‘ఓ సారి చెన్నై వెళ్లినప్పుడు నా స్నేహితుడి ద్వారా నిర్మాత సతీష్ పరిచయం అయ్యాడు. ఆయన తన కుమారుడు హమరేష్‌ని హీరోగా పెట్టి నిర్మించిన రంగోలి సినిమాను నాకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. సినిమా మొత్తం చూశాక క్లైమాక్స్ బాలేదని చెప్పేశాను. నేను చూసింది రఫ్ వెర్షన్ మాత్రమే. రెండు నెలల తర్వాత మళ్లీ తమిళ్ సినీ పెద్దలతో పాటు నాకు సినిమా చూపించాడు. ఆ తర్వాత స్టేజ్‌పై మాట్లాడుతూ.. తెలుగులో శివ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడని ఆయనే చెప్పాడు. అప్పటి వరకు నేను ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ సతీష్ నమ్మకంగా చెప్పడంతో.. నేను కూడా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నానని ప్రకటించాను. అలా నేను అనుకోకుండా సత్య సినిమాకు నిర్మాతను అయ్యాను’ అన్నారు జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల.
హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘రంగోలి’. ఈ చిత్రాన్ని సత్య పేరుతో శివ మల్లాల మే 10న తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగోలి టైటిల్ ఇక్కడ వేరే వాళ్లు బుక్ చేసుకోవడంతో ఈ చిత్రాన్ని తెలుగులో ‘సత్య’పేరుతో రిలీజ్ చేస్తున్నాను. ఆర్జీవీ తెరకెక్కించిన సత్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అలాగే సినిమా ప్రమోషన్స్‌కి కూడా కలిసొస్తుందనే ఉద్దేశంతో ఈ చిత్రానికి సత్య అనే టైటిల్‌ని పెట్టాం.
డబ్బింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అచ్చమైన తెలుగు సినిమాలాగే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. క్లైమాక్స్‌లో మార్పులు చేశాం. తెలుగు ఆడియన్స్‌కి నచ్చేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమాలో ఫాదర్స్ అండ్ సన్ రిలేషన్‌షిప్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నాను. ఇప్పటికే నాలుగు కథను విన్నాను. అన్ని కుదిరితే త్వరలోనే మరో సినిమాను నిర్మిస్తాను’ అని శివ మల్లాల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment