contraversy
-
స్టార్ హీరోయిన్‌కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?
కొన్నిసార్లు ఊహించని విధంగా చిక్కులు ఎదురవుతుంటాయి. అలా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కి మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ విషయంలో చిన్న పదం ఉపయోగించినందుకుగానూ ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరో శింబు.. కమల్ హాసన్ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..)బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ అనుభవాలతో 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో ఓ పుస్తకం రాసింది. అయితే ఈ బుక్ టైటిల్లో 'బైబిల్' పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్ క్రిస్టోఫర్ ఆంథోని కోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ కరీనాకు నోటీసు జారీ చేసింది. ఆ పదం వాడటానికి గల కారణమేంటని ప్రశ్నించింది.కరీనా కపూర్‌పై కేసు కూడా నమోదు చేయాలని క్రిస్టోపర్ పిటిషన్ వేశారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. బుక్ టైటిల్లోని 'బైబిల్' పదం వల్ల క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆంథోనీ తన పిటీషన్లో పేర్కొన్నారు. క్రైస్తవులకు బైబిల్ అనేది పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చడం సరికాదు అని ఆయన చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఇదెక్కడి క్రేజ్ రా మావ) -
ఫిఫా చరిత్రలో మాయని మచ్చలా ఐదు వివాదాలు
ఫిఫా వరల్డ్‌కప్ 2022 ప్రారంభానికి మరొక రోజు మాత్రమే మిగిలింది. నవంబర్ 20 నుంచి మొదలుకానున్న సాకర్ సమరం డిసెంబర్ 18 వరకు జరగనుంది. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న సమరంలో ఫైనల్ మ్యాచ్‌కు లుసెయిల్ స్టేడియం వేదిక కానుంది. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో విజయాలు ఎన్ని ఉంటాయో వివాదాలు కూడా అన్నే ఉంటాయి. అన్ని గుర్తుండకపోయినా కొన్ని మాత్రం చరిత్రలో మిగిలిపోతాయి. అలా ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోయిన ఐదు వివాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్(Hand Of GOD Goal) 1986 ఫిఫా వరల్డ్‌కప్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అర్జెంటీనా విశ్వవిజేతగా నిలవడం. దీనితో పాటు డీగో మారడోనా అనే పేరు కూడా కచ్చితంగా వినిపిస్తుంది. అర్జెంటీనా విజేతగా నిలవడంతో మారడోనా పాత్ర ఎంత కీలకమో అతని హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. 1986 సాకర్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్ చేశాడు. అందులో ఒక గోల్‌ను చేతితో కొట్టడం అధికారులెవరు గుర్తించలేదు. తర్వాత మారడోనా కొట్టిన ఆ గోల్.. ''హ్యాండ్ ఆఫ్ గాడ్''(Hand OF GOD) గోల్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ గోల్ అప్పట్లో వివాదాస్పదమైంది.క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. అయితే మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. ఆ తర్వాత మారడోనా తన ఆటబయోగ్రఫీలో ''హ్యాండ్ ఆఫ్ గాడ్'' గురించి రాసుకొచ్చాడు. మాట్లాడిన ప్రతీసారి "హ్యాండ్ ఆఫ్ గాడ్" గోల్ అంటున్నారు.. కానీ ఆ చేయి మారడోనాది అన్న సంగతి మరిచిపోయినట్లున్నారని పేర్కొన్నాడు. ► జినదిన్ జిదానే(2006 ఫిఫా వరల్డ్‌కప్) ఫుట్‌బాల్ బతికున్నంత వరకు 2006లో ఫ్రాన్స్ ఆటగాడు జినదిన్ జిదానే చేసిన పని గుర్తిండిపోతుందనంలో అతిశయోక్తి లేదు. టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబరిచి ఒంటిచేత్తో ఫ్రాన్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే అతను ఫైనల్లో చేసిన ఒక చిన్న తప్పిదం ఫ్రాన్స్ ఓటమికి బాటలు వేయడంతో పాటు కెరీర్‌ను కూడా ముగించింది. ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. అప్పటికే ఫ్రాన్స్ ఇటలీ గోల్ పోస్టులపై దాడి చేస్తూనే ఉంది. అయితే ఇక్కడే జిదానే పెద్ద పొరపాటు చేశాడు. ఇటలీ మిడ్‌ఫీల్డర్ మార్కో మాటెరాజీతో గొడవపడ్డాడు. ఆవేశంలో జిదానే తన తలతో మార్కో చాతిలో గట్టిగా గుద్దాడు నొప్పితో విలవిల్లాడిపోయిన మార్కో అక్కడే కుప్పకూలాడు. అయితే మొదట ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. జిదానే కూడా సైలెంట్‌గా ఉన్నాడు. కానీ రిప్లేలో జిదానే బండారం బయటపడింది. దీంతో రిఫరీ రెడ్ కార్డ్ చూపించడంతో మైదానం వదిలాడు. అలా వెళ్లిన జిదానే మళ్లీ తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. అతనికి అదే చివరి మ్యాచ్ అవుతుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు. జిదానే వైఖరి తప్పుబట్టినప్పటికి అతని ఆటతీరును మాత్రం అందరూ మెచ్చుకోవడం విశేషం. ► పోర్చుగల్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్, 2006 ఫిఫా వరల్డ్‌కప్ ఈ మ్యాచ్‌ను న్యూరేమ్బెర్గ్ యుద్ధం అని పిలుస్తారు. పోర్చుగల్,నెదర్లాండ్స్ మధ్య ప్రి క్వార్టర్స్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ కన్నా గొడవలే ఎక్కువసార్లు జరిగాయి. అందుకే మ్యాచ్‌లో రష్యా రిఫరీ వాలెంటిన్ ఇవనోవ్ ఆటగాళ్లు చేసిన తప్పిదాలకు నాలుగు రెడ్ కార్డ్స్.. 16 సార్లు ఎల్లో కార్డులను జారీ చేశాడు. ఒక ఫిఫా ప్రపంచకప్‌లో మ్యాచ్‌లో అన్నిసార్లు రెడ్, ఎల్లో కార్డులు జారీ చేయడం అదే తొలిసారి. అసలు మ్యాచ్‌లో ఎవరు నెగ్గారనే దానికంటే ఎన్ని కార్డులు జారీ అన్న విషయమే గుర్తుంది. ఇక మ్యాచ్‌లో పోర్చుగల్ 1-0 తేడాతో డచ్‌పై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకుంది. ► 2002 ఫిఫా వరల్డ్‌కప్‌లో సడెన్ డెత్ వివాదం 2002 ఫిఫా వరల్డ్‌కప్‌కు తొలిసారి ఆసియా దేశాలైన జపాన్, సౌత్ కొరియాలు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ ప్రపంచకప్‌లో సౌత్ కొరియా సెమీఫైనల్ వరకు రాగా.. జపాన్ మాత్రం ప్రి క్వార్టర్స్‌లో వెనుదిరిగింది. అయితే స్పెయిన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్ ద్వారా సౌత్ కొరియా సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక ప్రి క్వార్టర్స్‌లో ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో సౌత్ కొరియా సడెన్ డెత్ రూల్‌తో క్వార్టర్స్ చేరడం వివాదాస్పదంగా మారింది. నిర్ణీత సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత టైబ్రేక్‌కు దారితీస్తే అప్పుడు సడెన్ డెత్ కింద పరిగణించి.. ఇద్దరిలో ఎవరు ఎక్కువసార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేస్తే వారిని విజేత కింద లెక్కిస్తారు. దీని ప్రకారం సౌత్ కొరియా ముందంజలో ఉండడంతో వారినే విజయం వరించింది. దీనిపై స్పెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి రూల్స్ ప్రకారమే చేసినట్లు మ్యాచ్ రిఫరీ పేర్కొనడంతో నిరాశగా వెనుదిరిగింది. ఈ వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ► 2010 ఫిఫా వరల్డ్‌కప్: ఘనాపై లూయిస్ సురెజ్ చివరి నిమిషంలో హ్యాండ్‌బాల్ ఈ టోర్నమెంట్ ఆఫ్రికా దేశమైన దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈ టోర్నీలో ఘనాది డ్రీమ్ రన్ అని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఘనా క్వార్టర్స్ వరకు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక క్వార్టర్స్‌లో ఉరుగ్వేతో తలపడింది. మ్యాచ్‌లో ఘనా ఫ్రీ కిక్ పొందింది. ఆ సమయంలో గోల్‌పోస్ట్ వద్ద ఉన్న లూయిస్ సురేజ్ ఘనా ఆటగాడు డొమినిక్ ఆదియ్య హెడర్ గోల్‌ను చేతితో అడ్డుకున్నాడు. దీంతో సురేజ్‌కు రెడ్‌కార్డ్ జారీ చేయడంతో మైదానం వీడాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1-1తొ నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసి పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. ఇక పెనాల్టీ షూటౌట్లో ఉరుగ్వే గోల్ చేసిన ప్రతీసారి సురేజ్ ఎంజాయ్ చేయడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇక షూటౌట్లో ఉరుగ్వే 4-2తో ఘనాను ఓడించి సెమీ-ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: సాగర తీరంలో దూసుకెళ్తున్న రేసింగ్ కార్లు.. క్రికెట్లో ప్రొటీస్.. ఫుట్‌బాల్‌లో డచ్; ఎక్కడికెళ్లినా దరిద్రమే -
‘రాజీనామాకు సిద్ధమా?’.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటవలే విశవిద్యాలయాల వీసీల రాజీనామాలపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం, గవర్నర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సవాల్ విసిరారు గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉందని ముఖ్యమంత్రి ఒక్క ఉదాహరణ చూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాజకీయ జోక్యం అంటూ సీఎం చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ‘ఆర్ఎస్ఎస్కు చెందిన వారిని తీసుకొచ్చేందుకే ఈ పని చేస్తున్నానని వారు తరుచుగా చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ కాకుండా, ఏ వ్యక్తినైనా నా అధికారంతో నామినేట్ చేసినట్లయితే నేను రాజీనామా చేస్తా. దానిని నిరూపించకపోతే ఆయన(సీఎం విజయన్) రాజీనామా చేసేందుకు సిద్ధమేనా? నేను సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నానని సీఎం చెబుతున్నారు. వారు విద్యారంగాన్ని మెరుగుపరుస్తున్నట్లు చెబుతున్నారు. సరైన అర్హత లేని, అనర్హులైన సీపీఎం లీడర్ల బంధువులతో నియామకాలు చేపట్టి ఎలా సాధిస్తారు?’ అని సీఎంపై విమర్శలు గుప్పించారు గవర్నర్ ఆరిఫ్ ఖాన్. కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారిన బంగారం స్మగ్లింగ్ కుంభకోణంపైనా విమర్శలు గుప్పించారు గవర్నర్. స్మగ్లింగ్ కార్యకలాపాలను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రోత్సహిస్తున్నట్లు గమనిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంకి సన్నిహితులైన వారు స్మగ్లింగ్ చేస్తే తాను జోక్యం చేసుకునేందుకు కారణాలు ఉన్నాయని స్పష్టం చశారు. ఇద చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం -
ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం
తిరువనంతపురం: కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు వివాదం ముదురుతోంది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా వర్సిటీ విద్యార్థుల దగ్గర ప్రసంగాలు చేశారని, ఆయనపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్‌కు గవర్నర్ సూచించారు. ఆర్థిక మంత్రిపై తాను విశ్వాసం కోల్పోయానని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలన్న అర్థం వచ్చేలా బుధవారం లేఖ రాశారు. గవర్నర్ డిమాండ్‌ను సీఎం తోసిపుచ్చారు. యూపీ నుంచి వచ్చే విద్యార్థులకు కేరళలో పరిస్థితులు అర్థం కావడం సంక్లిష్టంగా ఉంటుందని ఈ నెల 18న కేరళ వర్సిటీలో విద్యార్థుల సమావేశంలో బాలగోపాల్ అన్నారు. ‘‘మంత్రి తన ప్రమాణాన్ని మరిచారు. దేశ ఐక్యత, సమగ్రతలను తక్కువ చేసి చూపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి పదవిలో ఉండకూడదు. ఆయన నా విశ్వాసాన్ని కోల్పోయారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. మంత్రిపై తనకు పరిపూర్ణ విశ్వాసముందంటూ సీఎం ఘాటుగా బదులిచ్చారు. ఆయనను తప్పించడానికి ఏ కారణాలూ లేవన్నారు. కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం అంశంలో ఇప్పటికే ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. -
ఓయూలో రాహుల్ హీట్
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు వేసవి ఎండలతో వాతావరణం వేడెక్కుతుండగా.. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ హీట్ రగులుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి వైస్ చాన్స్‌లర్ నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఓయూలోని పరిపాలన కార్యాలయంపై కొంతమంది దాడులకు పాల్పడటంతో కేసుల నమోదు, అరెస్టులు, రిమాండ్ వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్నాళ్లుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీసీ రవీందర్ ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్కరణల దిశగా అడుగులేశారు. పీహెచ్‌డీల కాలవ్యవధిని నిక్కచ్చిగా అమలు చేయాలనే ఉద్దేశంతో పాటు క్యాంపస్ పరిధిలో భద్రత ఏర్పాట్లలో కొత్త వ్యక్తుల నియామకం, హాస్టళ్ళపై నిరంతర నిఘా వంటి చర్యలపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత కన్పిస్తోంది. దీనికి తోడుగా రాహుల్ గాంధీ అంశం తెరమీదికి రావడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. వివాదానికి కారణమేంటి? రాహుల్ ముఖాముఖి వివాదంపై విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న ఓయూకి జాతీయ నాయకులను అనుమతిస్తే వర్సిటీకి మరింత బలం చేకూరుతుందని విద్యార్థులు చెబుతుండగా.. విద్య, రాజకీయాలను వేర్వేరుగా చూడటం సరికాదని కాలేజీ రాజకీయ విభాగం అధ్యాపకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అనేక సందర్భాల్లో రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడం సాధారణమేనన్నారు. రాహుల్ ముఖాముఖిని ఈ కోణంలోనే చూస్తే వివాదం ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓయూ క్యాంపస్‌లోకి రాజకీయ కార్యకలాపాలను అనుమతించవద్దనే నిర్ణయం తీసుకున్నామని వీసీ రవీందర్ అంటుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఓయూ విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ చెబుతుండడం గమనార్హం. (చదవండి: ఓయూ రగడ.. ఆగని అరెస్టులు) -
మరో వివాదం రేపిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్
-
బిగ్‌బాస్ హారికకు భారీ షాక్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన దేత్తడి హారికకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ హారికను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్మెంట్ ఆర్డర్ సైతం అందజేశారు. అయితే దీనిపై వివాదం రాజుకుంది. మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది. దీంతో వెంటనే అలర్టెయిన అధికారులు అధికారిక వెబ్సైట్లో హారికకు నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు. అయితే తెలంగాణ టూరిజం అధికారిక ట్విట్టర్లో మాత్రం ఆమె నియామకానికి సంబంధించిన వివరాలు అలాగే ఉన్నాయి. హారికకు ముందు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియమించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో తాజాగా హారికను నియమించగా.. ప్రస్తుతం ఆమె పేరును వెబ్సైట్ నుంచి తొలగించడం కలకలం రేపుతుంది. ఇక హారిక నియామకంపై ఓ రేంజ్లో విమర్శలు వచ్చాయి. అసలు ఏ అర్హత ఆధారంగా ఆమెని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారంటూ నెటిజనులు విమర్శించారు. యూట్యూబ్ స్టార్‌గా సత్తా చాటడం, బిగ్ బాస్‌లో పాల్గొనడమే అర్హతలా అని ప్రశ్నించారు. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఆరు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన మాలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికై వారణాసి మానస తదితరులను ఎంపిక చేయవచ్చు కదా అంటూ సూచించారు. చదవండి: స్టార్ హీరోయినే నా డ్రీమ్: దేత్తడి హారిక -
హారిక నియామకానికి సంబంధించిన వివరాలు తొలగింపు
-
కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు
చెన్నై : ఈ మధ్య కాలంలో పుట్టినరోజు వేడుకల్లో కొన్ని అసాధారణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెరైటీగా ఉంటుందని చెప్పి తల్వార్, గన్‌తో కేక్ కట్ చేస్తున్నారు కొందరు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. జనాలు వారి మీద దుమ్మెత్తిపోయడం వంటివి చూస్తూనే ఉన్నాం. సామాన్యులనే ఇంతలా తిడితే.. ఇక ఇవే పనులు హీరోలు చేస్తే.. ఇంకెంత ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బహిరంగంగా క్షమాపణలు చెప్పే వరకు వదలరు నెటిజనులు. తాజాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వివరాలు నేడు విజయ్ సేతుపతి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో దర్శకుడు పొన్రామ్ తన టీంతో కలిసి విజయ్ కోసం కేక్ తీసుకువచ్చారు. అయితే వెరైటీగా ఉంటుందని చెప్పి కత్తితో కేక్ కట్ చేయించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఓ రేంజ్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని వెల్లడించారు. (చదవండి: గుర్తుండిపోయే జ్ఞాపకం) ఈ మేరకు విజయ్ సేతుపతి తన ట్విట్టర్లో ‘నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఓ ఫోటో ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. దీంట్లో నేను కత్తితో కేట్ కట్ చేశాను. నేను దర్శకుడు పొన్రామ్ చిత్రంలో నటించబోతున్నాను. ఇందులో కత్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక నేను నా పుట్టిన రోజును పొన్రామ్, బృందంతో జరుపుకున్నాను. దాంతో కేక్ కట్ చేయడానికి కత్తిని ఉపయోగించాను. ఈ పనితో నేను సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపానని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. నా పనితో ఎవరినైనా బాధపెట్టినట్లయితే, క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యకు చింతిస్తున్నాను’ అంటూ విజయ్ సేతుపతి తమిళ్లో ట్వీట్ చేశారు. (చదవండి: సిరీస్ కోసం సీరియస్) 🙏🏻 pic.twitter.com/dRRrYrmRd1 — VijaySethupathi (@VijaySethuOffl) January 16, 2021 గతంలో, చెన్నై పోలీసులు తమ పుట్టినరోజు కేక్‌ను కత్తితో కట్ చేసినందుకు స్థానిక గూండాలను అరెస్టు చేశారు. ఇప్పుడు విజయ్ సేతుపతి అదే నేరం చేశారు. మరి తనను కూడా అరెస్టు చేస్తారా అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
అమెరికా ఎన్నికలు; జూనియర్ ట్రంప్ కలకలం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఒట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై మన దేశంలోని విపక్షాలు మండి పడుతున్నాయి. ట్రంప్ తన బుద్ది చూపించుకున్నారు. మనం స్నేహ హస్తం అందిస్తే.. వారు మనల్ని అవమానించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. మంగళవారం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఓ వరల్డ్ మ్యాప్‌ని ట్వీట్ చేశారు. దీనిలో దాదాపు అన్ని దేశాలను రిపబ్లికన్ పార్టీ కలర్ అయిన ఎరుపు రంగులో చూపించారు. అంటే ఈ దేశాలన్ని తన తండ్రి విజయం సాధిస్తాడని నమమ్ముతున్నాయి.. ఆయనకే ఓటు వేస్తాయి అనే ఉద్దేశంతో ఇలా ఎరుపు రంగులో చూపించారు. ఇక ఇండియా, చైనా, లైబేరియా, మెక్సికో వంటి దేశాలను మాత్రం డెమొక్రాట్ పార్టీ రంగు బ్లూ కలర్లో చూపించారు. ఈ దేశాలన్ని జో బైడెన్‌కు మద్దతుదారులని.. ఆయనకే ఓటు వేస్తాయని తెలిపారు. అలానే అమెరికాలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్ వంటి రాష్ట్రాలను కూడా నీలం వర్ణంలోనే చూపించారు. ఒకే చివరకు నా ఎన్నికల మ్యాప్ అంచనా ఇలా ఉంది అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ ట్వీట్లో అతడు జమ్ము కశ్మీర్, లద్దాఖ్, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను ఎరుపు రంగులో చూపించాడు. అది కాస్తా వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్షాలు మండి పడితున్నాయి. (చదవండి: ట్రంప్ గెలిస్తే అతనికి 112 కోట్లు) Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb — Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020 మనం స్నేహితుడని భావిస్తే.. ట్రంప్ బుద్ధి చూపించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ట్వీట్‌పై స్పందించారు. ‘సీనియర్ ట్రంప్‌తో మనకు ఎంతో స్నేహం. ఇక జూనియర్ ట్రంప్ ఇండియాని జో బైడెన్, కమలా హారిస్ మద్దుతుదారుగా చూపించారు. ఆశ్చర్యం ఏంటంటే.. జమ్ము కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు మాత్రమే ట్రంప్‌కి ఓటు వేస్తాయని వెల్లడించారు. ఎవరైనా అతడి కలర్ పెన్సిల్ని లాక్కొండి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. So much for the friendship with Trump Senior. Junior has placed India firmly with @JoeBiden & @KamalaHarris though interestingly Jr. believes J&K & the NorthEast go against the rest of India & will vote Trump. Someone needs to take his colouring pencils away. https://t.co/AqVyX4ixdl — Omar Abdullah (@OmarAbdullah) November 3, 2020 అలానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయుకుడు శశి థరూర్ కూడా జూనియర్ ట్వీట్‌పై స్పందించారు. ‘నమో బ్రొమాన్స్‌కు దక్కిన బహుమతి ఇది. డాన్ జూనియర్ భారత్‌లోని జమ్ము కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలను చైనా, మెక్సికో వంటి శత్రువులు, మురికి ప్రదేశాలతో కలిపారు. సెరినేడింగ్ ఈవెంట్ల కోసం కోట్లు ఖర్చు చేసినందుకు దక్కిన ఫలితం ఇది’ అన్నారు. (చదవండి: అమెరికా అధ్యక్షులెవరో తేలకపోవచ్చు!) The price of Namo’s bromance: Kashmir & the NorthEast cut off from the rest of India, &the whole “filthy" place relegated by Don Jr to the realm of hostiles, along with China&Mexico. So much for the crores spent on obsequious serenading stadium events! https://t.co/fsI53aSkpv — Shashi Tharoor (@ShashiTharoor) November 3, 2020 మరోవైపు భారతదేశానికి మాజీ పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ మ్యాప్‌ని "ప్రోత్సాహకరంగా"ఉంది అంటూ ప్రశంసించారు. "మంచిది. జమ్మూ కాశ్మీర్‌ని పాకిస్తాన్లో భాగంగా చూపించారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. Good. Jammu and Kashmir is shown as part of Pakistan. Very encouraging. https://t.co/cAwqYniOct — Abdul Basit (@abasitpak1) November 3, 2020 -
కాక రేపుతున్న పాపడం..
న్యూఢిల్లీ: భారతీయ ఆహారంలో పాపడాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వెజిటేరియన్ భోజనంలో పాపడం తప్పని సరి. అయితే గత కొద్ది రోజులుగా పాపడం ఏదో ఓ కారణంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పాపడ్‌తో కరోనా పరార్.. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే పాపడాలు తినాలంటూ ఓ మంత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. తాజాగా పాపడం మరో సారి వార్తల్లో నిలిచింది. 2014లో చిన్నారుల కోసం కంపోజ్ చేసిన ఓ పాపడం పాట ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. విగ్లెస్ అనే పిల్లల సంగీత బృందం సభ్యుడైన ఆంథోనీ డోనాల్డ్ జోసెష్ ఫీల్డ్ అనే ఆస్ట్రేలియా సంగీతకారుడు దీనిని స్వరపరిచారు. దాదాపు ఆరేళ్ల నాటి పాట తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాక వివాదాస్పదంగా మారింది. ఇక ఈ వీడియోలో ఆస్ట్రేలియన్ల బృదం "పాపడం" పాటను పాడతారు. దీనిలో ఒక దక్షిణాసియా మహిళ కూడా ఉంది. అయితే ఆమె నోటి వెంట ఎలాంటి పదాలు వెలువడవు.. పైగా ఏదో బలవంతంగా నవ్వుతూ.. ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం వీడియోలో చూడవచ్చు. (చదవండి: ‘ఈ పాపడ్‌తో కరోనా పరార్’) ఆమె కాక మిగతా అందరూ "పాపడం" అనే పదాన్ని పదేపదే జపిస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో, ఈ టీంలోని ఒకరు క్రికెట్ బ్యాట్‌ని ఊపుతూ, పాటను పాడతాడు. ఇది క్రికెట్ పట్ల భారతదేశ ప్రేమను సూచిస్తుంది. సాంస్కృతిక ప్రాతినిధ్యంపై అవగాహన కల్పించడానికి 2014 లో పిల్లల కోసం రాసిన పాట అకస్మాత్తుగా దేశీ సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘2020లో ఇలాంటివి ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో.. మీ ఆలోచన బాగుంది.. ఆచరణ బాగాలేదు.. ఇలాంటి పాటతో పిల్లలకు ఏం బోధించాలనుకుంటున్నారు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వివాదం తలెత్తడంతో ఫీల్డ్ దీనిపై స్పందించారు. ‘భారతీయ సమాజాన్ని సాంస్కృతికంగా కించపరిచే ఉద్దేశం నాకు లేదు. క్షమించండి’ అని కోరారు. Al, I wrote the song, and directed the clip in 2014 (which was meant as a celebration). It was not my intention to be culturally insensitive to the Indian community, or to add value to ethnic stereotyping. Apologies . — Anthony Field (@Anthony_Wiggle) October 22, 2020 -
వివాదంలో 800: స్పందించిన మురళీధరన్
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ప్రస్తుతం '800' పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అయితే కొన్ని తమిళ సంఘాలు, సంస్థలు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక జాతీయ జట్టుకు ఆడి మురళీధరన్ తమిళ జాతికి ద్రోహం చేశారని అవి ప్రచారం చేస్తున్నాయి. మురళీధరన్ పాత్రలో నటిస్తున్నందుకు విజయ్ సేతుపతిపై మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై మురళీధరన్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ జీవితంలో నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నా వ్యక్తిగత జీవితం, క్రికెట్ జీవితం గురించి చాలా మంది మాటలన్నారు. ఇప్పుడు '800' చిత్రం కూడా నా జీవితం గురించే చర్చిస్తుంది కాబట్టి, దీనిపైనా విమర్శలు వస్తాయి. అయితే, నేను కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను’ అన్నారు ‘ఈ చిత్రాన్ని కొందరు వివిధ కారణాలతో రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. నేను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూపిస్తున్నారు. గత ఏడాది నేను 2009 నాకు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అయితే కొందరు దీన్ని వక్రీకరించి 'శ్రీలంకలో తమిళులను పెద్ద సంఖ్యలో చంపిన ఏడాది మురళీధరన్‌కు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరమట' అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఓ సామాన్యుడి కోణంలో ఆలోచించండి. దేశంలో యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో 2009లో యుద్ధం సమాప్తమైంది. ఓ సామాన్యుడిగా సురక్షితంగా ఉన్నామన్న భావన నాకు కలిగింది. పదేళ్లుగా ఇరువైపులా మరణాలు లేవు. అందుకే, 2009ని నేను అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అమాయకులను చంపడాన్ని నేను ఎప్పుడూ సమర్థించలేదు. సమర్థించబోను’ అని మురళీధరన్ స్పష్టం చేశారు. (చదవండి: ‘800’ వివాదం.. జనాలకు ఏం పని లేదా?!) అంతేకాక ‘నా జీవిత కథను సినిమాగా తీస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినప్పుడు మొదట నేను తటపటాయించా. కానీ, ఆ విషయం గురించి ఆలోచించన తర్వాత, మురళీధరన్‌గా నేను సాధించిన విజయాలు నా ఒక్కడివే కాదనిపించింది. నా తల్లిదండ్రుల సహకారం ఇందులో ఎంతో ఉంది. నా ఉపాధ్యాయులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు అందరూ నా వెనుక ఉన్నారు. సినిమాతో వాళ్లకు గుర్తింపు వచ్చినట్లవుతుందని అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను’ అని తెలిపారు. ఇక "శ్రీలంక తమిళులు చనిపోతున్నప్పుడు ముత్తయ్య ఫిడేలు వాయించారు. తన సొంత ప్రజలు చనిపోయినప్పుడు అతను ఆనందించారు. అలాంటి వ్యక్తి క్రీడాకారుడిగా ఎంత సాధించినా ఉపయోగం ఏమిటి? మనకు సంబంధించినంతవరకు, ముత్తయ్య నమ్మకద్రోహం చేసాడు" అని ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా విమర్శించారు. (చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు! ) పీఎంకే చీఫ్ డాక్టర్ పి రామదాస్ మాట్లాడుతూ, "విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతాడు" అని తెలిపారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు, డార్ మోషన్ పిక్చర్స్, ఈ సినిమా "పూర్తిగా స్పోర్ట్స్ బయోగ్రఫీ" అని, దీనిలో శ్రీలంకలో తమిళుల పోరాటాలను తక్కువ చేసే సన్నివేశాలను చూపించమని చెప్పారు. ఈ వివాదాలపై విజయ్ సేతుపతి ఇంకా స్వయంగా స్పందించలేదు. 2017లో నటుడు, రాజకీయ నాయకుడు రజనీకాంత్ తన 2.0 చిత్రం నిర్మాతలు ఏర్పాటు చేసిన శ్రీలంక కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. నిరాశ్రయులైన తమిళులకు ఇళ్లను పంపిణీ చేయడానికి నిర్ణయించిన ఈ కార్యక్రమాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. దీని ద్వారా తమిళులు పునరావాసం పొందారని అంతర్జాతీయ సమాజానికి తప్పుడు ప్రచారం చేయడానికి శ్రీలంక తన పర్యటనను ఉపయోగించుకోవచ్చని రజనీని హెచ్చరించాయి. -
జ్యోతిక వ్యాఖ్యలను సమర్థించిన సూర్య..
చెన్నై : ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ప్రముఖ నటి జ్యోతిక చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆలయాల తరహాలోనే ఆసుపత్రులు, పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న జ్యోతిక వ్యాఖ్యలపై పలువురు హిందూవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై జ్యోతిక క్షమాపణ చెప్పాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జ్యోతిక చేసిన వ్యాఖ్యలను ఆమె భర్త, ప్రముఖ హీరో సూర్య సమర్థించారు. తమ కుటుంబం జ్యోతిక అభిప్రాయానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. జ్యోతిక ఆలోచనను చాలా మంది స్వాగతిస్తున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి సూర్య సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. ద్వేషాన్ని కాదని.. ప్రేమను పంచాలని ఆయన కోరారు. ‘చెట్లు ప్రశాంతగా ఉన్నప్పటికీ.. గాలి వాటిని అలాగే ఉండనివ్వదు. ఓ అవార్డు ఫంక్షన్లో నా భార్య చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే తీవ్ర చర్చకు దారితీసింది. దేవాలయాలకు విరాళాలు ఇచ్చిన మాదిరిగానే.. పాఠశాలలకు, హాస్పిటల్స్‌కు కూడా విరాళాలు ఇవ్వాలనేదే ఆమె అభిప్రాయం. కానీ ఓ వర్గం ప్రజలు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదు. స్వామి వివేకానంద సహా ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు.. మతం కన్నా మానవత్వం గొప్పదని చెప్పారు. నేను ఇదే విషయాన్ని నా పిల్లలకు కూడా చెబుతాను. ఆధ్యాత్మికవేత్తల భోదన నుంచి పొందిన ప్రేరణతో జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు మా కుంటుంబం మద్దతుగా నిలుస్తోంది. ఆమె ప్రసంగంలోని సారాంశాన్ని అర్థం చేసుకున్న చాలా మంది ఈ సమయాల్లో కూడా మద్దతుగా నిలిచారు. వారందరి నా కృతజ్ఞతలు’ అని సూర్య పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే.. సూర్యతో పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటున్న జ్యోతిక.. ఇటీవలి కాలంలో నటనుకు ప్రాధాన్యమున్న పాత్రల్లో, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్లామ్ఫామ్లో విడుదల కానుంది. #அன்பைவிதைப்போம் #SpreadLove pic.twitter.com/qjOlh8tHtV — Suriya Sivakumar (@Suriya_offl) April 28, 2020 చదవండి : ఓటీటీకే ఓటు -
ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్!
హైదరాబాద్ ఫిల్మ్‌చాంబర్‌లోని నిర్మాతల మండలి హాలులో ఆదివారం (20వ తేదీ) తెలుగు సినిమా నటీనటుల సంఘం ‘మా’ జనరల్ ఆత్మీయ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్ కార్యదర్శి జీవితారాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘ఆదివారం జరిగిన సమావేశాన్ని ఆత్మీయ సమ్మేళనం, ఆంతరంగిక సమ్మేళనం, ‘మా’ సమావేశం.. ఇలా ఏదైనా అనుకోవచ్చు. ఈ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన సమావేశ వివరాలను ‘మా’ కార్యవర్గం ఆమోదం మేరకు తెలియజేస్తున్నా. ఆదివారం 9గంటల నుంచి సాయత్రం 5.30 గంటల వరకు సమావేశం జరిగింది. 28 మంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. వాటిని మేం పరిష్కరించుకోలేకపోయాం. మెజారిటీ సభ్యులు అత్యవసరంగా ‘ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్’ పెట్టుకోవాలని సూచనలు చేశారు. ఆ సమావేశంలో ‘మా’ లాయర్ గోకుల్‌గారు, కోర్టులో కేసు వేసిన వరప్రసాద్‌గారు కూడా ఉన్నారు. ‘మా’లో ఉన్న 900 మందికిపైగా సభ్యుల్లో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే 21రోజుల్లోగా ‘ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్’ జరుగుతుంది. సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే సభ్యులందరూ ‘మా’ ఆఫీసుకు వచ్చి సంతకాలతోనో, రావడానికి సాధ్యం కాకపోతే ఈమెయిల్ ద్వారానో, పోస్ట్ ద్వారానో ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. -
కౌశల్ ఆర్మీకి ప్రతీ రూపాయికి లెక్క ఉంది..
బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్‌కు.. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన కౌశల్ ఆర్మీకి మధ్య వివాదం ముదురుతోంది. ఫౌండేషన్ డబ్బును కౌశల్ ఇష్టం వచ్చినట్టుగా వృధా చేస్తున్నాడంటూ ఆరోపిస్తు ఆర్మీ సభ్యులు ఎదురు తిరగటంతో కౌశల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘మూడు నెలల క్రితం స్థాపించిన కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించిన అన్ని వివరాలు జెన్యూన్‌గా ఉన్నాయి. ప్రతీ రూపాయికి లెక్క ఉంది. కావాలంటే ఎవరైనా ఆడిటింగ్ చేసుకోవచ్చు. నేను డబ్బు మనిషిని కాను. ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నన్ను అభిమానించిన ప్రతీ ఒక్కరికీ నేను కృతజ్ఞడుని. బిగ్‌బాస్ గేమ్‌ను నేను ఎంతో కష్టపడి గెలిచాను. అలాంటిది నా మీద ఓ మీడియా సంస్థ (సాక్షి కాదు) నా గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది. 20 సంవత్సరాలు కష్టపడితే నాకు వచ్చిన మంచి అవకాశం బిగ్ బాస్ 2. సామాన్యుడైన కౌశల్ ఈ స్థాయికి రావటం ఇష్టం లేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆర్మీ తరపున చేసే ప్రతీ కార్యక్రమం రికార్డెడ్. అన్ని వివరాలు ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. నా కుటుంబాన్ని కూడా వదిలి కౌశల్ ఆర్మీ కోసం పనిచేస్తున్నా. నా పై ట్రోలింగ్ చేస్తున్న ఆరుగురిపై సైబర్ క్రైమ్ పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేసాన’ని తెలిపారు. -
క్రిష్‌పై కంగనా సోదరి ఫైర్
వివాదాల నడుమ విడుదలైన మణికర్ణిక చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాపై ఇంత హైప్ క్రియెట్ కావడానికి వివాదాలు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. తొలుత ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం మణికర్ణిక వివాదంపై క్రిష్ స్పందించారు. హీరోయిన్ కంగనా రనౌత్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. తన పట్ల ఆమె చాలా దురుసుగా ప్రవర్తించిందని కూడా తెలిపారు క్రిష్. (‘మణికర్ణిక’ వివాదంపై స్పందించిన క్రిష్) అయితే క్రిష్ చేసిన వ్యాఖ్యలపై కంగన సోదరి రంగోలి స్పందించారు. క్రిష్‌ను ఉద్దేశిస్తూ.. ‘డైరెక్టర్‌గారు.. సినిమా మొత్తం మీరే తీశారు. మేం ఒప్పుకుంటా. కానీ తెర మీద మొత్తం కంగనానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విజయాన్ని, ప్రశంసల్ని ఆమె ఆస్వాదిస్తుంది. తనను ఒంటరిగా వదిలేయండి. దయచేసి మీరు ప్రశాంతంగా ఆసీనులుకండం’టూ రంగోలి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. పత్రికలుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా 70 శాతం సినిమాను తానే డైరెక్ట్ చేసినట్లు చెప్పారు. అయితే ఈ విషయాన్ని క్రిష్ ఖండించారు. కంగనా కేవలం 30 శాతం సినిమాను మాత్రమే తెరకెక్కించిందని తెలిపారు. ఒకరు చేసిన పనిని తనదిగా చెప్పుకుంటున్న ఆమెకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదని క్రిష్ వ్యాఖ్యానించారు. తాను తీసిన సన్నివేశాలనే మళ్లీ చిత్రీకరించి ఆమె పేరు వేసుకుందన్నారు. @DirKrish chalo man liya you directed the whole film now please calm down, still Kangana is the leading face of the film let her enjoy this moment of her success and great appreciation, please leave her alone, we all believe you now please take a seat 🙏 https://t.co/rInLkrHreO — Rangoli Chandel (@Rangoli_A) January 28, 2019 -
‘నా సినిమా రిలీజ్ లేదు.. కావాలనే ఇలా చేశారు’
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ముద్ర. తమిళ సినిమా కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తిగా కావచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ వారమే(25-01-2019) రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా పేజ్‌లో ‘ఈ వారం నా సినిమా రిలీజ్ కావటం లేదు. కొంత మంది వ్యక్తులు కావాలనే నా సినిమా టైటిల్‌ను సేమ్ డిజైన్‌తో వాడుకున్నారు. టికెట్ బుకింగ్ యాప్‌లో నా పేరును కూడా వాడుతున్నారు. మా నిర్మాతలు ఆ వ్యక్తులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా’మన్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ముద్ర సినిమా నిర్మాణకార్యక్రమాలు జరుపుకుంటోంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. Guys My Movie is NOT RELEASING this week... SOME ppl with evil intentions have used the exact SAME LOGO DESIGN nd put MY NAME in the BOOKINGS APP... My Producers are on the case and will UPDATE u soon with the details.. This is disgraceful 👇 #Mudra pic.twitter.com/2c4IzXaVIV — Nikhil Siddhartha (@actor_Nikhil) 24 January 2019 -
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న వివాదాస్పద చిత్రం
విమర్శలు, వివాదాలు, కేసుల మధ్య మహా చిత్రం ఒక ఘట్టాన్ని దాటింది. నటి హన్సిక నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది ఈ అమ్మడి 50వ చిత్రం అన్న విషయం తెలిసిందే. ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై వి. మదియళగన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. మహ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో తెలిసిందే. హన్సిక కాషాయ వాస్త్రాలు ధరించి, నోటీ నిండా పొగతో చేతిలో సిగరెట్‌తో కాశీ పట్టణం తీరంలో సింహాసనంలో దర్జాగా కూర్చున్న దృశ్యంపై తీవ్ర దుమారం రేపింది. ఇవన్నీ అసలు పట్టనట్లు ఆ చిత్ర నిర్మాత వి.మదియళగన్ శనివారం ఒక ప్రకటనను విడుదల చేస్తూ, మాగ్నెటింగ్, అలూరింగ్, హిడ్డన్, అగ్రెస్సీవ్ వంటివి మహా చిత్రంలో ఇంకా చాలా ఉంటాయని పేర్కొన్నారు. ఈ చిత్రం మొత్తం తమిళ చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుందన్నారు. సాధారణంగా నిర్మాతలు స్టార్ తారాగణాన్ని, ప్రముఖ దర్శకులను, ప్రముఖ సాంకేతిక నిపుణులను తమ చిత్రాల్లో ఉండాలని కోరుకుంటారన్నారు. తనకు మాత్రం ప్రణాళిక ప్రకారం, నిబద్ధతతో పనిచేసే చిత్ర టీమ్ లభించడం ఆనందంగా ఉందన్నారు. మహా చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ సంతృప్తిగా పూర్తి చేశారని చెప్పారు. అందుకు నటి హన్సిక, దర్శకుడు జలీల్, ఛాయాగ్రాహకుడు లక్ష్మణ్ ఇలా అందరి సహకారం చాలా సంతోషాన్నికలిగిస్తోందని అన్నారు. ఈయన నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న కొలైయుధీర్ కాలం, అరుణ్ విజయ్ హీరోగా బాక్సర్ చిత్రాలను నిర్మిస్తున్నారు. వీటిలో నయనతార నటించిన కొలైయుధీర్ కాలం చిత్రం త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
మహా వివాదంపై వివరణ
హన్సిక లేటెస్ట్ చిత్రం ‘మహా’ ఫస్ట్ లుక్ పోస్టర్ల మీద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. హన్సిక కాషాయ వస్త్రాలు ధరించి ధూమపానం చేస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ఈ పోస్టర్స్ మీద కొందరు అభ్యంతరాలు తెలిపారు. మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ విషయం గురించి చిత్రదర్శకుడు యుఆర్ జమీల్ స్పందిస్తూ – ‘‘మా ఫస్ట్ లుక్ గురించి అందరి కామెంట్స్ చూశాను. దర్శకుడిగా నా ఉద్దేశం ఎవరినీ హర్ట్ చేయాలని కాదు. కొత్తగా చూపించాలనుకున్నాను. కుల, మతాలకు సంబంధించిన సెంటిమెంట్స్‌ను దెబ్బతీసే ఉద్దేశం అయితే అస్సలు లేదు. హిందూ, ముస్లిం మతాలను కాదు, మానవత్వాన్ని నమ్ముతాను నేను. దయ చేసి ఇందులోకి కులాలు, మతాలకు సంబంధించిన యాంగిల్‌ను తీసుకురావద్దు’’ అని పేర్కొన్నారు. ‘మహా’ హన్సిక కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. -
పెరియార్‌కుత్తుకు చిందేసిన శింబు
సంచలనం, కలకలం, వివాదం, అంతకు మించి ప్రతిభ ఇవన్నీ కలిస్తే శింబు. ఈ యువ నటుడు పాడినా, మాట్లాడినా, ఆడినా వార్తే. అలా శింబు ఎప్పుడూ ప్రత్యేకమే. శింబు షూటింగ్‌కు సరిగా రారు, నిర్మాతలను ఇబ్బంది పెడతారు, దర్శకులతో గొడవ పడతారు లాంటి ఆరోపణలూ ఉన్నాయి. ఆ మధ్య విజయాలకు దూరమై విమర్శలకు బాగా దగ్గరైన శింబుపై రెడ్ కార్డ్ పడనుందనే దుమారం వరకూ పరిస్థితులను తెచ్చుకున్న నటుడు శింబు. ఇక ఆ మధ్య బీప్ పాటతో పోలీసులకు ఫిర్యాదు, కేసులు, కోర్టులు వరకూ వెళ్లారు. అలాంటివి తగ్గి ఇటీవల నటించిన సెక్క సివంద వానం చిత్ర విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శింబు నటుడిగా బిజీ అయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం వందా రాజాదాన్ వరువేన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. చేతిలో చాలా అవకాశాలు ఉన్నాయి కూడా. ఇలాంటి సమయంలో పెరియార్ కుత్తు అనే ప్రైవేట్ ఆల్బ మ్తో మరోసారి సంచలనానికి రెడీ అయ్యారు. తమిళనాడులో పెరియార్‌కు చాలా ఉన్నత భావాలు కలిగిన రాజకీయ సామాజిక వాది అనే పేరు ఉంది. అలాంటి నాయకుడి పేరుకు కుత్తు (ఐటమ్ సాంగ్‌కు కుత్తు పదాన్ని వాడతారు) పదం చేర్చి శింబు పాడి, ఆడిన పాటతో కూడిన ఆడియోను శుక్రవారం యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. జాతి, మత వివక్షతను ఎండగట్టేలా సాగే ఆ పాటకు నటుడు శింబు నల్లషర్టు, ప్యాంటు ధరించి గ్రాఫిక్స్‌తో రూపొందించిన పెరియార్ శిల వద్ద ఐటమ్ సాంగ్ మాదిరి చిందులేస్తూ నటించడం విశేషం. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ దుమ్మురేపుతోంది. మరి ఈ వీడియోను ఎవరు ఏ విధంగా కెలికి వివాదంగా తెరపైకి తీసుకొచ్చారో చూడాలి. -
ఫస్ట్ లుక్ వివాదం.. కష్టాల్లో హీరోయిన్
హీరోయిన్ కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేయటమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాదించిన సౌత్ బ్యూటీ హన్సిక. అయితే త్వరలో తన 50వ సినిమా ‘మహా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న హన్సికకు ఆ సినిమా కారణంగా వివాదాలు ఎదురవుతున్నాయి. మహా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేసారు. అయితే ఆ లుక్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలను ధరించిన హన్సిక, సింహాసనం లాంటి కుర్చిలో కూర్చొని హుక్కా తాగుతున్నట్టుగా ఉన్న స్టిల్‌ను ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ పీఎంకే పార్టీ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించటంతో సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది. యు.ఆర్.జెమిల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 50వ సినిమా కావటంతో హన్సిక కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఈ వివాదం కారణంగా హన్సికకు మరింత ప్రచారం లభిస్తుందో లేక సినిమానే ఇబ్బందుల్లో పడుతుందో చూడాలి. -
సద్దుమణిగిన ‘ మా అసొషియేషన్’ వివాదం
-
సద్దుమణిగిన ‘మా’ వివాదం
గత కొద్ది రోజులుగా మా అసొషియేషన్‌లో వివాదాలు ఇండస్ట్రీని కుదిపేశాయి. శివాజీరాజా, నరేష్‌లు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన ఇండస్ట్రీ పెద్దలు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విషయంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వజ ‘అన్ని సంస్థలలో ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇరు వర్గాలు ప్రెస్‌మీట్ పెట్టి తప్పు చేశారు. ఇక నుండి అన్నీ విషయాలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే చూసుకుంటుంద’న్నారు. ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన కలెక్టివ్ కమిటీలో ‘మా’లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేలిందని తెలిపారు. ఇక నుంచి మా అధ్యుక్షుడు శివాజీ రాజా, సెక్రటరీ నరేష్‌లు కలిసి పనిచేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో కలెక్టివ్ కమిటీనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందన్నారు. నరేష్ మాట్లాడుతూ.. ‘సంస్ధ లో డిఫరెంట్ ఓపినియన్స్ రావటం సహజం. కలెక్టివ్ కమిటీ ద్వారా అందరం కలుసుకొని మాట్లాడుకున్నాం. గతం గతః. రాబోయే రోజుల్లో జరిగే ఈవెంట్స్ కలిసి సక్సెస్ చేస్తాం. నేను, శివాజీ రాజా గారు సినీ పెద్దల సపోర్ట్ తో సిల్వర్ జూబ్లీ ఈవెంట్ లను సక్సెస్ చేయటానికి కృషి చేస్తాం’ అన్నారు. అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ.. చిన్న చిన్న మనస్పర్దలు వచ్చిన మాట వాస్తవమే.. కలెక్టివ్ కమిటీ ముందు అన్నీ వివరాలు ఉంచాము. ఎలాంటి అవకతవకలు లేవని తేలిందన్నారు. -
టాయిలెట్‌పై ఫన్నీ ట్వీట్ : నెటిజన్ల ఆగ్రహం
ఆసియాలోని టాయిలెట్లపై ఓ అమెరికన్ టీవీ స్టార్ చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. కొందరు అది అతనిది అమాయకత్వం అంటుంటే, మరికొందరు మాత్రం అతనిపై మండిపడుతున్నారు. ఇటీవల ఆసియా పర్యటనకు వచ్చిన డీన్ మైఖేల్ వాష్ రూమ్‌లోని మరుగుదొడ్డి పక్కన ఉన్నటువంటి హ్యాండ్ స్ప్రెయర్ గురించి ఓ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. మాములుగా కడుక్కోవడానికి వాడే హ్యాండ్ స్ప్రెయర్‌ను దప్పిక తీర్చుకోవడానికి వాడతారని పేర్కొన్నాడు. ‘నేను ఇక్కడి టాయిలెట్లను ఇష్టపడుతున్నానను ఎందుకంటే.. వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఒకవేళ దాహం వేస్తే తాగాడానికి వీలుగా వాటర్ పంప్(హ్యాండ్ స్ప్రెయర్‌ను ఉద్దేశించి) అందుబాటులో ఉంచార’ని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది మైఖేల్ వ్యంగ్యంగానే ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌తో పాటు, పలు ఆసియా దేశాలకు చెందిన నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా అని నీకు ఎవరు చెప్పారు, రెస్ట్‌రూమ్‌లలో పేపర్స్ ఉండేది మీరు నవలలు రాసుకోవడానికా?, మేము నీకు వాటర్‌కు బదులు జూస్ పెడతాం.. అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. I love how bathrooms here have this water hose next to the toilet incase you get thirsty while in the restroom pic.twitter.com/xsfrFeYkzh — Dean Michael Unglert (@deanie_babies) July 10, 2018 -
ఎంపీలు వస్తే అధికారులు లేచి నిలబడాలి..
సాక్షి, చండీగఢ్ : హరియాణలో బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సభ్యులు సందర్శిస్తే అధికారులు లేచి నిలబడాలని సూచించింది. ఎంపీల పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అధికారులు తమను ఖాతరు చేయడం లేదని ఎంపీలు హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఫిర్యాదు చేయడంతో 2011 మార్గదర్శకాలను ఉటంకిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్యాలయాల్లోకి పార్లమెంట్ సభ్యులు ప్రవేశించగానే సంబంధిత అధికారులు అప్రమత్తమై లేచి నిలబడి,వారిని స్వాగతించాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. హరియాణ మంత్రి అనిల్ విజ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిందని నిర్ధారించారు. మరోవైపు ఈ ఉత్తర్వులపై అధికారులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ అధికారుల హోదాను దిగజార్చడంతో పాటు వారి స్థాయిని తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ అధికారులు ఇలా సమయాన్ని వృధా చేయడం సరికాదని, ఈ పనులు దిగువస్థాయి సిబ్బందికి అప్పగిస్తే బాగుండేదని మరికొందరు సీనియర్ అధికారులు వాపోయారు.