Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బాండ్ కంగనా రనౌత్, మరో హీరోయిన్ తాప్సీ మధ్య గత కొద్ది రోజలుగా సోషల్ మీడియా వార్ జరుగుతోంది. ఈ ఇద్దర మధ్య మాటల యుద్దం ఇప్పట్లో తగ్గేలా లేదు. ‘హసీనా దిల్‌రుబా’మూవీ ప్రమోషన్‌లో భాగంగా ‘కంగనకు తన జీవితంలో ఎలాంటి ప్రాధాన్యం లేదు’ అని తాప్సీ చేసిన వ్యాఖ్యలపై కంగనా ఫైర్ అయ్యారు. తాప్సి లాంటి వ్యక్తి తన గురించి కామెంట్ చెయ్యడమేంటి అంటూ ఎప్పటిలాగే తనదైన స్టైల్లో విరుచుకుపడింది. తాప్సీ బి గ్రేడ్ యాక్టర్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆమె గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘నేను వదిలేసిన ప్రాజెక్ట్‌ల్లో తనకి అవకాశం కల్పించమని తాప్సీ ఎంతో మంది నిర్మాతలను బతిమలాడుకుని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. చిన్నస్థాయి నిర్మాతలకు కంగనా రనౌత్‌లా మారినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని తాప్సీ ఒకానొక సమయంలో చెప్పారు. కానీ ఇప్పుడు, తన జీవితంలో నాకు ఎలాంటి ప్రాధాన్యం లేదు అంటున్నారు. మనుషుల కుళ్లు స్వభావానికి ఇదో నిదర్శనం. ఏది ఏమైనా తాప్సీ.. నీ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అలాగే, నా పేరు లేకుండా నీ సినిమా ప్రమోట్ చేసుకో’ అని కంగన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. మరి కంగనా కామెంట్స్‌పై తాప్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాప్సీపై కంగనా ఫైర్.. తన పేరు వాడొద్దంటూ చురకలు
Published Thu, Jul 1 2021 3:42 PM | Last Updated on Thu, Jul 1 2021 5:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment