోళీ విమర్శలపై తాప్సీ ఘాటుగా బదులిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement