
వివాదాల నడుమ విడుదలైన మణికర్ణిక చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాపై ఇంత హైప్ క్రియెట్ కావడానికి వివాదాలు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. తొలుత ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం మణికర్ణిక వివాదంపై క్రిష్ స్పందించారు. హీరోయిన్ కంగనా రనౌత్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. తన పట్ల ఆమె చాలా దురుసుగా ప్రవర్తించిందని కూడా తెలిపారు క్రిష్. (‘మణికర్ణిక’ వివాదంపై స్పందించిన క్రిష్)
అయితే క్రిష్ చేసిన వ్యాఖ్యలపై కంగన సోదరి రంగోలి స్పందించారు. క్రిష్‌ను ఉద్దేశిస్తూ.. ‘డైరెక్టర్‌గారు.. సినిమా మొత్తం మీరే తీశారు. మేం ఒప్పుకుంటా. కానీ తెర మీద మొత్తం కంగనానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విజయాన్ని, ప్రశంసల్ని ఆమె ఆస్వాదిస్తుంది. తనను ఒంటరిగా వదిలేయండి. దయచేసి మీరు ప్రశాంతంగా ఆసీనులుకండం’టూ రంగోలి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. పత్రికలుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా 70 శాతం సినిమాను తానే డైరెక్ట్ చేసినట్లు చెప్పారు.
అయితే ఈ విషయాన్ని క్రిష్ ఖండించారు. కంగనా కేవలం 30 శాతం సినిమాను మాత్రమే తెరకెక్కించిందని తెలిపారు. ఒకరు చేసిన పనిని తనదిగా చెప్పుకుంటున్న ఆమెకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదని క్రిష్ వ్యాఖ్యానించారు. తాను తీసిన సన్నివేశాలనే మళ్లీ చిత్రీకరించి ఆమె పేరు వేసుకుందన్నారు.
@DirKrish chalo man liya you directed the whole film now please calm down, still Kangana is the leading face of the film let her enjoy this moment of her success and great appreciation, please leave her alone, we all believe you now please take a seat 🙏 https://t.co/rInLkrHreO
— Rangoli Chandel (@Rangoli_A) January 28, 2019
Comments
Please login to add a commentAdd a comment