ఆమె డీఎన్‌ఏలోనే విషం ఉండొచ్చు: తాప్సీ | Taapsee Pannu Hits Out At Kangana Ranaut Over Its In Her DNA To Be Toxic | Sakshi
Sakshi News home page

ఆమె డీఎన్‌ఏలోనే విషం ఉండొచ్చు: తాప్సీ

Published Thu, Feb 4 2021 9:01 PM | Last Updated on Thu, Feb 4 2021 9:30 PM

Taapsee Pannu Hits Out At Kangana Ranaut Over Its In Her DNA To Be Toxic - Sakshi

ముంబై: బాలీవుడ్ హీరోయిన్స్‌ కంగనా రనౌత్, తాప్సీ పన్ను మరోసారి ట్విటర్‌ వేదికగా ఒకరినొకరూ దాడి చేసుకున్నారు. గతంలో ఫైర్‌ బ్రాండ్‌ కంగనా తాప్సీని బీ గ్రేడ్‌ నటి అని ఫ్రీలోడర్(ఇతరుల నుంచి ఉచితంగా అవసరాలు తీర్చుకునే వారు)‌ అంటూ పిలవడంతో తాప్పీ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రైతుల నిరసనలపై అంతర్జాతీయ పాప్‌ సింగర్‌ రెహన్నే చేసిన ట్వీట్‌ నేపథ్యంలో మరోసారి వీరిద్దరూ మాటల యుద్ధానికి దిగారు.

కాగా రెహన్నే ‘దీనిపై మనం ఎందుకు మాట్లాడకూడదు’ అంటూ రైతుల నిరసపై ట్వీట్‌ చేయగా.. కంగనా పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన ఉన్నప్పుడే స్పందించాలని సమాధానం ఇచ్చారు. అయితే రెహన్నేకు కొంతమంది మాత్రం మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో గురువారం తాప్సీ కూడా స్పందిస్తూ ‘ఒక ట్వీట్‌ మీ ఐక్యతను దెబ్బతీస్తే.. ఒక జోక్‌ మీ విశ్వాసాన్ని కదలిచింది లేదా మీ మత విశ్వాసాన్ని ఎత్తిచూపింది. ఇక మీ విలువలను, వ్యవస్థను బలపరిచేందుకు మీ పని మీరు చేయాల్సి ఉంటుంది తప్పా ఇతరులకు పాఠాలు నేర్పడానికి టీచర్‌గా మారోద్దు’ అంటూ ట్వీట్‌ చేశారు. (చదవండి: రిహన్నా ట్వీట్‌.. గూగుల్‌లో ఏం సెర్చ్‌ చేశారంటే?)

ఇక తాప్సీ ట్వీట్‌పై కంగనా స్పందిస్తూ ‘బీ గ్రేడ్‌ మనుషులకు బీ గ్రేడ్‌ ఆలోచనలే వస్తాయి. ఒకరి విశ్వాసం అనేది మాతృభూమి, కుటుంబం కోసం నిలబడాలి. ఇది కర్మ లేక ధర్మమో కానీ ఉచిత సలహాలను వినకండి. వాటి వల్ల దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకే  నేను వారిని బి గ్రేడ్ అని పిలుస్తాను’ అంటూ కంగనా, తాప్సీ ట్వీట్‌పై వ్యంగ్యంగా స్పందించారు. అయితే పరోక్షం‍గా వీరిద్దరూ ఒకరిపై ఒకరూ చేసుకంటున్న వ్యాఖ్యలపై ట్వీటర్‌ యూజర్‌ స్పందింస్తూ వారి ట్వీట్‌ స్కీన్‌ షాట్‌ చేశాడు. వారిద్దరి ట్వీట్స్‌ను షేర్‌ చేస్తూ..  తాప్సీ ట్వీట్‌ నిజంగానే ఒకరిని కదిలించినట్లు ఉంది. అయితే ఇవి అంతగా విషపూరితంగా.. వివాస్పదంగా లేకపోతే ఇది సరదాగా ఉండేది’ అంటూ రీట్వీట్‌ చేశాడు. అతడి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తాప్సీ.. ‘అయితే ఆ విషం ప్రాథమికంగా వారి డీఎన్‌ఏలోనే ఉండోచ్చు లేదా ఆర్‌ఎన్‌ఏ?.. ప్లేట్‌లెట్స్‌పై కూడా’ అంటూ రాసుకొచ్చారు. (చదవండి: కంగనాకు ట్విటర్‌ మరోసారి షాక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement